Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Women's day color 2023 :ఉమెన్స్ డే నాడు ఏ కలర్ డ్రెస్.. దేనికి సంకేతమో తెలుసా...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 సందర్భంగా, ఏ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడే తెలుసుకోండి.
మహిలో మహిళే సమస్తం.. ఆ తర్వాతే మగాడి ప్రస్థానం.. ఏ మగాడైనా ఉదయం లేచిందగ్గర్నుంచి..
రాత్రి నిద్రపోయే వరకు మహిళ లేనిదే గడపలేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అమ్మాయి అంటేనే మహిమాన్వితం.. ఓర్పులో ఆమెది భూదేవి తత్వం.. ఓపికలో, ఒద్దికలో తనను మించి సహజత్వం ఎవరికీ ఉండదు. నిత్యం మనందరి శ్రేయస్సు కోరుకునే వారిలో మహిళలే ముందుంటారు. మనిషి మనుగడకు మూలాధారమైన మహిళను గౌరవంగా స్మరించుకునే రోజే మహిళా దినోత్సవ రోజు.

ఇదిలా ఉండగా.. మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎలాంటి రంగుల దుస్తులు ఎక్కువగా ధరిస్తారు. ఈ పండుగ రోజున వారికి మంచి చీర లేదా డ్రస్ గిఫ్టుగా ఇస్తే ఎంతో ఆనందిస్తారు. అయితే అమ్మాయిలు ధరించే దుస్తులలో కొన్ని రంగులు ప్రత్యేక సంకేతాలను, కొన్ని సందేశాలను సూచిస్తాయట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పర్పుల్
సఫ్రాగిఫ్ట్ ఉద్యమం ద్వారా వివిధ లక్ష్యాలను రంగులు సూచిస్తాయని తెలిసింది. 1908 సంవత్సరంలో యునైటెడ్ కింగ్ డమ్(UK)లోని ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ నుండి ఉద్భవించిందే ఊదా రంగు. ఇది స్త్రీ వాదపు తత్వం గురించి తెలుపుతుంది. పర్పుల్ కలర్ న్యాయానికి సూచికగా పరిగణిస్తారు. కాబట్టి ఈ డ్రస్సును ధరించిన న్యాయం విజయం సాధించినట్లు భావిస్తారు.

గ్రీన్ కలర్..
ఈ రంగు ఆశను సూచిస్తుంది. అలాగే మన జీవితంలో ముందుకెళ్లాలన్న ఈ కలర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ట్రైన్ ముందుకు వెళ్లాలన్నా.. ట్రాఫిక్లో వాహనాలు ముందుకెళ్లాలన్నా ఈ కలర్ నే వాడతారు.

వైట్ కలర్..
తెలుపు రంగు ఎప్పటికీ స్వచ్ఛంగా ఉంటుంది. ఇది స్వచ్ఛమైన నాణ్యతకు సంకేతమిస్తుంది. ఉద్యమ స్త్రీలు కూడా ఎక్కువగా తెల్లని భారతీయ సంప్రదాయంలోని చీరలను ధరించొచ్చు. ఇటీవలే ఆలియా భట్ ‘గంగూబాయ్ కఠియవాడి' సినిమాలో మరియు సినిమా ప్రమోషన్లో తెల్లని చీరలో చాలా అందంగా కనిపించింది. మీరు కూడా అలా ట్రై చేయొచ్చు.

ఎల్లో కలర్..
మహిళలకు ప్రత్యేక గుర్తింపుని ఇవ్వాలని జరిపే మహిళా దినోత్సవం రోజున సూర్యరశ్మిలా ప్రకాశవంతంగా కనిపించడానికి ప్రొద్దు తిరుగుడు (SunFlower) పసుపు రంగు దుస్తుల్ని ధరించండి.

రెడ్ కలర్..
ఎరుపు రంగు స్త్రీత్వానికి చిహ్నంగా కనిపించే రంగు, కావున భారతదేశంలో వధువుకు ఎక్కువగా ఈ దుస్తులనే ధరింపజేస్తారు. ఈ ఎరుపు రంగు కలిగిన టాప్స్, డ్రెసెస్, చీరలు, కుర్తీలు లేదా జీన్స్ పై టీ షర్టుల రూపంలో ఆకర్షణీయంగా కనపడవచ్చు.

స్త్రీ వాదం తెలిపేలా..
2017 సంవత్సరంలో ప్రముఖ అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ ప్రబల్ గురుంగ్ ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్ కొటేషన్ తో వైట్ కలర్ టీ షర్ట్ 2017లో డిజైన్ చేశారు. ప్రముఖ మోడల్స్ ర్యాంప్ వాక్ లో వీటిని ధరించారు. కాబట్టి మీరు కూడా స్త్రీ వాద ఉద్యమానికి సంకేతంగా ఈ వైట్ టీ-షర్టులను ధరించొచ్చు.
ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. నిత్యం మనందరి శ్రేయస్సు కోరుకునే వారిలో మహిళలే ముందుంటారు. మనిషి మనుగడకు మూలాధారమైన మహిళను గౌరవంగా స్మరించుకునే రోజే మహిళా దినోత్సవ రోజు.



Click it and Unblock the Notifications