For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rashi Phalalu 2020 : ఏమి జరగబోతుందో తెలుసా.. మీ వార్షిక భవిష్యత్తు ద్వారా తెలుసుకోండి..

|

2020 నూతన సంవత్సరం ప్రారంభమవ్వడానికి కేవలం కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది 2019 గురించి మరచిపోయి 2020లో ఆలోచనలు మొదలుపెట్టారు. నూతన సంవత్సరం అంటే ప్రతి ఒక్కరికీ కొత్త కొత్త అంచనాలు, కొత్త కలలు, మంచి ఆశయాలు మదిలో మెదులుతుంటాయి. పాత సంవత్సరంలో మీరు పడ్డ కష్టాలు తొలగిపోయి నూతన సంవత్సరంలోనైనా మీరు సంతోషకరమైన జీవితం సాగించాలని మేము మనసారా కోరుకుంటున్నాం.

Yearly Rashi Palalu

ఇక విషయానికొస్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020 నూతన సంవత్సరంలో మీ గ్రహాలు ఎలా ఉన్నాయో, నూతన ఏడాదిలో 12 రాశి చక్రాల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎవరు మంచిగా ఉంటారు, ఎవరు చెడ్డగా ఉంటారు. ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరెవరు ఏయే రంగంలో విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే వార్షిక రాశి ఫలాల వివరాలను పూర్తిగా చూడండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి నూతన సంవత్సరం అంటే 2020లో పనికి సంబంధించిన విషయంలో మంచిగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం ఎదురుచూస్తుంటే కచ్చితంగా ఉద్యోగం సాధించడంలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను పొందుతారు. నూతన సంవత్సరంలో మీరు ఆర్థిక పరంగా మంచి అవకాశాలను పొందనున్నారు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో ఒక శుభకార్యం నిర్వహించవచ్చు. సంవత్సరం మధ్యలో మీ సోదరుడు లేదా సోదరి వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభ రాశి : 20 ఏప్రిల్ - 20 మే

వృషభ రాశి : 20 ఏప్రిల్ - 20 మే

ఈ రాశి వారు పాత సంవత్సరంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల నుండి ఈ నూతన సంవత్సరంలో ఉపమశనం కలుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. అలాగే అన్ని చింతలు తొలగిపోతాయి. గత సంవత్సరం మిగిలిపోయిన పనులు ఈ ఏడాది పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం మీ కెరీర్ లో మీరు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కొత్త సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ఏడాది ఆరోగ్యం బాగుంటుంది కానీ, నిర్లక్ష్యంగా మాత్రం ఉండకూడదు.

మిధున రాశి : మే21 - జూన్ 20

మిధున రాశి : మే21 - జూన్ 20

ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో ఆనందం లభిస్తుంది. కానీ అదే సమయంలో మీరు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. అవి ఎలాంటివి అంటే పని మరియు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కావచ్చు. వ్యాపారులకు వారి పనులలో చిన్న పరిమితుల కారణంగా ఇబ్బందులు రావచ్చు. ఉద్యోగం చేసే వ్యక్తులు కూడా కొత్త సంవత్సరం సగం పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రత్యేక విజయాలను పొందలేరు. మొదటి మూడు నెలల ఆర్థిక పరిస్థితులు చాలా మంచిగానే ఉంటాయి. కానీ క్రమంగా ఇబ్బందులు పెరగడం మొదలవుతుంది. కుటుంబంలో ఒడిదుడుకులు ఉంటాయి. కానీ మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కొత్త సంవత్సరం 2020 అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనది. కొత్త ఏడాదిలో మీరు కొత్త రిలేషన్ షిప్ ను స్టార్ట్ చేయవచ్చు. ప్రేమ మరియు రొమాన్స్ అనేది మీ తలుపు తడుతుంది. మీరు ఇన్నాళ్లు ఎదురుచూసిన క్షణాలు కొత్త ఏడాదిలో తీరుతాయి. ఆఫీసులో మంచి ఫలితాలు ఉండవచ్చు. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారులు లాభం పొందడానికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు. మీ వ్యాపారం కూడా బలంగా పెరుగుతుంది. ఈ సంవత్సరం, ఇంట్లో కొన్ని ఆర్థిక ఉద్రిక్తతలు ఉండవచ్చు. అది ఎంతలా అంటే మీరు మీ కుటుంబం నుండి విడిపోవడానికి దారి తీస్తుంది. అలాగే కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్యం బాగా ఉండదు. తండ్రికి సంబంధించి అనారోగ్యం మిమ్మల్ని చుట్టుముడుతుంది.

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో ముందుకు సాగడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అయితే అలాంటి అనుకూలమైన పరిస్థితుల కోసం మీరు చాలా కష్టపడాలి. అయితే మీరు చేసిన ప్రయత్నాలకు కచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తే, మీకు ఉన్నత స్థానం లభిస్తుంది. కొత్త సంవత్సరం వ్యాపారులకు కూడా ఎక్కువ లాభాలను తెస్తుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడంలో లేదా కొత్త వ్యాపారంలో మీరు మీ లక్కీ కోసం ప్రయత్నించవచ్చు. కొత్త సంవత్సరం విద్యార్థులకు కూడా చాలా మంచిది. నూతన సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కానీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక ఆర్థిక సవాళ్లు కూడా ఉండొచ్చు. అయినా కూడా మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలనుకుంటే ఆ విషయంలో విజయం సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కాలంగా అందుకోసం వీరు గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారు గనుక. ఉద్యోగం చేసే వారికి ఈ ఏడాది చాలా ముఖ్యంగా ఉంటుంది. మీరు పురోగతి కోసం బదిలీని పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త సంవత్సరంలో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ చివరికి ఎలాగోలా విజయం సాధిస్తారు. అలాగే మంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా, కొత్త ఇల్లు, లేదా కొత్త వాహనం కొనుక్కోవాలనే మీ కల కూడా కొత్త సంవత్సరంలో నెరవేరవచ్చు. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, మీరు దాని నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే మీరు ఈ సంవత్సరం ఆరోగ్యంగా ఉంటారు. కాకపోతే పనిలో ఎక్కువ ఒత్తిడి పెట్టడం మానుకోండి.

తులా రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి కొత్త సంవత్సరానికి సంబంధించి చాలా భిన్నంగా మరియు కొత్తగా ఉంటుంది. వీరు కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు. వీరి కృషికి తగ్గ ఫలితాలను కొత్త సంవత్సరంలో కచ్చితంగా పొందుతారని గ్రహాల స్థానాలు చెబుతున్నాయి. మీరు అద్భుతమైన పనితీరు కనబరిచి మీ ఖ్యాతిని కూడా పెంచుకుంటారు. కొత్త సంవత్సరంలో మీకు పదోన్నతి(ప్రమోషన్) అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు వ్యాపారవేత్త అయితే మీరు పెద్ద వ్యాపారన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. కానీ సరైన సలహా ఇచ్చిన తర్వాతే ఒక అడుగు ముందుకు వేయాలని గుర్తుంచుకోండి. నూతన సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. అయితే, మీ ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త సంవత్సరంలో కొంత ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి 2020 కొత్త ఏడాదిలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు నూతన ఏడాది సందర్భంగా కొంత పెద్ద పురోగతిని సాధించవచ్చు. అంతే కాకుండా, ఈ కాలంలో ఏదైనా కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. కొత్త సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. మీరు చాలా డబ్బును సంపాదించగలుగుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులు కోరిక సంవత్సరం మద్యలో పూర్తి కావచ్చు. కొత్త ఏడాదిలో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో కుటుంబానికి సంబంధించిన సమస్యల నుండి చాలా ఉపశమనం లభిస్తుంది. కొత్త ఏడాదిలో మీరు మీ సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. వాటిని ఇంకా బలోపేతం చేయడంలో చాలా విజయవంతమవుతారు. మీ పెద్ద ప్రణాళిక ఈ సంవత్సరం పూర్తి కాకపోవచ్చు. పని గురించి ప్రస్తావిస్తే, వ్యాపారులకు కొత్త సంవత్సరం చాలా బాగా కలిసొస్తుంది. అయితే మీ భాగస్వామిని ఎక్కువగా నమ్మకపోవడం మీకే మంచిది. నిరుద్యోగ వ్యక్తులకు సంవత్సరం చివరినాటికంతా విజయం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా కుదురుకోవాలంటే మీరు ఎంత ఎక్కువ పనిచేస్తే అంత మంచిది. కొత్త సంవత్సరం మీ ఇంట్లోకి కొత్త సభ్యుడు వస్తారని ఆశిస్తారు. ఆరోగ్యం పరంగా కొత్త సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది.

మకర రాశి డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి కొత్త సంవత్సరం చాలా కష్టంగా ఉండొచ్చు. అయితే, మీపైన మీరు విశ్వాసం ఉంచుకోండి. కొత్త సంవత్సరంలో మీరు కొన్ని ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చు. దీని వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. నిరుద్యోగులకు నూతన సంవత్సరం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఓ మంచి కంపెనీలో పర్మినెంట్ జాబ్ కోసం చేసిన దీర్ఘకాల పోరాటం ముగిసే అవకాశం ఉంది. మీ పనిని శ్రద్ధగా చేస్తూ ఉండండి. వ్యాపారులు కొత్త సంవత్సరంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అలాగే మీ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటాయి.

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి కొత్త సంవత్సరం అనేక సవాళ్లు ఎదురవుతాయి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు దాన్ని పూర్తి ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. మీ కెరీర్ కు సంబంధించి తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మీ ఉద్యోగాన్ని మార్చడానికి లేదా ట్రాన్స్ ఫర్ కోసం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అనుభం ఉన్న వారు మరియు నమ్మదగిన వ్యక్తులతో కలసి పని చేయాలని పెద్దలు సూచిస్తారు. మీ చిన్న అజాగ్రత్త వల్ల మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక రంగంలో మీకు కొత్త సంవత్సరంల కొత్త ఆదాయ వనరు లభిస్తుంది.

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 21

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 21

ఈ రాశి వారికి కొత్త సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. దీని వల్ల మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో పెద్ద విజయాలు సాధిస్తారు. అది ఇతరులలో మీ గౌరవాన్ని పెంచుతుంది. వ్యాపారులు కూడా ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారని భావిస్తారు. అయితే మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు మీకు సలహా ఇస్తారు. ఆర్థిక పరమైన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. అలాగే ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. కొత్త సంవత్సరం, మీరు అనేక వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని భావిస్తున్నారు. ఆరోగ్య పరంగా ప్రారంభంలో బాగా ఉంటుంది. కానీ మీరు తర్వాత సమస్యలను ఎదుర్కొంటారు.

English summary

Yearly Rashi Palalu 2020 For The 12 Zodiac Signs

Check out the rashi palalu 2020 for all 12 Zodiac signs. Know your yearly horoscope 2020 in telugu for all areas of life.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more