For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Aids Day 2021 : ఇవి తెలుసుకుంటే.. ఎయిడ్స్ నుండి సులభంగా తప్పించుకోవచ్చు...

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

|

ఈ భూ ప్రపంచం మీద మానవాళి ఇప్పటివరకు చూడని ప్రాణాంతక వ్యాధులలో ఎయిడ్స్ మహమ్మారి ఒకటి. దీనిని వైద్యపరంగా హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) లేదా అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు.

World Aids Day 2020: History, Theme and Significance

ఇది అంటు వ్యాధి, ఇది మానవ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది మరియు వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు, ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ ఐవికి వ్యతిరేకంగా పోరాడటం కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ డే నిర్వహిస్తారు.

World Aids Day 2020: History, Theme and Significance

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) 1988లో తొలిసారిగా ఎయిడ్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. మానవ ఆరోగ్య సంబంధిత అంశాల కోసం ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించడంతో ఈ ఎయిడ్స్ డే మొదలైంది. ఈ సందర్భంగా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి...

HIV అంటే ఏమిటి?

HIV అంటే ఏమిటి?

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) అనేది రోగనిరోధక శక్తిని దెబ్బతీసే వైరస్. చికిత్స చేయకపోతే, హెచ్ఐవి శరీరంలోని రోగనిరోధక కణాలైన సిడి 4 కణాలను నాశనం చేస్తుంది. ఈ కారణంగా మీకు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

ఎయిడ్స్ అంటే..

ఎయిడ్స్ అంటే..

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) అనేది ద్వారా ఎయిడ్స్ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో రోగనిరోధక శక్తి చాలా వేగంగా తగ్గిపోతుంది. ఇది క్షీణించడం అంటే.. మన శరీరం అనారోగ్యంతో పోరాడే శక్తిని పూర్తిగా కోల్పోతుంది. ముఖ్యంగి సిడి 4 అనే రోగనిరోధక కణాలను ఈ ఎయిడ్స్ మహమ్మారి చంపేస్తుంది. దీని వల్ల వివిధ వ్యాధులు సంక్రమించి చనిపోయే అవకాశం ఉంటుంది.

ఎలా మారుతుందంటే..

ఎలా మారుతుందంటే..

తల్లి పాలు, లైంగిక కలయిక, మల ద్రవాలు, రక్తం, వీర్యం ద్వారా హెచ్ ఐవి వేగంగా వ్యాపిస్తుంది. ఇది జీవితకాలం పాటు ఉంటుంది. దీనికి మందు లేదు. కేవలం నివారణ మార్గం ఒక్కటే. అయితే సరైన చికిత్స మరియు నిర్వహణతో, ఒక వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV)తో జీవించగలడు.

బయటపడే అవకాశం తక్కువ..

బయటపడే అవకాశం తక్కువ..

హెచ్ ఐవి సోకిన వెంటనే అది బయటపడే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే అది ఎప్పుడైతే ఎయిడ్స్ గా బయటపడుతుందో.. అప్పుడే తెలిసే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని మనం నయం చేయలేం. ఎయిడ్స్ సోకిన వారి సగటు జీవితకాలం కేవలం మూడేళ్లే. ఒకవేళ ఎవరైనా ఎయిడ్స్ తో బాధపడుతుంటే వారికి కొంత ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా ఇతర అనారోగ్యానికి గురైనట్లయితే, ఆ వ్యక్తి బతికి ఉండే సమయం మరికొంత తగ్గుతుంది.

ఈ వ్యాధి లక్షణాలు..

ఈ వ్యాధి లక్షణాలు..

సాధారణంగా హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) లక్షణాలు అది సోకిన దశపై ఆధారపడి ఉంటాయి. ఎక్కువ సందర్భాలలో ఈ వ్యాధి సోకిన కొన్ని నెలల్లో చాలా అంటువ్యాధులుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సంక్రమించిన తర్వాత మొదటి కొన్ని వారాలలో, హెచ్ ఐవి పాజిటివ్ వ్యక్తి ఫ్లూ వంటి లక్షణాలను అనుభవిస్తారు.

వ్యాధి సోకిన తర్వాత..

వ్యాధి సోకిన తర్వాత..

ఈ వ్యాధి సోకిన తర్వాత మొదటి కొన్ని వారాలలో, హెచ్ ఐవి పాజిటివ్ వ్యక్తి ఫ్లూ లక్షణాలను ఎదుర్కొంటారు. జ్వరం, తలనొప్పి, దద్దర్లు, గొంతుమంట వంటి లక్షణాలు తొలి దశలో కనిపిస్తాయి. హెచ్ ఐవి లక్షణాలు పెరుగుతున్నకొద్దీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అంతేకాకుండా చర్మంపై వాపులు, కురుపులు, అధిక జ్వరం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు క్రమంగా పెరుగుతాయి.

ఎయిడ్స్ చికిత్సలో..

ఎయిడ్స్ చికిత్సలో..

మన దేశంలో ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించడంలో మన తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అందులో హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్, గవర్నమెంట్ చెస్ట్ ఆసుపత్రి, ఎర్రగడ్డ, విశాఖలోని కేజీహెచ్, ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోని ఎటిఆర్ క్లీనిక్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రిలోని ఎఆర్ టి క్లీనిక్ తో ముంబై, చెన్నైలోని పలు మెడికల్ కాలేజీలు ఎయిడ్స్ చికిత్సను అందిస్తున్నాయి.

FAQ's
  • ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున ఎయిడ్స్ పై ప్రజలలో అవగాహన కల్పించడం.. ఎయిడ్స్ రోగులకు ధైర్యాన్ని ఇవ్వడం వంటివి చేస్తారు.

English summary

World Aids Day: History, Theme and Significance

World AIDS Day is observed on December 1 every year to raise awareness about the disease. Read on the hstory, significance and theme of the day and myths about aids.
Desktop Bottom Promotion