Latest Updates
-
మష్రూమ్ చికెన్ మసాలా..కిర్రాక్ టేస్ట్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు! -
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు!
ఈ రాశిచక్రాలు అత్యంత రహస్యపూరితమైనవట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనం భవిష్యత్తును అంచనా వేయొచ్చు. రాశిచక్ర గుర్తులు ఒక వ్యక్తి యొక్క ఆయుష్షును కూడా అంచనా వేస్తాయి. గ్రహ మార్పులను మరియు జన్మ గుర్తులను అర్థం చేసుకోవడం ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.

అయితే రాశిచక్రాన్ని బట్టి వ్యక్తుల జీవితంలో మంచి మరియు చెడు విషయాలను ఊహించడానికి మరియు ఒకరి లక్షణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తి యొక్క పాత్రను కూడా దీని ద్వారా లెక్కించవచ్చు.

ఈ సందర్భంగా ఏయే రాశిచక్రాల వారు రహస్యపూరితంగా వ్యవహరిస్తారు.. ఏయే విషయాల్లో వారిని అర్థం చేసుకోవడం కష్టం.. అసలు వారు ఎందుకు అలా వ్యవహరిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు అత్యంత ఆసక్తికరమైన రాశిచక్రాలలో ఒకరు. వీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తారు. ఏదైనా పెద్ద గొడవలు జరుగుతున్నప్పుడు మెల్లగా పక్కకు తప్పుకుంటారు. అయితే తర్వాత వారితో చర్చించినప్పుడు, వారు లోతుగా అర్థం చేసుకున్న వాటిని వివరించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఈ రాశి వారు రహస్యంగా ఉండటంలో మంచి నైపుణ్యం కలవారు. అందుకే వీరు ఏమి ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. వీరి రహస్యపూరితం కారణంగా ఇతరులను సులభంగా మోసం చేయొచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు తమదైన శైలిలో పనులు చేసుకుంటూ పోతారు. వీరు ఎవ్వరితోనూ గట్టిగా మాట్లాడరు. వీరు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మరియు ప్రశాంతంగా గమనిస్తారు. వీరు మల్టీ టాలెంటెడ్ పీపుల్. ఈ కారణంగా వీరు ఒకటి కంటే ఎక్కువ స్థిరమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. వీరు ప్రతి విషయానికి వారి సొంత ద్రుక్పథాన్ని మరియు వివరణ ఇస్తారు. వీరు ఎవరైనా ఏదైనా విషయం చెబితే సావధానంగా వింటారు. గుర్తుంచుకుంటారు. వీరు రహస్యంగా సమాచారం పొందడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతుంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా సరదాగా ఉంటారు. వీరు చిలిపి పనులు చేయడాన్ని బాగా ఇష్టపడతారు. వీరి గురించి మనం ఊహించటానికి అందరినీ అనుమతిస్తారు. అందుకే వీరి గురించి చాలా మందికి స్పష్టంగా తెలుస్తుంది. అయితే వీరి వ్యక్తిత్వాన్ని గ్రహించడంలో వీరు ఎక్కువగా విఫలమవుతారు. వీరు చూడటానికి సరదాగా కనిపించిన లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు.

తుల రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరితో అయినా స్మార్ట్ గా వ్యవహరిస్తారు. వీరు తమ రహస్యపూరిత వ్యక్తిత్వంతో గర్వంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. దీనినే ఎక్కువగా ఇష్టపడతారు. వీరిని అర్థం చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అంతేకాదు చాలా కష్టం కూడా. ఏదైనా విషయంలో వీరి సామర్థ్యం చూసి ఇతరులు ఆశ్చర్యపోతుంటారు. వీరు ఆనందం అయినా.. దుఃఖం అయినా ప్రతి విషయాన్ని తమలో తాము దాచుకుంటారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు బలం మరియు బలహీనత రెండింటినీ ఒకేలా తీసుకుంటారు. అందుకే వీరు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. వీరిలో మనం ఊహించలేని మరో కోణం ఏమిటంటే.. వీరు కొత్త విషయాలను నేర్చుకోవటానికి మరియు ఆ కొత్త విషయాలతో ప్రయోగాలు చేయటానికి ఇష్టపడతారు. ఈ రాశి వారిని అర్థం చేసుకోవడానికి అదనపు సమయం ఏదీ అవసరం లేదు. వీరు హిప్నోటిక్ ఉనికితో ఉండే వారు. వీరు ఏదైనా విషయాలను చాలా బాగా గమనిస్తారు. అందుకే చాలా మంది వృశ్చిక రాశి వారు నటనలో రాణించారు. వీరు నటిస్తూ చాలా బాగా పని చేస్తారు. అలాగే వీరు ఇతరుల నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటారు.

మకర రాశి..
ఈ రాశి వారికి ఏదైనా విషయంలో విఫలం అయితే చాలా భయంగా గడుపుతారు. వీరి గురించి పెద్ద రహస్యాలలో ఇది ఒకటి. అయితే ప్రతి సందర్భంలో మకర రాశి వారి తదుపరి కదలిక ఏమిటో ఎవ్వరికీ చెప్పరు. వీరు ఎల్లప్పుడూ శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే, వీరు ఎప్పుడూ నమ్మకూడని వ్యక్తులను సులభంగా విశ్వసిస్తారు. అందుకే వీరి గురించి చాలా మంది ప్రజలు ఏదో ఒకటి ఊహిస్తారు. వీరి రహస్యపూరిత వ్యక్తిత్వం కారణంగా వీరిని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు.

కుంభ రాశి..
ఈ రాశి చక్రం వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడతారు. వీరిది రహస్యపూరిత వ్యక్తిత్వం అని అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. వీరు ఎవరు లేదా ఏదో గమనిస్తున్నారనే వాస్తవం చాలా సులభంగా చెప్పొచ్చు. వీరు తమ భవిష్యత్తు గురించి ఏదైనా సందేహం వచ్చినప్పుడు, మరింత రహస్యంగా వ్యవహరిస్తారు. అయితే వీరు మరీ అంత ఎక్కువ రహస్యంగా ఏమీ ఉండరు.

మీన రాశి..
ఈ రాశి వారి వ్యక్తిత్వాలను ఊహించడం చాలా కష్టం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే, వీరు కూడా కొన్నిసార్లు తమ గురించి తామే అర్థం చేసుకోకపోవచ్చు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వీరి గురించి వీరు ఊహించలేరు. కానీ ఈ రాశి వారు అత్యంత రహస్యపూరిపూరిత జాబితాలో ఉన్నారు. అయితే వృశ్చికరాశి కంటే వీరు వెనుకబడి ఉంటారు.



Click it and Unblock the Notifications











