For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

75th Independence Day: బ్రిటీష్ వారు భారత్ కు ఆగస్టు 15నే ఎందుకు స్వాతంత్య్రాన్ని ప్రకటించారో తెలుసా?

ఇండియాలో ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈ సంవత్సరం మనం ఆగస్టు 15వ తేదీన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. స్వాతంత్య్ర దినోత్సవ రోజు కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటాడు. మన దేశంలోని ప్రతి వ్యక్తి ఈ తేదీని గౌరవంగా, గర్వంగా భావిస్తారు.

Why Independence Day is celebrated on 15th August in india

అయితే మన భారతదేశానికి బ్రిటీష్ వారు ఆగస్టు 15వ తేదీనే ఎందుకు విముక్తి చేశారు. భారత స్వాతంత్య్ర బిల్లు ప్రకారం, భారతదేశాన్ని విముక్తి చేసే తేదీని మాత్రం జూన్ 1948గా నిర్ణయించారు.

Why Independence Day is celebrated on 15th August in india

సంవత్సరం క్రితం నిర్ణయించిన తేదీకి ముందే భారతదేశాన్ని ఎందుకు విముక్తి చేశారో తెలియజేసే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. అయితే దీని గురించి చరిత్రకారులు విభిన్నమైన వాస్తవాలు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సి.రాజగోపాలచారి సూచనల మేరకు..

సి.రాజగోపాలచారి సూచనల మేరకు..

భారతదేశానికి స్వాతంత్య్రం కోసం మౌంట్ బాటన్ ఆగస్టు 15వ తేదీని ఎన్నుకున్నట్లు సి.రాజగోపాలచారి సూచన మేరకు, లార్డ్ మౌంట్ బాటెన్ మాట్లాడుతూ జూన్ 3వ తేదీ, 1948 వరకు వేచి ఉంటే, బదిలీ చేయడానికి అధికారం మిగిలి ఉండదని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ విధంగా మౌంట్ బాటన్ ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్యాన్ని ప్రకటించడానికి నిర్ణయం తీసుకున్నారు.

భారత స్వాతంత్య్ర బిల్లు ప్రకారం..

భారత స్వాతంత్య్ర బిల్లు ప్రకారం..

1930లో కాంగ్రెస్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి జనవరి 26వ తేదీని ఎంచుకుంది. అయితే భారత స్వాతంత్య్ర బిల్లు ప్రకారం, బ్రిటీష్ పరిపాలన జూన్ 3, 1948వ తేదీని అధికార బదిలీని నిర్ణయించింది. 1947 ఫిబ్రవరి నెలలో బ్రిటీష్ ప్రధాని క్లెమెంట్ రిచర్డ్ అట్లీ జూన్ 3, 1948 నుండి భారతదేశానికి సంపూర్ణ స్వపరిపాలన హక్కును ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే మౌంట్ బాటన్ వచ్చిన తర్వాత ఆ తేదీ మొత్తం మారిపోయింది. ఫిబ్రవరి 1947లోనే లూయిస్ మౌంట్ బాటన్ భారతదేశపు చివరి వైశ్రాయ్ గా నియమితులయ్యారు. మౌంట్ బాటన్ గతంలో పొరుగు దేశమైన బర్మాకు గవర్నర్. భారత్ కు అధికారాన్ని క్రమపద్ధతిలో బదిలీ చేసే బాధ్యత కూడా ఆయనకు అప్పగించారు.

ఆగస్టు 15 శుభమని..

ఆగస్టు 15 శుభమని..

వైశ్రాయ్ మౌంట్ బాటన్ ఆగస్టు 15వ తేదీని శుభప్రదంగా భావించారని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఈరోజున బ్రిటన్ మరియు మిత్ర రాజులు జపాన్ ను అప్పగించి రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించాయి. అప్పుడు మౌంట్ బాటన్ మిత్ర రాజ్యాల దళాలకు కమాండర్ గా ఉన్నారు. అందువల్ల, మౌంట్ బాటన్ బ్రిటీష్ పరిపాలకులతో మాట్లాడిన తర్వాత, భారతదేశానికి పూర్తిగా విముక్తి చేసే తేదీని జూన్ 3, 1948 నుండి ఆగస్టు 15, 1947కు మార్చేశారు.

మరో కారణం కూడా..

మరో కారణం కూడా..

1948 జూన్ 3కు బదులుగా బ్రిటీష్ ప్రభుత్వం 1947 ఆగస్టు 15న భారతదేశానికి పూర్తిగా అధికారాన్ని బదిలీ చేయడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే, క్యాన్సర్ తో చాలా కాలంగా బాధపడుతున్న మహమ్మద్ అలీ జిన్నా అనే ఆలోచన బ్రిటీష్ వారికి వచ్చిందట. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిన్నా లేకపోతే మహాత్మ గాంధీ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోకూడదనే ప్రతిపాదనపై ముస్లింలను ఒప్పించగలరని బ్రిటీష్ వారు ఆందోళన చెందారు. చివరికి బ్రిటీష్ 1947 ఆగస్టు 15న భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేశారు. బ్రిటీష్ వారు ఊహించినట్లుగానే ఇదంతా జరిగిన కొన్ని నెలల తర్వాత జిన్నా మరణించాడు.

మూడు దేశాలకు స్వాతంత్య్రం..

మూడు దేశాలకు స్వాతంత్య్రం..

ఆగస్టు 15వ తేదీన మన దేశంతో పాటు మరో మూడు దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అవి ఏవంటే.. ఒకటి దక్షిణ కొరియా. ఈ దేశం 1945 ఆగస్టు 15న జపాన్ నుండి స్వాతంత్య్రం పొందింది. రెండోది కాంగో. 1960వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందింది. ముచ్చటగా మూడోది బహ్రెయిన్. ఈ దేశం 1971న ఆగస్టు 15న బ్రిటన్ నుండి స్వాతంత్య్రం పొందింది.

English summary

Why Independence Day is celebrated on 15th August in india

The British Parliament had given Lord Mountbatten an ultimatum to transfer the power by June 30, 1948. But, the process was fast-forwarded to August 1947
Desktop Bottom Promotion