Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
హ్యుమన్ కంప్యూటర్ శకుంతల దేవి రికార్డును భానుప్రకాష్ ఎలా బద్దలు కొట్టాడంటే...!
హ్యమన్ కంప్యూటర్ శకుంతలా దేవి రికార్డును బద్దలు కొట్టిన హైదరాబాద్ కుర్రాడెవరో తెలుసుకుందాం.
మనలో హ్యుమన్ కంప్యూటర్ అనగా అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు శకుంతల దేవి. వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులెటర్ గా ఆమె పేరు గిన్నిస్ రికార్డులకు సైతం ఎక్కింది.

PC : Yahoo
అయితే మన హైదరాబాదీ కుర్రాడు ఆమె రికార్డును బద్దలు కొట్టేశాడు. తన అసమాన ప్రతిభతో 20 ఏళ్ల వయసులోనే ఎంతటి క్లిష్టమైన లెక్క అయినా ఇట్టే సమాధానం చెప్పేస్తున్నాడు.

ఇటీవలే 'మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్ షిప్'లో ఛాంపియన్ గా నిలిచాడు. ఈ విశ్వంలోనే అత్యంత వేగవంతమైన హ్యుమన్ క్యాలిక్యులేటర్ గా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇలాంటి గొప్ప ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన నీలకంఠ భానుప్రకాష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
View this post on InstagramA post shared by Neelakantha Bhanu Prakash (@fastesthumancalculator) on
1998 నుండి..
'మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్ షిప్' 1998 నుండి ప్రతి సంవత్సరం లండన్ లోని 'మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్'లో జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఈ పోటీలను ఈ సారి ఆన్ లైనులో నిర్వహించారు.

29 మంది పోటీ..
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్రదినోత్సవం రోజు జరిగిన ఈ పోటీలో 13 దేశాల నుండి 29 మంది ఈ పోటీలకు హాజరయ్యారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా మైండ్ స్పోర్ట్స్ సత్తా చాటినవారిని మాత్రమే దీనికి ఆహ్వానిస్తారు. అందులో మన హైదరాబాద్ కు చెందిన 20 ఏళ్ల భానుప్రకాష్ కూడా పాల్గొన్నాడు.

ఫైనల్ పోటీలో..
మన హైదరాబాదీ కుర్రోడి ప్రతి ప్రశ్నకు ఠక్కున సమాధానం చెబుతుంటే, ఆశ్చర్యపోయిన జడ్జిలు తనకు కఠినమైన ఈక్వేషన్లు, క్యూబ్ రూట్ నిచ్చి పరిష్కరించమన్నారు. దానికి కూడా మన తెలుగు కుర్రాడు వెంటనే సమాధానాలిచ్చేశాడు. అలా ప్రత్యర్థి కంటే 65 పాయింట్లు అధిక్యంతో తను ఛాంపియన్ గా నిలిచాడు.

ఫాస్టెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులెటర్ గా..
ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ ‘‘వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యమన్ క్యాలిక్యులెటర్'గా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. మన దేశం తరపున ఈ ఛాంపియన్ షిప్ సాధించిన తొలి వ్యక్తిగా నేను నిలవడం అంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది' అని చెప్పాడు.

సరదాగా మొదలుపెట్టా..
వాస్తవానికి లెక్కలంటే నాకంత మక్కువ కలగడానికి కారణం.. నేను 5వ సంవత్సరంలో జరిగిన ప్రమాదం.. ఆ సమయంలో దాదాపు నేను ఒక సంవత్సరం పాటు మంచంపైనే ఉండాల్సి వచ్చింది. ఆ ఖాళీ సమయంలో బోర్ కొట్టి, సరదాగా లెక్కలు మొదలుపెట్టా. రానురాను లెక్కలపై ఆసక్తి పెరిగింది.

కొన్ని లెవెల్స్..
అప్పటి నుండి లెక్కల్ని సులువుగా, వేగంగా చేయడానికి ప్రయత్నించేవాడిని. అలా అంకెలతో నాకు అనుబంధం ఏర్పడింది. కొంతకాలానికి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాను. డిగ్రీ అయిపోయిన తర్వాత వాటిపై ఫోకస్ పెట్టాను. అబాకస్ లో 9 లెవెల్స్ పూర్తి చేశాను. మూడుసార్లు ‘ఎన్ఐపీ అకాడమీ' నిర్వహించే అబాకస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నాను.

నా లక్ష్యం ఏంటంటే..
ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం.. ఏంటంటే లెక్కలంటే చిన్నారుల్లో ఉన్న భయం పోగొట్టడం. దీని కోసం రెండేళ్ల క్రితం ‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ఫినిటీస్' అనే స్టార్టప్ ప్రారంభించాను. ‘టీశాట్ తో ఒప్పందం చేసుకుని, ప్రాజెక్టు మ్యాథ్స్' పేరిట వర్క్ షాపులు, తరగతులు నిర్వహిస్తున్నా. మా స్టార్టప్ ద్వారా ఇప్పటికే దేశవిదేశాల్లోని విద్యార్థులకు మెంటల్ ఎబిలిటీలో శిక్షణ కూడా ఇస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్స్ అర్థమెటిక్ లిటరసీ పెంచాలన్నది నా ప్రయత్నం.

నెలరోజులు కష్టపడ్డాను..
ఈ ఒలింపియాడ్ కోసం నెల రోజుల కోసం కష్టపడ్డాను. రోజుకు నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేసే వాడిని. నాకు చిన్ననాటి లెక్కలంటే ఎంతో ఇష్టం. అందరికీ ఇది ఓ పాఠ్యాంశం కావచ్చు. కానీ నాకు మాత్రం ఓ గేమ్ లా అనిపిస్తుంది. అందుకే ఇవి విజయానికి కారణాలై ఉండొచ్చు' అని భానుప్రకాష్ మీడియాతో చెప్పాడు.



Click it and Unblock the Notifications