For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Milk Day 2023:ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ఈ ఏడాది థీమ్ ఏంటి?

|

ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకుంటారు. పాడి రంగాన్ని మెరుగుపరచుకునేందుకు మరియు ప్రపంచ ఆహారంగా పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేసేందుకు.

World Milk Day 2022: Date, Theme, History, and Significance in Telugu

ఐక్యరాజ్యసమితి(UNO) ఆహార మరియు వ్యవసాయ సంస్థ(FAQ) 2000 సంవత్సరంలో జూన్ 1వ తేదీ నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈరోజున పాల యొక్క ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతతో పాల దినోత్సవం యొక్క థీమ్ పాడి రంగంలో స్థిరత్వంపైనా ఫోకస్ పెడుతుంది. ఈ సందర్భంగా ప్రపంచ పాల దినోత్సవ చరిత్ర, థీమ్, ఈ దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పాల దినోత్సవ తీర్మానం..

పాల దినోత్సవ తీర్మానం..

ప్రపంచ ఆహారంగా పాల ప్రాధాన్యతగా గుర్తించడానికి మరియు పాడి రంగాన్ని మెరుగుపరుచుకునేందుకు 2000 నుండి 2001 సంవత్సరం మధ్యన ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ జూన్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగ పాల దినోత్సవాన్ని జరుపుకోవాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

పాల ఉత్పత్తులతో ప్రయోజనాలు..

పాల ఉత్పత్తులతో ప్రయోజనాలు..

జూన్ ఒకటో తేదీన పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పాల గురించి ఎక్కువ ప్రచారం చేస్తోంది. అంతేకాదు పాల వల్ల సుమారు ఒక బిలియన్ మందికి ఎలా జీవనోపాధి దొరుకుతుంది.. పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, ప్రపంచ ఆహార వ్యవస్తలో పాల రంగం అతి ముఖ్యమైన భాగం.

కనీసం ఒకసారైనా..

కనీసం ఒకసారైనా..

ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఆర్థిక, పోషక మరియు సామాజిక ప్రయోజనాలను అందిస్తోంది. భారతదేశం వ్యవసాయాధారిత దేశం కాబట్టి, ఇక్కడ ప్రధాన ఆహారాలలో ఒకటిగా పరిగణించి ఈరోజుకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. వంటలో పాలను ఉపయోగించడం సాధారణమే. అయితే రోజులో కనీసం ఒకసారైనా మనం తీసుకునే భోజనంలో పాలు ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది.

2022 థీమ్ ఏంటంటే..

2022 థీమ్ ఏంటంటే..

ఈ ఏడాది ప్రపంచ పాల దినోత్సవం యొక్క థీమ్ "Enjoy Dairy Rally" ఈ ‘ఎంజాయ్ డైరీ ర్యాలీ' మే 29-31వ తేదీల మధ్యన ప్రారంభమై, జూన్ ఒకటో తేదీన బుధవారం రోజున ప్రపంచ పాల దినోత్సవం రోజున ముగుస్తుంది. ఈ ఏడాది థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వాతావరణ చర్యలను వేగవంతం చేయడానికి మరియు పాడి పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించడానికి ఇప్పటికే చేస్తున్న పనిని హైలెట్ చేస్తుంది. ప్రపంచ పాల దినోత్సవం అనే ప్లాట్ ఫామ్ ను ఉపయోగించి ధరణిని కాపాడుకునేందుకు డైరీ నెట్ జిరో పట్ల మేనేజింగ్ మరియు చర్యల గురించి అందరిలో అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అనేక ప్రచారాలు..

అనేక ప్రచారాలు..

కరోనా లాక్ డౌక్ కారణంగా గత రెండేళ్లు సాధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ ఏడాది కరోనా ముప్పు తగ్గడంతో గ్లోబల్ డెయిరీ ప్లాట్ ఫామ్ అనేక ప్రచారాలను నిర్వహిస్తోంది. అయితే ఈ ఏడాది సోషల్ మీడియాతో పాటు ప్రత్యక్షంగా పాల గురించి ఎక్కువ ప్రచారం చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

పాలతో ఆరోగ్య ప్రయోజనాలు..

పాలతో ఆరోగ్య ప్రయోజనాలు..

పాలు పోషకాలు అధికంగా ఉండే ద్రవం, స్త్రీ క్షీరదాలు తమ పిల్లలను పోషించడానికి ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా మనం వినియోగించే రకాల ఆవులు, గొర్రెల మరియు మేకల నుండి పాలు వస్తాయి. ఈ పాలు తాగడం వల్ల నాలుగు ఆరోగ్య ప్రయోజనాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

పాలతో బలం..

పాలతో బలం..

పాలలో విటమిన్లు మరియు అద్భుతమైన మినరల్స్ ఉంటాయి. పాలు ప్రోటీన్ యొక్క గొప్ప వనరు. ఇవి ఒక కప్పు పాలలో సుమారు 8 గ్రాములు ఉంటుంది. మన బాడీకి సరైన పనితీరు కావాలంటే, ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పెరుగుదల మరియు డెవలప్ మెంట్ మరియు రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఎముకలు కూడా బలంగా మారతాయి. పాలను మీ ఆహారంలో సులభంగా చేర్చొచ్చు. కాఫీ, వోట్మీల్, స్మూతీస్ ఇతర పదార్థాల తయారీలోనూ పాలను విరివిగా వాడొచ్చు.

FAQ's
  • ప్రపంచ పాల దినోత్సవాన్ని(World Milk Day) ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకుంటారు. పాడి రంగాన్ని మెరుగుపరచుకునేందుకు మరియు ప్రపంచ ఆహారంగా పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి(UNO) ఆహార మరియు వ్యవసాయ సంస్థ(FAQ) 2000 సంవత్సరంలో జూన్ 1వ తేదీ నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈరోజున పాల యొక్క ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతతో పాల దినోత్సవం యొక్క థీమ్ పాడి రంగంలో స్థిరత్వంపైనా ఫోకస్ పెడుతుంది.

English summary

World Milk Day 2023: Date, Theme, History, and Significance in Telugu

Here we are talking about the World Milk Day 2022: Date, theme, significance in Telugu. Read on
Desktop Bottom Promotion