మహా శివరాత్రి రోజు పరమేశ్వరుడితో పాటు చంద్రుడిని పూజిస్తే ఎంతో శ్రేయస్కరం

మహా శివరాత్రి రోజున పరమేశ్వరుడితో పాటు చంద్రుడిని పూజించాలని, దాని వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చంద్రుడు శివుడి తలపై ఉంటాడు. అలా శివరాత్రి రోజున చంద్రుడిని పూజిస్తే శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.

హిందువుల అతి ముఖ్యమైన పండగల్లో మహా శివరాత్రి ఒకటి. పరమశివుని భక్తులు రాత్రంతా మేల్కొని ఉపవాసం ఉండి, పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం వస్తోంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో ఉంటాడు. ఆరోజు శ్రావణ నక్షత్రం కూడా ఉంటుంది. మహా శివరాత్రి రోజున పరమేశ్వరుడితో పాటు చంద్రుడిని పూజించాలని, దాని వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చంద్రుడు శివుడి తలపై ఉంటాడు. అలా శివరాత్రి రోజున చంద్రుడిని పూజిస్తే శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.

మహా శివరాత్రి రోజు చంద్రుడి పూజ ప్రాముఖ్యత:

మహా శివరాత్రి రోజు చంద్రుడి పూజ ప్రాముఖ్యత:

శివుడి తలపై జటాజూటంపైన నెలవంక రూపంలో చంద్రుడు ఉంటాడు. చంద్రుడిని ఆరోగ్యం, తెలివితేటలు, సంపదల ప్రదాతగా పరిగణిస్తారు. శక్తి మేర చంద్రుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శివరాత్రి నాడు శివయ్యతో పాటు చంద్రుడిని కూడా పూజించాలని చెబుతారు.

చంద్రుడి కథ:

చంద్రుడి కథ:

పురాణ కథల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. ఆ 27 మంది భార్యల్లో చంద్ర రోహిణి అనే భార్యను ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు. తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. దీని వల్ల మిగతా 26 మంది భార్యలు అసంతృప్తికి గురవుతారు. చంద్రుడిపై కోపం, అసంతృప్తితో మిగతా 26 మంది భార్యలు కలిసి తమ తండ్రి దక్ష ప్రజాప్రతి వద్దకు వెళ్తారు.

చంద్రుడు కేవలం చంద్ర రోహిణిని మాత్రమే భార్యగా చూస్తూ తమను పట్టించుకోవడం లేదని, తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని తండ్రికి చెప్పుకుని వారంతా కన్నీరు పెట్టుకుంటారు. వారి బాధలు విన్న దక్ష ప్రజాపతి చంద్రుడిని శపిస్తాడు. దక్షుడు ఇచ్చిన శాపం వల్ల చంద్రునికి వ్యాధి వస్తుంది. దాంతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటాడు. తనను ఆ శాపం నుండి విముక్తి కలిగించాలని వేడుకుంటూ శివుడిని ప్రార్థిస్తాడు. అలా ఆ వ్యాధి నుండి ఉపశమనం పొందుతాడు.

మహా శివరాత్రి నాడు చంద్రుడి పూజ వల్లే కలిగే లాభాలు:

మహా శివరాత్రి నాడు చంద్రుడి పూజ వల్లే కలిగే లాభాలు:

జీవితంలో ప్రశాంతత ఉంటుంది:

చంద్రుడిని పూజించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. మహా శివరాత్రి నాడు చంద్రుడి ఆరాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

చంద్రారాధన ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది.

ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది:

మహా శివరాత్రి నాడు చంద్రుడిని ఆరాధించడం దైవికంతో కనెక్ట్ చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ఓ ఆధ్యాత్మిక సాధనగా పరిగణించబడుతోంది. ఇది ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని, ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.

 మహా శివరాత్రి రోజు చంద్రుడిని ఎలా పూజించాలి:

మహా శివరాత్రి రోజు చంద్రుడిని ఎలా పూజించాలి:

మహా శివరాత్రి రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి పూజకు ఉపక్రమించాలి. ముందుగా గణపతిని పూజించాలి. ఆ తర్వాతే పరమేశ్వరుడికి పూజ చేయాలి. అనంతరం చంద్రుడిని ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. చంద్రుడి విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలి. ఇంట్లో చంద్రుడి విగ్రహం లేకపోతే.. శివుడి జటాజూటంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి పరమేశ్వరుడి పై పాలతో అభిషేకం చేయాలి.

శివరాత్రి రోజు పాలతో చేసిన స్వీట్లను, ప్రత్యేక వంటకాలను చంద్రుడికి సమర్పించాలి. ఈ రోజున మంచి జరగాలని, ఇంట్లో శ్రేయస్సు కలగాలని చక్కెర కలిపిన పాలను ఇతరులకు దానం కూడా చేస్తారు. అభిషేకం చేసిన పాలను తీర్థంలా భక్తులకు అందించాలి.

Story first published: Wednesday, February 15, 2023, 11:07 [IST]
Desktop Bottom Promotion