Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మగాళ్లకు మాత్రమే:ఈ రాశుల మహిళల మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూసెయ్యండి...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి ఒక్క రాశి మహిళలు ఎలా ఆలోచిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
women of each zodiac sign decoded: 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'..అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని చాలా మంది మగాళ్లకు బాగా తెలుసు.

ఎందుకంటే వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో.. ఏమి ఆలోచిస్తారో అనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహిళల మనస్తత్వం ఎలా ఉంటుంది.. వారు ఎలా ప్రవర్తిస్తారు.. వారికి ఎలాంటి విషయాలు నచ్చుతాయనే విషయాలను తెలుసుకోవచ్చట. జ్యోతిష్యం ప్రకారం, మగాళ్లంతా మార్స్ నుండి వచ్చారు.

ఆడవాళ్లు శుక్రుడి నుండి వచ్చారని నమ్ముతారు. అందుకే అమ్మాయిలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదని.. చాలా కష్టంగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. ద్వాదశ రాశులలోని ప్రతి ఒక్క మహిళకు కొన్ని విషయాలు కచ్చితంగా నచ్చుతాయట. అయితే అది వారి మనస్తత్వంపై ఆధారపడి ఉంటుదట. ఈ సందర్భంగా రాశిచక్రాల మహిళల మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి మహిళలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్థిరంగా ఉంటారు. వీరు ఎన్ని కష్టాలెదురైనా వాటిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి మహిళలతో మగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ప్రతిదీ తమ కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు.

వృషభ రాశి..
ఈ రాశి మహిళలు అన్యాయాన్ని అస్సలు సహించలేరు. వీరు న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అయితే అందరితో గొడవలు పెట్టుకోవడం వంటివి చేయరు. చర్చల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారికి జలసీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. వీరి కంటే ఎవరైనా కాస్త అందంగా.. ఎక్కువ డబ్బున్న వారు కనబడితే చాలా ఫీలవుతుంటారు. అయితే వారిని చేరుకునేందుకు ఎలాంటి వ్యక్తుల మద్దతు అయినా తీసుకునేందుకు వెనుకాడరు. అయితే ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే మాత్రం ఏ మాత్రం పట్టించుకోరు. వీరు కొద్దిగా స్వార్థపూరితంగా ఆలోచిస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో క్లారిటీగా ఉంటారు. అందుకే వీరు చాలా మంది వ్యక్తులతో దూరంగా ఉంటారు. అతి కొద్ది మందిని మాత్రమే దగ్గరకు చేర్చుకుంటారు. వీరికి అవసరం ఉన్న వారితోనే స్నేహం చేస్తుంటారు. అలాంటి వ్యక్తులకే మద్దతు ఇస్తారు.

సింహ రాశి..
ఈ రాశికి చెందిన అమ్మాయిలకు ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు తొందరగా రియాక్ట్ అయిపోతారు. అంతేకాదు చాలా సందర్భాల్లో ప్రెజర్ ఫీలవుతారు. దీంతో వీరికి భారం పెరిగినట్టు అనిపిస్తుంది.

కన్య రాశి..
ఈ రాశి మహిళలు ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వీరు భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తుంటారు. వీరు మనుషుల కంటే మనీకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే మనస్తత్వం కలిగి ఉంటారు.

తుల రాశి..
ఈ రాశికి చెందిన మహిళలు చాలా విషయాల్లో బ్యాలెన్స్ కలిగి ఉంటారు. వీరు అందరితోనూ మంచి సంబంధాలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. వీరు కెరీర్, బంధాలను రెండింటికి సమానమైన విలువ ఇస్తారు.

వృశ్చిక రాశి..
ఈ రాశికి చెందిన అమ్మాయిలు సమాజంలో జరిగే ఎలాంటి విషయాలకైనా సులభంగా ప్రభావితమవుతారు. అయితే అన్నింటికంటే ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలకు ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ధనస్సు రాశి..
ఈ రాశికి చెందిన మహిళలు తమ సొంత కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. వీరు ఎల్లప్పుడూ చాలా విషయాల్లో క్లారిటీగా ఉంటారు. వీరికి ఎలాంటి సందర్భాల్లో ఏ ప్రాబ్లమ్ ఫేస్ అయినా.. దాన్ని ఎలా ప్రారంభించాలో వారికి బాగా తెలుస్తుంది. ఈ రాశి అమ్మాయిలు జర్నీ చేయడాన్ని బాగా ఇష్టపడతారు.

మకర రాశి..
ఈ రాశి మహిళలు తమ స్వశక్తిని నమ్ముకుంటారు. ఏ పని మీద ఇతరులపై ఆధారపడరు. తమ మేధస్సు, తెలివితేటలతోనే పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఒకేసారి రెండు పనులు చేయాల్సి వస్తే.. అప్పుడు కూడా దేనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి.. దేనికి రెండో ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాలపైన స్పష్టతను కలిగి ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి మహిళలకు కష్టపడి పని చేసే మనస్తత్వం ఉంటుంది. వీరు ఎలాంటి సందర్భాల్లో అయినా చాలా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అందుకే వీరు వ్యక్తిగత పరంగా.. కెరీర్ పరంగా విజయం సాధిస్తారు. వీరు కెరీర్, ఫ్యామిలీ లైఫ్ రెండింటింటినీ బ్యాలెన్స్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే వీరు ఎలాంటి పనులనైనా సులభంగా చేయగలరు.

మీన రాశి..
ఈ రాశికి చెందిన మహిళలు చాలా సందర్భాల్లో ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటారు. ముఖ్యంగా తమ చుట్టూ ఉండే వ్యక్తుల నుండి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో బాగా ఇబ్బంది పడతారు. అయితే వీరు ఒక్కసారి ఎదిరించాలని నిర్ణయించుకుంటే మాత్రం.. అవతలివైపు ఎవరున్నా లెక్కచేయరు. తాము విజయం సాధించే వరకు ఎంత దూరమైనా వెళ్లేందుకు ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications