Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Teachers Day 2021:ఈ రాశుల వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటారట...!
టీచర్స్ డే 2021 సందర్భంగా ఏ రాశి వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా మారతారో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల ఆధారంగా మనం జన్మించిన నక్షత్రాలు మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి. మనం పుట్టిన రోజు నుండి, నక్షత్రాలు మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

మనం చేసే పనుల నుండి మనకు ఉన్న ఆసక్తుల వరకు ప్రతిదీ వాటిపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే మన జాతకం ఆధారంగా మన కెరీర్ నిర్ణయించుకోవాలని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతారు.

ఇదిలా ఉండగా.. రాశిచక్రాలను శాసించే గ్రహాలు కెరీర్ తో సంబంధం కలిగి ఉంటాయి. కొందరు వ్యక్తులు తమ కెరీర్ సంపూర్ణంగా మార్చుకునేందుకు కారణం కూడా అదే. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి.. ఏ రాశుల వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభరాశి..
ఈ రాశి వారు బలమైన సంకల్ప శక్తికి ప్రసిద్ధి. వీరు విశ్వాసంగా ఉంటారు. శాంతి ప్రేమికులుగా ఉంటారు. వీరు చాలా సహనం, విశ్వసనీయత మరియు స్వీయ-ఆధారపడటానికి ఇష్టపడతారు. వీరు చాలా ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనిని చాలా చురుకుగా ఉంటారు. ఈ లక్షణాలన్నీ ఉత్తమ ఉపాధ్యాయులకు సంపూర్ణంగా సరిపోతాయి.

మిధున రాశి..
ఈ రాశి వారు చాలా తెలివైనవారు. వీరు పని లేకుండా అస్సలు ఖాళీగా కూర్చోలేరు. వీరు విద్యార్థులకు పజిల్స్ మరియు ఇతర బ్రెయిన్ ఎక్సర్ సైజ్ వంటివి రెగ్యులర్ గా చేయిస్తుంటారు. వీరి రెగ్యులర్ కార్యకలాపాలలో ఇది ఒకటి. వారు టీమ్ శక్తిని నమ్ముతారు. వీరు విద్యార్థులతో కలిసి పని చేయాలని కోరుకుంటారు. అయితే వీరు అపరిచితులతో ఎక్కువగా మాట్లాడరు. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికొస్తే మంచిగా ఉంటారు. వీరు మంచి ఉపాధ్యాయులుగా ఉంటూ విద్యార్థులతో సులభంగా స్నేహం చేస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు కూడా బలమైన సంకల్ప శక్తికి ప్రసిద్ధి. వీరు జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. వీరు తమ లక్ష్యాలను సాధించే వరకు వెనుకడుగు అనేదే వేయరు. ఎన్ని కష్టాలొచ్చినా.. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భయపడకుండా వీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. వీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు చాలా ప్లాన్ చేస్తారు ఏ పనిని మధ్యలో ఆపరు. వీరికి భావోద్వేగం కూడా ఎక్కువగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు చాలా కష్టపడి పని చేస్తారు. అయితే వీరికి ఆసక్తి ఉన్న ఫీల్డ్ నే ఎంచుకుంటారు. అందులోనూ ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకుంటే.. వీరు చాలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వీరు విద్యార్థుల మనసులను ప్రభావితం చేయడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తారు. వీరు వివిధ విషయాల గురించి జ్ణానాన్ని సేకరించడం ఇష్టపడతారు. వీరు ప్రతి విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు. వీరి బోధనల వల్ల విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. వీరు మంచి ప్రయోజనాలను పొందుతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఎవరితో అయినా మాట్లాడే ముందు చాలా బాగా ఆలోచిస్తారు. వీరు చాలా విషయాల్లో క్యాలిక్యులేటివ్ గా ఉంటారు. వీరు తమ బోధనలతో విద్యార్థుల మనసులను ప్రభావితం చేయగలరు. వీరు సమర్థవంతమైన వ్యక్తులుగా ఉండటమే కాకుండా, తమను తాము బలమైన ఆరో భావం కలిగి ఉంటారని కూడా నమ్ముతారు. వీరు ప్రస్తుత పరిస్థిని మరియు భవిష్యత్తును అర్థం చేసుకోవడంలో మంచిగా ఉంటారు. విద్యార్థులకు వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమర్థవంతమైన మూల్యాంకనంతో స్ఫూర్తిని మరియు ప్రేరణను అందించగలరు.



Click it and Unblock the Notifications