Latest Updates
-
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.!
ఈ 4 రాశుల వారు ‘ఆ’ విషయంలో సూపర్ స్టార్ రజినీలా ఉంటారట..! మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
ఈ రాశుల వారు ఆధ్యాత్మిక విషయాలపై అత్యంత ఎక్కువ ఆసక్తి చూపుతారట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.
మన దేశంలో ఆధ్యాత్మికత విషయాలపై అనేక మంది అత్యంత ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఆధ్యాత్మికతను అనుసరించడం వంటివి చేస్తున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఆత్మకు సంబంధించిన విషయాలను సూచిస్తుందని చెబుతున్నారు పెద్దలు.

ఆధ్యాత్మికతను అనుసరించడం వల్ల అనేక రకాల ఉపయోగాలున్నాయని కూడా చెబుతున్నారు. అయితే కొందరు వ్యక్తులు మాత్రం న్యూమరాలజీ, అస్ట్రాలజీ ఇతర వాటిని నమ్ముతుంటారు. మరికొందరు వ్యక్తులు సైన్స్ ను ఎక్కువగా నమ్ముతూ బతికేస్తూ ఉంటారు. అయితే మన దేశంలో మాత్రం అనేక మంది వ్యక్తులు మతం, దేవుడు అనే భావనలో ఉంటూ.. ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కువగా గడుపుతారు.

ఇవి మత విశ్వాసానికి మరియు అతీంద్రియ సత్యాలకు దగ్గరగా ఉంటాయనే భావనలో ఉంటారు. ఈ విషయాలు మానవళి యొక్క గత స్వభావాన్ని మరియు తమ ఉద్దేశ్యాన్ని సూచిస్తాయని భావిస్తారు. ఆధ్యాత్మికత అనేది శరీరం మరియు ఆత్మ మధ్య వ్యత్యాసాన్ని సూచించే మనస్సు-శరీర ద్వంద్వతను సూచిస్తుంది. అందుకే ఆధ్యాత్మికత భౌతిక లౌకిక విషయాలతో వైరుధ్యంగా పరిగణించబడుతుంది. ఇదిలా ఉండగా కొందరు వ్యక్తులు మతాలను గౌరవిస్తారు. మరి కొందరు తమ కర్మలను మరియు పునర్జన్మలను కూడా నమ్ముతారు. అత్యంత శక్తి వంతులైన దేవతలు మరియు దేవుళ్లకు సంబంధించిన గ్రంథాలు వీరికి అత్యంత ముఖ్యమైనవి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాశుల వారు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారట. వీరికి భక్తి భావాలు చాలా ఎక్కువగా ఉంటాయ. ఈ సందర్భంగా ఆ రాశిచక్రాలేవో చూసెయ్యండి...

కర్కాటక రాశి..
ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. వీరు చాలా సులభంగా గాయపడొచ్చు. కానీ వీరిని ఆధ్యాత్మిక అంశాలు వీరిని వేరు చేస్తాయనడంలో సందేహం లేదు. వీరు ఇతరులపై ప్రేమతో నిండి ఉంటారు. వీరు ఆధ్యాత్మికత దగ్గరగా ఉన్నవారిని ప్రత్యేకంగా మరియు ప్రత్యేకమైన రీతిలో ఉండేందుకు అనుమతిస్తుంది. వీరు ప్రేమించబడటానికి ఖచ్చితమైన కారణం అదే. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు, వీరు మానసికంగా చాలా ఆనందాన్ని పొందుతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఎక్కువ సమయం పాటు చాలా బిజీగా గడుపుతారు. వీరు తమ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం అనునిత్యం కష్టపడుతూ ఉంటారు. అయితే ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేస్తారు. వీరు ఏదైనా తప్పు చేస్తే.. వారిని ఎవరైనా గమనిస్తూ ఉంటారని నమ్ముతారు. అందుకే వీరు చెడు పనుల గురించి ఎక్కువగా ఆలోచించరు. కేవలం మంచి పనుల గురించే ఆలోచిస్తారు. వీరు గత జన్మల గురించి.. పునర్జన్మల గురించి అన్ని విషయాలను నమ్ముతారు. ఎవరు చేసిన కర్మకు వారు ఫలితాన్ని అనుభవిస్తారని నమ్ముతూ ఉంటారు.

ధనుస్సు రాశి..
ఈ రాశి వారు ప్రపంచం మొత్తాన్ని ఏదో ఒక తెలియని శక్తి ద్వారా నియంత్రణలో ఉంచుకుంటుందని నమ్ముతారు. వీరిని ఎవరైనా అనునిత్యం కచ్చితంగా గమనిస్తూ ఉంటారని.. నమ్ముతారు. వీరు తమ జీవితం యొక్క లోతైన అర్ధాన్ని అన్వేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా, ఈ రాశిచక్ర గుర్తుల వారు సంప్రదాయాలు, నమ్మకాలు, పవిత్ర ఆచారాలు మరియు మతాలను గౌరవిస్తారు.

మీన రాశి..
ఈ రాశి వారు ఆధ్యాత్మిక పరంగా అత్యంత ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు చాలా రహస్యంగా ఉంటారు. ఎక్కువగా ఊహాత్మక ప్రపంచంలో జీవించాలనుకుంటున్నారు. వీరు తమ లైఫ్ లోని ఏ విషయాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు. వీరు సెల్ఫ్ లైఫ్ లో జీవించడాన్ని కోరుకుంటారు. వీరు తమ జీవితం
గురించి అన్ని విషయాలు తెలుసుకునేందుకు అన్వేషిస్తూ ఉంటారు. వీరు ప్రతి ఒక్కరితోనూ దగ్గరి సంబంధాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంటారు. వీరికి యమలోకం, స్వర్గ లోకం వంటి వాటిపై ఎక్కువ నమ్మకం ఉంటుంది.



Click it and Unblock the Notifications