Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
మీ రాశి చక్రం ప్రకారం మీ శత్రువులను, స్నేహితులను భయపెడతారా?
మీ రాశి ప్రకారం మీరు భయపెడతారా? భయపడతారా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ మిత్రువులు ఉన్నా, లేకున్నా...శత్రువులు మాత్రం కచ్చితంగా ఉంటారు.. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి చక్రాన్ని బట్టి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇలాంటి విషయాలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంటాయి.

మీరు నమ్మినా నమ్మకపోయినా.. ఇతరులను భయపెట్టే విషయాలు మీలో చాలానే ఉన్నాయి. అలాగే మీరు భయపడే విషయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

వాస్తవానికి మీరు దీన్ని అనుభవించలేకపోవచ్చు. కానీ ఇతరులు చాలా సామర్థ్యం కలిగి ఉంటారు. మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ఎందుకు భయపెడుతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే, వారి పరిస్థితి మీకు కూడా అర్థం అవుతుంది.

ఈ సందర్భంగా మీ రాశి చక్రాన్ని బట్టి మీ గురించి మరియు మరియు ఇతరుల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి..
ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని భయపెట్టేవారు మిమ్మల్ని చేరుకోవడం చాలా కష్టం. అయితే ఇలాంటి స్వభావం కారణంగా, మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతారు. ఈ కారణం వల్ల మీతో చాలా మంది మాట్లాడలేరు.

వృషభరాశి..
ఈ రాశి వారు ఈరోజు ఇతర రాశుల వారి కన్నా చాలా మొండి పట్టుదల గలవారు. మీరు మీ సందేశాన్ని అందరికీ చేరేలా ప్రయత్నిస్తారు. అయితే మీ కోపం మరియు అస్థిరత కారణంగా ప్రజలు మిమ్మల్ని భయపెడతారు.

మిధున రాశి..
ఈ రాశి వారు ఎక్కడైనా, ఎప్పుడైనా తమ అభిప్రాయాన్ని నిజాయితీగా వ్యక్తం చేస్తారు. అయితే ఇలాంటి దానిని చూసి చాలా మంది మిమ్మల్ని భయపెడతారు. అయితే ఎవరికైనా ఎదుటి వారితో చాలా మాట్లాడటం చాలా సులభం. అయితే ఇలా మీరు మాట్లాడితే మాత్రం ఎదుటి వారికి కొన్ని సార్లు బాధను కలిగిస్తుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు వారికి తెలియకుండానే ఇతరులను భయపెట్టొచ్చు. మీరు ఎవరినైనా ఇష్టపడే వ్యక్తిని సమర్థించే సమయంలో ఇతరులను మీరు భయపెట్టేలా ప్రవర్తిస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారు అందరినీ భయపెట్టాలని ఎల్లప్పడు అనుకుంటూ ఉంటారు. చాలా సార్లు అన్ని విషయాలను తమ కంట్రోల్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మిమ్మల్ని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారు ఏదైనా తప్పు జరిగితే, ఇతరులకు ఎక్కువగా విమర్శిస్తారు. వారు భయపడుతున్నారా? వారు అసలు ఏమనుకుంటారు అనే విషయాలను అస్సలు పట్టించుకోరు.

తుల రాశి..
ఈ రాశి వారు తమ భావోద్వేగాలను ఎప్పటికీ బయటకు చూపించరు. మీరు భయపడటం ఎప్పుడైతే మానేస్తారో.. చాలా మంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. మీ జీవితంలో సులభంగా జరిగే మార్పులు, మిమ్మల్ని చాలా నిరుత్సాహ పరుస్తాయి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు చాలా మంది భయపెట్టాలని భావిస్తారు. వీరు ఎల్లప్పుడూ ప్రజలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. ఇది మీకు కొన్నిసార్లు సమస్యను కలిగిస్తుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఇతరులను భయపెట్టడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు జారుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇతరులకు దగ్గరగా ఉండేందుకు కూడా మీరు భయపడతారు. మరోవైపు మీ ప్రయత్నాలు చాలా ఉత్కంఠభరింతగా ఉంటాయి.

మకర రాశి..
ఈ రాశి వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. అంతేకాదు, మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఏ విషయాన్ని ఎప్పుడు ఆపాలో మీకు తెలియదు, కాబట్టి మిమ్మల్ని చాలా మంది ప్రజలు భయపెట్టే ప్రయత్నం చేస్తారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు చాలా మందిని భయపెట్టాలని చూస్తుంటారు. కానీ వీరిని ఎవ్వరూ పట్టించుకోరు. అయితే ఎప్పుడు ఏమి చేయాలో మీకు బాగా తెలుసు. అందుకే ఇతరులకు మిమ్మల్ని ఎలా సంప్రదించాలో ఇతరులకు తెలియదు.

మీన రాశి..
ఈ రాశి వారు మొదట్లో చాలా భయపడుతున్నారని అందరూ భావిస్తారు. కానీ వీరే ఇతరులను ఎక్కువగా భయపెడుతుంటారని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు.



Click it and Unblock the Notifications
