Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ 5 రాశుల వారు ‘ఆ’ విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారట...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...
ఈ రాశుల వారు ఏ రంగంలో అయినా అత్యంత ఎక్కువ పోటీని ఇస్తారట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.
ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్క రంగంలో పోటీ అనేది అనివార్యం అయిపోయింది. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఎవరైతే సక్సెస్ సాధిస్తారో వారే అందరికంటే ముందుంటారు. విద్యార్థులకు పరీక్షలు, మార్కుల విషయంలో పోటీ.. వ్యాపారులకు వ్యాపారం గురించి పోటీ.. సినిమా హీరో, హీరోయిన్లకు తామే టాప్ నిలవాలనే తాపత్రయంతో పోటీ పడుతూ ఉంటారు.

అయితే పోటీలో పాల్గొనే వారిలో చాలా మంది అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటారు. అయితే కొందరు పోటీతత్వాన్ని అస్సలు ఇష్టపడరు. పోటీ ఉందంటే చాలు ముందే చేతులెత్తేస్తుంటారు. పోటీలను చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం బరిలోకి దిగారంటే చాలు ఎలాంటి పోటీలోనైనా తమనే విజయం వరించాలని కోరుకుంటారు.

అందుకు తగ్గట్టుగానే కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకా కొందరు వ్యక్తులు గెలుపోటముల గురించి పెద్దగా పట్టించుకోరు. కేవలం పోటీలో పాల్గొంటే చాలు అని భావిస్తారు. ఇంతకీ అలాంటి వ్యక్తులెవరోనని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే జ్యోతిష్యశాస్త్రం ఆ రాశిచక్రాల వ్యక్తులెవరో ఇప్పుడే తెలుసుకోండి.. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి వారికి తొందరపాటు చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా రంగంలో పోటీకి దిగారంటే చాలు అందులో విజయం సాధించే వరకు అస్సలు నిద్రపోరు. వీరు పాల్గొనే పోటీల్లో తాము అందరికంటే ముందు ఉండాలని.. అందరిలోనూ తామే ఉత్తమం అని నిరూపించుకోవాలని తాపత్రాయపడుతూ ఉంటారు. పోటీల విషయంలో ఎవరైనా వీరితో బెట్టు కడితే చాలు వెంటనే రంగంలోకి దిగిపోతారు. అంతేకాదు తమ ప్రత్యర్థులకు ఓడించేందుకు ఎంతదూరమైన వెళ్తారు. అందుకే ఈ రాశి వారితో పోటీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

వృషభరాశి..
ఈ రాశి వారు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. అందుకోసం ఎంత పోటీనైనా తట్టుకుంటారు. ఎంత కష్టమొచ్చినా అస్సలు వెనుకడుగు అనేదే వేయరు. ఏదైనా పోటీలో పాల్గొనేటప్పుడు వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోటీలలో గెలిచేందుకు ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తారు. ఎందుకంటే వీరికి కాంపిటేషన్ స్పిరిట్ చాలా ఎక్కువ. అందుకే వీరు ప్రతి పోటీలోనూ విజయం సాధిస్తూ ఉంటారు. అంతేకాదు వీరు చాలా విషయాల్లో డేరింగ్ గా దూసుకెళ్తుంటారు. కాబట్టి పోటీల్లో వీరిని ఓడించడం అంత ఈజీ కాదు.

సింహ రాశి..
ఈ రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు సమాజంలో ఉన్న వ్యక్తుల కంటే తామే గొప్ప వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటారు. సొసైటీలో తమకంటూ ప్రత్యేక పేరు.. మర్యాద, గౌరవం దక్కాలని భావిస్తారు. వీరు ఏదైనా గొప్ప పని చేసినప్పుడు ఆ విషయం గురించి పది మందికి తెలియాలని.. వారే ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తారని భావిస్తారు. ఇక ఈ రాశి వారు ఏదైనా పోటీలో పాల్గొంటే మాత్రం విజయం అనేది లేకుండా వెనుదిరిగి చూడరు. ఓడిపోవడం అనేది వీరి చరిత్రలోనే లేదు. అందుకే వీరు చాలా విషయాల్లో డేరింగ్ గా ఉంటారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇతరుల మాదిరిగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోరు. వీరు చాలా విషయాల్లో కూల్ గా ఉంటారు. చూడటానికి ప్రశాంతంగా కనిపించినప్పటికీ.. వీరు ఏదైనా పోటీలో పాల్గొంటే మాత్రం చాలా దూకుడుగా ఉంటారు. ఈ విషయం గురించి ప్రత్యర్థులకు చాలా లేటుగా తెలుస్తుంది. అందుకే ఈ రాశి వారు చాలా విషయాల్లో డేరింగ్ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మకర రాశి
ఈ రాశి వారు పోటీ తత్వాన్ని బాగా ఇష్టపడతారు ఎందుకంటే వారు నిజంగా ఉత్తములని నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా చూస్తారు. వీరు ఎప్పటికైనా బాస్ కావాలని కోరుకుంటారు. వీరు విజయం సాధించడానికి పోటీ అనేది సులభమైన మార్గం అని వారికి తెలుసు. ప్రజలు తాము ఉత్తములమని చెప్పినప్పుడు వారు పిచ్చి మాటలు మాట్లాడరని నిరూపించడానికి ఇది సులభమైన మార్గం. కాబట్టి పోటీలో గెలవడానికి ఏం చేయడానికైనా వెనుకాడరు.



Click it and Unblock the Notifications