For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Daughters Day 2020 : కొడుకుల కంటే కూతుళ్లే బెటర్.. ఎందుకో తెలుసా...!

|

ఆడపిల్లలు ఆడ పులులుగా మారుతున్నారు... తాము ఎంచుకున్న రంగంలో చిరుతల్లాగా దూసుకుపోతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రుల ప్రతిష్టను పెంపొందిస్తున్నారు. తాము పుట్టి పెరిగిన సమాజం, దేశం గర్వపడేలా చేయడంలో ముందంలో నిలుస్తున్నారు. అందుకే చాలా మంది తల్లిదండ్రుల ఆలోచనల్లో ప్రస్తుతం చాలా మార్పు వచ్చింది. తమకు కొడుకైనా.. కూతురైనా ఒక్కటేనని చెబుతున్నారు.

ఒకప్పుడు మన దేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో కూతుళ్లపై వివక్ష చూపుతుండేవారు. అయితే రోజురోజుకీ చదువుకున్న వారు పెరుగుతూ.. టెక్నాలజీ, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు పెరుగుతున్న ఈ కాలంలో సమాజంలో కొంత మార్పు రావడం సంతోషకరమైన విషయం.

ప్రస్తుతం ఎవరి ఇంట్లో అయినా ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టినట్లు భావిస్తున్నారు. ఆమె పుట్టినప్పటి నుండి తన చిన్నారి తల్లి భవిష్యత్తును ఊహించుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు తల్లిదండ్రులు. అందుకే ఏ ఇంట్లో అయినా ఎంతమంది కొడుకులు ఉన్నా.. కూతుళ్లు ఎంతో ప్రత్యేకం. వరల్డ్ డాటర్స్ డే (World Daughters Day) సందర్భంగా కొడుకుల కంటే కూతుళ్లే ఎందుకు బెటరో.. వారంతా ఎంతటి ఆనందాన్ని పంచుతారో తెలుసుకుందాం రండి...

Daughters Day 2020 : మీ చిట్టితల్లికి విషెస్ చెప్పండి... వారిని సర్ ప్రైజ్ చేయండి...!Daughters Day 2020 : మీ చిట్టితల్లికి విషెస్ చెప్పండి... వారిని సర్ ప్రైజ్ చేయండి...!

ఆడపిల్లతో అల్లరి..

ఆడపిల్లతో అల్లరి..

ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల ఉంటే తను తండ్రితో కలిసి చేసే అల్లరి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఎప్పుడూ ఒకే పార్టీ. ఏ పండుగైనా.. పబ్బమైనా.. శుభకార్యమైనా.. ఆమె లేకపోతే ఇల్లంతో బోసిపోతుంది.

వారిలా ఎవ్వరూ లవ్ చేయలేరు..

వారిలా ఎవ్వరూ లవ్ చేయలేరు..

పేరేంట్స్ ను ప్రేమించడంలో కూతుళ్లను మించినవారు ఎవ్వరూ ఉండొరని చెప్పొచ్చు. తనకు పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్లినప్పటికీ.. తల్లిదండ్రుల విషయంలో ఆమె చూపించే కేరింగ్ ఎవ్వరూ మరచిపోలేరు. అందుకే పెద్దలు ‘కొడుకు ప్రేమ కోడలు వచ్చే వరకూ.. కూతురి ప్రేమ జీవితాంతం' అంటూ ఉంటారు.

ప్రెజర్ తగ్గిపోతుంది..

ప్రెజర్ తగ్గిపోతుంది..

ఏ ఇంట్లో అయితే కూతురు ఉంటుందో ఆ ఇంట్లో ప్రెజర్ సులభంగా తగ్గిపోతుంది. అది తండ్రికైనా.. తల్లికైనా.. ఎందుకంటే తమ గారాల పట్టితో కాసేపు సరదాగా ఆడుకుంటే చాలు ఎంతటి ప్రెజరైనా ఇట్టే తగ్గిపోతుంది. ఇతర టెన్షన్లను కూడా దూరం చేస్తుంది.

డాటర్స్ డే 2020 ఎప్పుడు? ఎందుకని ఈ వేడుకలను జరుపుకుంటారో తెలుసా...డాటర్స్ డే 2020 ఎప్పుడు? ఎందుకని ఈ వేడుకలను జరుపుకుంటారో తెలుసా...

తను మంచి స్నేహితురాలిగా..

తను మంచి స్నేహితురాలిగా..

కూతురు కంటే బెస్ట్ ఫ్రెండ్ తల్లి జీవితంలో ఎవ్వరూ ఉండరని చెప్పొచ్చు. తన వయసు ఎంతైనా సరే.. కొత్త జనరేషన్ కి తగిన ఆలోచనలను ఓ తల్లి తన కూతురు నుండే నేర్చుకుంటుంది. అంతేకాదు ఓ మంచి స్నేహితురాలిగా అమ్మకు అన్ని విషయాల్లోనూ తోడుగా, నీడగా నిలుస్తుంది. సాయంలోనూ తనే ముందుంటుంది.

ఆదర్శంగా నిలుస్తుంది..

ఆదర్శంగా నిలుస్తుంది..

ఓ సింధు, సానియా, సైనాలా ప్రతి ఒక్క కూతురు తమ తల్లిదండ్రులను గర్వపడేలా చేయడంలో ముందుంటారు. వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది అమ్మాయిలు ప్రతి దశలోనూ తమను చూసి తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని కోరుకోవడం సహజం. అంతేకాదు ఇతరులకు ఆదర్శంగా నిలిచేది కూడా కూతుళ్లే.

సరైన దారిలోనూ..

సరైన దారిలోనూ..

కూతురంటే అమ్మనాన్నలకు మంచి స్నేహితురాలే కాదు.. తమ తల్లిదండ్రులకు ఏవి బాగుంటాయో.. ఏవి బాగుండవో నిర్మోహమాటంగా చెప్పే ఒక క్రిటిక్ కూడా. తన నాన్నకు ఏ రంగు టీషర్ట్ బాగుంటుంది.. అందులోకి ఏ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది.. అలాగే అమ్మకు ఎలాంటి సారీ సెట్ అవుతుంది.. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా వాటిని ఎంపిక చేసి.. మిమ్మల్ని నలుగురిలో ది బెస్ట్ గా నిలబెడుతుంది కూడా. మీరు ఏదైనా తప్పు చేస్తే దాన్ని మీకు పూర్తిగా వివరించి.. మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది.

ఇవన్నీ కొడుకులు చేయలేరా?

ఇవన్నీ కొడుకులు చేయలేరా?

పై పనులు, విషయాలు కొడుకులు చేయలేరా.. అంటే కొందరు మాత్రం చేయొచ్చేమో కానీ.. అందరూ మాత్రం కచ్చితంగా చేయలేరు. ఎందుకంటే కూతుళ్లు ఎప్పుడూ తల్లిదండ్రుల బాగోగుల గురించి ఆలోచిస్తూ.. వారి క్షేమాన్ని కోరుకుంటారు కాబట్టి...

English summary

World Daughters Day : Reasons Why Daughters Are Better Than Sons in Telugu

Here we talking about World Daughters Day 2020 : Reasons why daughters are better than sons in telugu. Read on
Story first published: Saturday, September 26, 2020, 15:16 [IST]