Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
ఈ రాశుల వారు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ.. ఇతరులను మోసం చేస్తారట...! వీరితో జర జాగ్రత్త..!
ఈ రాశి చక్రాల వారు విషపూరితం మరియు స్వార్థపూరితంగా ఆలోచిస్తారట.
మన సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం మరియు స్వభావం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అందరూ ఒకే మాదిరిగా ఉండరు.

ఒకే రకంగా ఆలోచించరు కూడా. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశిచక్రాల ఆధారంగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ రాశుల వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. జ్యోతిష్యశాస్త్ర నిపుణుల అభిప్రాయం మేరకు.. ద్వాదశ రాశులలో అన్ని రాశుల వారు ఒకేలా ఉండరు. కొన్ని రాశుల వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటే.. మరికొన్ని రాశులకు విభిన్న లక్షణలు ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే కొన్ని రాశుల వారు చాలా విషపూరితంగా మరియు స్వార్థపూరితంగా ఉంటారట. వీరు ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు చేస్తూ.. అధిపత్యం చెలాయిస్తూ... అభద్రతా భావంలో ఉంటారట. అంతేకాదు ఇతరులు ఏమనుకుంటున్నారోననే విషయాలను అస్సలు పట్టించుకోరట. ఇలాంటి రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారు ఎక్కువగా సెల్ఫీష్ గా ఉంటారు. అయితే వీరు చాలా సున్నిత మనస్తత్వంతో ఉంటారు. ఎవరైనా వీరిని ఏదైనా ఒక మాట అంటే వెంటనే బాధపడతారు. తమలో తామే తెగ బాధపడతారు. చీటికి మాటికి అలుగుతారు. అందుకే ఈ రాశి వారిని ఏదైనా అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు ఈ రాశి వారు గతంలో జరిగిన విషయాలను లేవనెత్తుతారు. అస్తమానం పాత విషయాలనే గుర్తు చేస్తుంటారు. ఆ సమయంలో తాము ఎంత బాధపడ్డామని.. చెబుతుంటారు. ఎదుటి వ్యక్తులు ఎంత నచ్చజెప్పినా అస్సలు కంట్రోల్ అవ్వరు. తాము చెప్పిందే చెప్పి తెగ ఫీలయిపోతారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ప్రతి ఒక్క పనిని ప్రణాళిక బద్ధంగా చేయాలనుకుంటారు. అయితే వీరు స్వభావ రీత్యా అన్నింట్లోనూ తమ ఆధిపత్యమే నడవాలని.. అన్నింట్లో తమదే పైచేయిగా ఉండాలని కోరుకుంటారు. చాలా సార్లు తమ ఆధిపత్యం కోసం మోసం కూడా చేస్తుంటారు. మొత్తానికి ఏమి చేసైనా మోసపూరితంగా వ్యవహరిస్తారు. అంతేకాదు ఈ రాశి వారు ఏ విషయంలో అంత సులభంగా కాంప్రమైజ్ కారు. వీరి గురించి ఎవ్వరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోరు. వీరు ఏమి అనుకుంటారో ఆ పనిని గుడ్డిగా చేసుకుంటూ పోతారు. తాము చేయాల్సిన పనులపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. అయితే వీరికి కొంత అభద్రతా భావం ఉంటుంది. అన్ని తమకే కావాలనుకుంటారు. అంతేకాదు ప్రతిదీ వీరి కంట్రోల్ లో ఉండాలని భావిస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారు స్వభావ రీత్యా నలుగురిలో కలిసిపోవడమే కాదు.. నలుగురితోనూ కలిసిపోతూ.. నవ్విస్తూ ఉంటారు. వీరు చాలా విషయాల్లో ఓపెన్ గా ఉంటారు. ఎక్కడా సిగ్గు పడటం.. మోహమాటపడటం వంటివి చేయరు. అయితే వీరు ఒక్కొక్కరితో ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. దీని వల్ల ఇతరులు ఈ రాశి వారిని అంత సులభంగా నమ్మలేరు. ఈ రాశి వారు రెండు నాల్కల ధోరణి కూడా అవలంభిస్తారు. అందుకే వీరి వ్యవహార శైలి ఎప్పుడు ఎలా ఉంటుందో.. వీరిని నమ్మాలో వద్దో అర్థం కాక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారికి భావోద్వేగాలు అంతగా ఉండవు. వీరు ఎవ్వరినీ అంత సులభంగా నమ్మరు. అందుకే వీరి చుట్టూ ఉన్నవారు మంచి వారు కాదేమో అనే అభిప్రాయానికి వస్తుంటారు. దీంతో వీరు చాలా మందికి దూరంగా ఉంటారు. ఇలాంటి స్వభావం వల్ల ఈ రాశి వారికి మరియు ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల వీరు ఇతరులతో ఎక్కువ సంబంధాలను పెంచుకోలేరు. అంతేకాదు ఏదైనా సందర్భంలో గొడవ జరిగినా.. అస్సలు సర్దుకుపోరు. దీని వల్ల ఇతరులతో మరింత ఇబ్బందిగా ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











