For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త బట్టల కోసం కట్టుకున్న భర్తనే అమ్మేసిన భార్య... ఎంతకు అమ్మిందో తెలిస్తే షాకైపోతారు...

|

కలియుగంలో బంధాలకు, అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. డబ్బు డబ్బు నువ్వు ఏమి చేస్తావంటే కమ్మని సంసారంలో కలహాలు తీసుకొస్తా.. అన్నదమ్ముల్ల మధ్య అగ్గిపుల్లనవుతా.. అని అందంట..

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే డబ్బు కోసం ఏకంగా తను పెళ్లి చేసుకున్న భర్తనే అమ్మేసింది ఓ ధీర వనిత.

రీల్ లైఫ్ లో ఉండే స్టోరీని రియల్ లైఫ్ లో నిజం చేసి చూపించింది. అయితే ఆమె తన భర్తను ఎందుకు తాకట్టు పెట్టిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ స్టోరీని పూర్తిగా చూడండి....

''సరిలేరు ఈ జోడికెవ్వరు''... దక్షిణాదిన దశాబ్ద కాలానికి పైగా ఆదర్శ జంటగా నిలిచారు...!

ఎగ‘తాళి‘..

ఎగ‘తాళి‘..

ఒకప్పుడు భర్తే తమ సర్వస్వం అనుకునే వారు భార్యలు. దీనినే తూ.చా తప్పకుండా పాటించేవారు. భర్త ఎన్ని చెడ్డ పనులు చేసినా ఎంతో సహనంతో భరించే వారు. అయితే ప్రస్తుతం తాళి కట్టిన భర్తనే ఎగ‘తాళి‘ చేస్తున్నారు.

భర్త ఎలాంటి వాడైనా..

భర్త ఎలాంటి వాడైనా..

అప్పట్లో భర్త ఎంత తాగి తందనాలు ఆడినా.. భార్యను ఎన్ని చిత్ర హింసలు పెట్టినా.. తమ మెడలో తాళి కట్టాడనే ఒకే ఒక కారణంతో అన్నింటినీ సహించేవారు.

అత్తారింట్లోనే అన్నీ..

అత్తారింట్లోనే అన్నీ..

తన భర్తతో పాటు అత్తగారు, ఇతర బంధువులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. పుట్టింటి వరకు వెళ్లనిచ్చే వారు కాదు. ఎన్ని గొడవలు ఉన్నా సంసారం అనేది ఒక చదరంగంలా భావించి అక్కడే అన్నీ తేల్చుకునే వారు.

కాపురంలో కలహాలు.. విభేధాలతో విడాకులు.. ఇదే లేటెస్ట్ ట్రెండ్...! దీని గురించి ప్రముఖులు ఏమంటున్నారంటే...

ప్రస్తుతం చిన్న గొడవలకే...

ప్రస్తుతం చిన్న గొడవలకే...

అయితే ప్రస్తుతం కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి. చిన్న చిన్న గొడవలకే భర్తకు విడాకులు ఇచ్చేస్తున్నారు. అంతేకాదు విడిపోయిన కొద్దికాలానికే మరొకరితో సంబంధం కొనసాగిస్తున్నారు లేదా పెళ్లి చేసుకుంటున్నారు.

ఈ మహిళ మాత్రం..

ఈ మహిళ మాత్రం..

అయితే ఇప్పుడు చెప్పబోయే మహిళ మాత్రం ఈ రెండింటికి భిన్నంగా ఆలోచించింది. తను సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అందరికీ దిమ్మ తిరిగేలా చేసింది.

భర్తనే అమ్మేసింది..

భర్తనే అమ్మేసింది..

అయితే కెన్యా దేశానికి చెందిన ఎడ్నా ముక్వానా అనే మహిళ తన భర్తను మరో మహిళకు అమ్మేసింది. ఈ సంఘటన కెన్యా రాజధాని నైరోబీలో తాజాగా చోటు చేసుకుంది.

కొత్త డ్రెస్సులు కొనుక్కుంది..

కొత్త డ్రెస్సులు కొనుక్కుంది..

తన భర్తను అమ్మిన డబ్బులతో కొత్త డ్రస్సులు కొనుక్కుందట. వీరిద్దరికి కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్లి అయ్యింది. వీరిద్దరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.

ఎంతటి మగాడినైనా అక్కడి తాకితే.. స్వర్గపు అంచుల దాకా వెళ్లినట్టు ఫీలవుతాడట...!

అదే కారణం..

అదే కారణం..

ఇంతకీ తన భర్తను ఎందుకు అమ్మిందంటే.. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే అని ఆమె తెలిపింది.

రెడ్ హ్యాండెడ్ గా..

రెడ్ హ్యాండెడ్ గా..

ఒక రోజు తన ముందే తన భర్త మరో మహిళతో రొమాన్స్ లో ఉండగా రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయాడు. దీంతో తాను ఎంతగానో కుంగిపోయిందట.

ఆమెతోనే బార్గెయిన్...

ఆమెతోనే బార్గెయిన్...

చాలా మంది ఇలాంటివి జరిగితే తన భర్తని, అలాంటి వారిపై అక్కడికక్కడే దాడి చేసి, వారిని పోలీసుస్టేషన్ కు అప్పగిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు చెప్పులతో దాడి చేసి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి నానా రభస చేసిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.

కేవలం 17 డాలర్లకే..

కేవలం 17 డాలర్లకే..

అయితే ఆమె తన భర్తను ఎంతకు అమ్మేసిందో తెలిస్తే మీరు షాకైపోతారు. ‘శుభలగ్నం‘ సినిమాలో లాగా కోటి రూపాయలు, లక్షల రూపాయలు కాదండోయ్. కేవలం 17 డాలర్లకే తన భర్తను అమ్మేసింది.

తన పిల్లలకు కూడా..

తన పిల్లలకు కూడా..

ఆ మహిళతో ఆ డబ్బును తీసుకున్న అనంతరం ఆమె వెంటనే ఓ షాపింగ్ మాల్ కు వెళ్లి తనకు.. తన ఇద్దరు పిల్లలకు మంచి డ్రస్సులను కొనుక్కుందట.

భర్త ఎంతగా వేడుకున్నా..

భర్త ఎంతగా వేడుకున్నా..

ఈ ఘటనతో షాక్ తిన్న భర్త తాను ఏదో సరదాగా వెళ్లి ఆమెతో గడిపానని, తనకు భార్యాబిడ్డలే ముఖ్యమని చెప్పినా ఆ భార్య అస్సలు వినిపించుకోలేదట. వంచన చేసే మొగుడితో తాను జీవితాంతం కలిసి జీవించలేనంటూ తెగేసి చెప్పేసిందట.

పిల్లల బాధ్యత...

పిల్లల బాధ్యత...

భర్త తనకు తోడుగా లేకపోయినా తన పిల్లల బాధ్యత తానే తీసుకుంటానని, తన కష్టంతో పిల్లలను పోషించుకుంటానని ఆమె చెప్పడం గమనార్హం. ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్ అయిపోయింది.

English summary

Women sold her husband for money, this case will surprise you

Here we talking about Women sold her husband for money, this case will surprise you in. Read on