For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Coconut Day 2021:కొబ్బరి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

వరల్డ్ కోకొనట్ డే 2021 థీమ్, చరిత్ర, వేడుకల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనకు ఈ నేచర్ నుండి ఎన్నో సహజ వనరులు లభిస్తాయి. అందులో కొబ్బరి ఒకటి. ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో 4,500 సంవత్సరాలకు పైగా పెరుగుతోంది.

World Coconut Day 2021: Theme, Date, History & Celebration

దీని నుండి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పాక ఉపయోగాలను కలిగి ఉంది. చిరు తిళ్లు, ఫాస్ట్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్ పేరుతో మనం అనారోగ్యాల బారిన పడుతున్నాం. కానీ సహజంగా లభించే కొబ్బరి వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి.

World Coconut Day 2021: Theme, Date, History & Celebration

కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు, వీటన్నింటినీ అన్ని రకాల వంటకాల్లో ఉపయోగించొచ్చు. ఈ ప్రత్యేకమైన కొబ్బరి యొక్క ఉపయోగాల గురించి అవగాహన కల్పించడానికి, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా కొబ్బరి దినోత్సవం ఎప్పుడు మొదలైంది.. ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యమేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

World Coconut Day: ఆరోగ్యానికి అనుకూలమైన కొబ్బరి గురించి అద్భుతమైన లాభాలు తెలుసుకోండిWorld Coconut Day: ఆరోగ్యానికి అనుకూలమైన కొబ్బరి గురించి అద్భుతమైన లాభాలు తెలుసుకోండి

ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2021 థీమ్..

ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2021 థీమ్..

ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ కోలుకోనీయకుండా దెబ్బతీసింది. ప్రతి ఒక్కరిపై ప్రతికూల ప్రభావం చూపింది. 2021 సంవత్సరలో ప్రపంచ కొబ్బరి దినోత్సవ థీమ్ ‘కోవిద్-19 మహమ్మారి మరియు అంతకుమించి సురక్షితమైన సమ్మిళిత స్థితిస్థాపక మరియు స్థిరమైన కొబ్బరి సమాజాన్ని నిర్మించడం'.

ప్రపంచ కొబ్బరి దినోత్సవ చరిత్ర..

ప్రపంచ కొబ్బరి దినోత్సవ చరిత్ర..

ఈ రోజును జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరి ప్రాముఖ్యత మరియు ఉష్ణమండల పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం. ఆసియా మరియు పసిఫిక్ కొబ్బరి(APCC) ద్వారా ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాల కింద ఉన్న దేశాలలో ఈరోజు ప్రత్యేకంగా గుర్తించబడింది. ఎందుకంటే అవి ప్రపంచంలో అత్యధికంగా కొబ్బరి పండించే ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉన్నాయి.

2009 సంవత్సరంలో

2009 సంవత్సరంలో

2009 సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరిగింది. జకార్తా, ఇండోనేషియాలో ప్రధాన కార్యాలయం ఉన్న APCC, UN-ESCAP(యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా మరియు పసిఫిక్) యొక్క ప్రధాన అధికారంలో పని చేస్తుంది. ఈరోజును గుర్తించే ఉద్దేశ్యం పాలసీలను హైలెట్ చేయడం మరియు కార్యాచరణ ప్రణాళికను వ్యక్తం చేయడం.

భారతదేశమే నెంబర్ 1..

భారతదేశమే నెంబర్ 1..

ప్రపంచ దేశాల్లో కొబ్బరి ఉత్పాదకత కలిగిన దేశాల్లో భారతదేశం అగ్రస్థానం ఉంది. కొబ్బరి డెవలప్ మెంట్ బోర్డు(CDB) మద్దతుతో కేరళ, తమిళనాడు, కర్నాటక, గోవా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలలో ఈరోజును జరుపుకుంటారు.

కొబ్బరి ఉత్పత్తిని పెంచడానికి మరియు వినియోగానికి సంబంధించి అవగాహన కోసం నిపుణులచే అవగాహన ప్రచారాలు మరియు సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. రైతులు మరియు వ్యాపారవేత్తలు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కొబ్బరి ఉత్పత్తుల గురించి ఆలోచనలు మరియు ఆందోళనలను పంచుకుంటారు.

కొబ్బరితో ప్రయోజనాలు..

కొబ్బరితో ప్రయోజనాలు..

కొబ్బరి ఉత్పత్తి మరియు వైవిధ్యం కాకుండా, కొబ్బరి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా పేదరిక నిర్మూలనలో కొబ్బరి పోషించగల ముఖ్యమైన పాత్రను సూచించడానికి ఈరోజు ప్రయత్నిస్తుంది. 2021 సంవత్సరంలో ప్రపంచ కొబ్బరి దినోత్సవం 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

కొబ్బరిలో అనేక ముఖ్యమైన ఖనిజాలు, ప్రోటీన్ మరియు చిన్నమొత్తంలో బి-విటమిన్లు ఉంటాయి. ఇందులో మాంగనీస్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎముకల ఆరోగ్యం బలంగా ఉంటుంది. కొబ్బరి నుండి సేకరించిన నూనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొవ్వు తగ్గించడానికి సహాయపడుతుంది. మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మీ చర్మాన్ని కూడా తేమ చేస్తుంది. ఇది హానికరమైన సూక్ష్మజీవులను కూడా చంపగలదు. ఇంకా, కొబ్బరి నీరు రిఫ్రెష్ పానీయం మరియు మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి మరియు మధుమేహం నుండి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఇది మీ శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది.

English summary

World Coconut Day 2021: Theme, Date, History & Celebration

This fruit is being grown for over 4500 years in tropical regions and has immense health benefits and culinary uses. Water, oil, meat or milk, everything can be used. To create awareness about the usage of this unique fruit, World Coconut Day is celebrated on 2 September every year.
Story first published:Thursday, September 2, 2021, 11:36 [IST]
Desktop Bottom Promotion