Latest Updates
-
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా.. -
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.!
ఈ 5 రాశుల వారిని పెళ్లి చేసుకుంటే నరకం చూపిస్తారట...!
ఈ రాశిచక్రాల భాగస్వాములు చాలా భయంకరంగా ప్రవర్తిస్తారట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.
ఏ బంధం అయినా నమ్మకం, అర్థం చేసుకునేతత్వం, ప్రేమ, ఆప్యాయత ఉంటే అది చాలా కాలం పాటు బలంగా ఉంటుంది. ఇక వైవాహిక బంధంలో ఎంత సన్నిహితంగా ఉంటే.. ఆ సంబంధం అంత సాఫీగా సాగిపోతుంది.

ఇలా రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా మారేందుకు ఆలుమగలు ఇద్దరూ కోఆపరేట్ చేసుకోవడం అనేది అత్యంత అవసరం. ఇద్దరిలో ఏ ఒక్కరూ తమదే ఆధిపత్యం కావాలని ప్రయత్నించినా.. తాము చెప్పిందే జరగాలని ఆశించినా.. ఆ బంధంలో చీలికలు రావడం ప్రారంభమవుతుంది. అయితే వివాహ జీవితంలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ గా ఉండరు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి సంబంధించిన ప్రత్యేక లక్షణాలు వారికి ఉంటాయి. ఇక రిలేషన్ షిప్ కు సంబంధించి ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా చెడు చేయకపోయినా.. అది వారి స్వభావం వల్ల అలా జరిగిపోతూ ఉంటుంది. అయితే కొందరు మాత్రం చెడు ఉద్దేశ్యాలతో.. చెడ్డ లక్షణాలతో తమ వివాహ బంధాన్ని చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వారు పుట్టిన జన్మ రాశి అని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏ రాశుల వారిని పెళ్లి చేసుకోవడం వల్ల వివాహ సంబంధంలో సమస్యలు వస్తాయి.. ఎవరెవరు ఎలాంటి నరకం చూపుతారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి.. వారి వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం అనేదే ఉండదట. ఈ దంపతులిద్దరూ చిన్న చిన్న విషయాలకే గొడవ పడతారట. అంతేకాదు వివాహం జరిగిన కొంత కాలానికే భాగస్వామికి దూరంగా ఉండటం ప్రారంభిస్తారట. వీరు తమ జీవిత భాగస్వామి గురించి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారట. తమ పార్ట్నర్ వారిని విడిచి ఎక్కడికి వెళ్లేందుకు.. ఎక్కడా పాల్గొనేందుకు అస్సలు అనుమతించరట. మరో విచిత్రం ఏంటంటే.. మేష రాశిని వివాహం చేసుకుంటే.. భాగస్వామిని విదేశీయులుగా భావిస్తారట.

వృషభ రాశి..
ఈ రాశి వారిని వివాహం చేసుకోవడం వల్ల మీరు అతి తక్కువ కాలంలోనే పశ్ఛాత్తాప పడొచ్చు. ఎందుకంటే పెళ్లైన కొన్ని రోజులకే మీ జీవితాన్ని వారు శాసించే స్థాయికి వెళ్తారు. అందుకోసం వారికి తెలిసిన కళలన్నింటినీ వాడుకుంటారు. అంతేకాదు ఈ రాశి వారు వివాహ సంబంధంలో చాలా విషయాల్లో మొండిగా వ్యవహరిస్తారు. వీరికి అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు తమ ఇంటి జీవితాన్ని సులభంగా నరకంగా మార్చేస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారిని వివాహం చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయట. వీరు ప్రతి ఒక్క విషయానికి పార్ట్నర్ ను ప్రశిస్తూ ఉంటారు. అయితే వారిని ఏదైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. ఇక ఆర్థిక పరమైన విషయాల్లో భాగస్వామిని బాగా ఇబ్బంది పెడతారు. దీంతో మీ వైవాహిక సంబంధం పెను ప్రమాదంలో పడిపోతుంది.

మకర రాశి..
ఈ రాశి వారిని వివాహం చేసుకోవాలనుకుంటే.. వీరు తమ జీవిత భాగస్వామి యొక్క ప్రయత్నాలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వరని గుర్తుంచుకోవాలి. అంతేకాదు ఈ రాశి వారు ఏదైనా తప్పు చేస్తే..ఎప్పటికీ అంగీకరించరు. అంతేకాదు వీరి వివాహ సంబంధం ప్రమాదంలో ఉన్నప్పటికీ, వీరు తమ తప్పును మాత్రం ఒప్పుకోరు.

కుంభ రాశి..
ఈ రాశి వారిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, జీవితాంతం ఆ నిర్ణయానికి మీరు చింతిస్తారు. ఎందుకంటే, వీరికి ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే భాగస్వామితో బంధానికి అస్సలు చొరవ చూపారు. వీరు ఎల్లప్పుడూ తమ భాగస్వామి సమయాన్ని మరియు కృషిని మాత్రమే పెట్టుబడి పెట్టాలని ఆశిస్తారు.



Click it and Unblock the Notifications