Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
World Water Day 2023: ఇలాగే చేస్తూ పోతే.. తాగడానికి చుక్క నీరు దొరకదు
నీటి ప్రాముఖ్యతను తెలియజేసేందుకు, ప్రపంచ నీటి సంక్షోభం గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటాం.
బతకడానికి నీరు చాలా కీలకం. నీరు లేని చోట మనుగడ కష్టం. నీరు ఉన్న చోటే పశుపక్షాదులు, ప్రకృతి నెలవుంటుంది. అందుకే ఆనాటి కాలంలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్న చోటే నాగరికతలు వెలిశాయి. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బతకొచ్చు కానీ నీరు లేకపోతే ఎక్కువ సేపు జీవించలేం.

భూమిపైన తాగు నీటి వనరులు చాలా చాలా స్వల్పం. భూమిపై 97 శాతం సముద్రపు నీరు, తాగడానికి పనికిరాని నీరు ఉంటే, కేవలం 3 శాతం మాత్రమే మంచి నీరు ఉంది.
నీటి ప్రాముఖ్యతను తెలియజేసేందుకు, ప్రపంచ నీటి సంక్షోభం గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటాం.
మంచి నీటి వనరులను నిలకడగా నిర్వహించడంతో పాటు నీటి కాలుష్యం, నీటి కొరత, సరిపడా నీరు, పారిశుద్ధ్యం లోపించడం వంటి నీటి సంబంధిత సమస్యల గురించి మరింత తెలుసుకుని, మార్పును తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకునే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం.
మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2% ధృవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6% నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడగలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే.
ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే, పరిశుభ్రమైన నీటిలో, 1% కంటే కూడా తక్కువ పరిమాణంలో ( లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.007 % మాత్రమే) నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది.
ప్రపంచ నీటి దినోత్సవం చరిత్ర:
ప్రపంచ నీటి దినోత్సవాన్ని పాటించాలనే తీర్మానాన్ని యూఎన్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 22, 1992న మొదటిసారిగా ఆమోదించింది. ఆ తర్వాత మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రకటించి జరుపుకుంటున్నాం. మొదటి ప్రపంచ నీటి దినోత్సవం 1993 నుండి మొదలైంది.
ప్రపంచ నీటి దినోత్సవం ప్రాముఖ్యత:
నీరు జీవితానికి అమృతం వంటిది. నీరు లేకుండా జీవితం సాగదు. యూఎన్ ప్రకారం ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు సురక్షితమైన తాగునీరు పొందలేకపోతున్నారు. ఏటా దాదాపు 1.4 మిలియన్ల మంది సరైన నీరు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 74 మిలియన్ల మంది కలుషితమైన నీరు తాగడం వల్ల ఆయుష్షు తగ్గించుకుంటున్నారు.
2030 నాటికి ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందజేయడమే లక్ష్యంగా ఐరాస పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అతి తక్కువ నీటి వనరులనే 750 కోట్ల మందికి పైగా జనాలు, ఇతర జీవరాశులు తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి.
ప్రపంచ నీటి దినోత్సవం థీమ్:
2023 ప్రపంచ నీటి దినోత్సవం థీమ్: నీరు, పారిశుద్ధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్పును వేగవంతం చేయడం(Accelerating the change to solve the water and sanitation crisis) ప్రపంచ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. బిలియన్ల కొద్దీ ప్రజలు, లెక్కలేనన్ని పాఠశాలలు, వ్యాపారాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, పొలాలు, కర్మాగారాల్లో వారికి అవసరమైన సురక్షితమైన నీరు, మరుగుదొడ్లు లేవు. మార్పును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని యూఎన్ పేర్కొంది.



Click it and Unblock the Notifications