Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఆల్ టైం రికార్డు సృష్టించిన అల్లు అర్జున్.. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ బన్నీ తరువాతే!
భారతీయ సినీ రంగంలో ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు చెందిన సినిమాల హవా నడుస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలన వసూళ్లను సాధిస్తున్నాయి. ఆ విధంగానే మన హీరోలు కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా ఇండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా మన తెలుగు స్టార్ హీరో నిలిచారు. అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఆ హీరో ఎవరు? ఎవరెవరు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
ప్రభాస్‌ను దాటేసిన అల్లు అర్జున్
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. నేషనల్ అవార్డు కూడా విన్ అయ్యారు. దీంతో ఆయన క్రేజ్ దేశ వ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2తో అల్లు అర్జున్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టించారు. ఈ సినిమాకు అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారట. దీంతో బాలీవుడ్ హీరోలతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను దాటేసి అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలిచారు.

అల్లు అర్జున్ తరువాత ఎవరంటే?
అల్లు అర్జున్ తరువాత తమిళ హీరో విజయ్ దళపతి అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలిచారు. విజయ్ ఒక్కో సినిమాకు 275 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారు. ఆ తరువాత అమిర్ ఖాన్ కూడా 275 కోట్ల రూపాయలు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 270 కోట్ల రూపాయలు షారుఖ్ ఖాన్ 200 కోట్ల రూపాయలు, ప్రభాస్ 200 కోట్ల రూపాయలు కేవలం ఒక్క సినిమాలో నటించేందుకు పారితోషికం తీసుకుంటున్నారని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది.
వీళ్ళు కూడా..
వీరితో పాటు మరికొందరు హీరోలు కూడా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారు ఉన్నారు. వారిలో తమిళ హీరో అజిత్ 165 కోట్ల రూపాయలు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 160 కోట్ల రూపాయలు, అక్షయ్ కుమార్ 145 కోట్ల రూపాయలు అత్యధికంగా పారితోషికంగా తీసుకుంటున్నారని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.
300 కోట్లు తీసుకోవడం సాధ్యమేనా?
అల్లు అర్జున్ కేవలం ఒక్క సినిమాకే 300 కోట్ల రూపాయలు పారితోషకంగా తీసుకున్నారనే వార్తపై కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది సాధ్యమేనా అనే ప్రశ్నించుకుంటున్నారు. అయితే పుష్ప-2 సినిమాకు దేశ వ్యాప్తంగా భారీగా క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 1000 కోట్లకు పైగా చేసిందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమా కోసం మూడు వందల కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేకపోలేదు. ఈ వార్తలో ఎలాంటి ఆశ్చర్యం కూడా అవసరం లేదు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications