Latest Updates
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో చల్లగా ఉండండి -
పారేసే తొక్కలతో అదిరిపోయే రుచి.. బీహారీ స్టైల్ పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి!
Best beach: ఆసియాలోనే అత్యత్తమ బీచ్ మనదగ్గరే..కేరళ,గోవా బీచ్ లు దీని ముందు జుజుబీ
మనదేశంలో బెస్ట్ బీచ్ లు ఎక్కడున్నాయబ్బా అని ఎవరైనా అడిగితే క్షణం ఆలోచించుకుండా గోవా,కేరళ అని చెప్పేస్తుంటారు చాలామంది. అయితే వాస్తవానికి కేరళ,గోవాని మించిన బెస్ట్ బీచ్ లు మనదేశంలో చాలానే ఉన్నాయి. బీచ్ లు.. విశ్రాంతి తీసుకోవడానికి, ఆనందించడానికి ప్రకృతిని ఆస్వాదించడానికి అద్భుతమైన ప్రదేశాలు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ స్నేహితులు, ఒంటరిగా సమయం గడపడానికి పర్ఫెక్ట్ ప్లేస్ లుగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బీచ్ ల కోసం ప్రత్యేకంగా ప్రయాణిస్తుంటారు. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థకు బీచ్‌లు ముఖ్యమైన ఆదాయ వనరులు. సుముద్ర తీర ప్రాంతం కలిగి ఉన్న దేశాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు ఎక్కువ అవకాశాలను కలిగి ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే.
ఇతర దేశాలలో బీచ్ లను చూసినప్పుడు వాటి అందాన్ని చూసి భలే ఉన్నాయి,ఒకసారి అక్కడికి వెళ్లితీరాలి అని అనుకుంటుంటాం, కానీ మన సొంత దేశంలో వాటికి మించిన అందమైన బీచ్ లు ఉన్నాయన్న సంగతి చాలామందికి గుర్తు ఉండదు. భారతదేశంలో చాలా అందమైన బీచ్‌లు ఉన్నాయి, ఇవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. మనదేశంలోని ఒక బీచ్.. ఆసియా ఖండంలొని టాప్ 10 అత్యుత్తమ బీచ్ లలో ఒకటిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ అడ్వైజర్ ట్రావెలర్స్ ఛాయిస్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 2025 ర్యాంకింగ్స్ లో..అండమాన్ నికోబార్ దీవులలోని రాధానగర్ బీచ్ ఆసియాలో ఐదవ అత్యుత్తమ బీచ్ గా ప్లేస్ దక్కించుకుంది. థాయిలాండ్ దేశంలోని ఫుకెట్‌లోని బనానా బీచ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది, తర్వాత స్థానాల్లో ఫిలిప్పీన్స్ దేశంలోని వైట్ బీచ్, దక్షిణ కొరియాలోని హ్యుండే బీచ్, ఇండోనేషియాలోని కెలింగ్ కింగ్ బీచ్ ఉన్నాయి. అండమాన్ లోని రాధానగర్ బీచ్ ఐదవ స్థానంలో నిలిచింది.

రాధానగర్ బీచ్ ప్రత్యేకతలు ఏంటీ?
రాధానగర్ బీచ్ నిజంగా ఒక అద్భుతమైన ప్రదేశం. ప్రకృతి ప్రేమికులకు, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వారికి తప్పక చూడవలసిన ప్రదేశం. రాధానగర్ బీచ్ దాని పచ్చని ఉష్ణమండల పరిసరాలు,స్పష్టమైన నీలి రంగు నీరు, మృదువైన, పొడి తెల్లటి ఇసుకకు ప్రసిద్ధి చెందింది. స్వరాజ్ ద్వీపంగా పిలువబడే హావ్ లాక్ ద్వీపంలో ఈ బీచ్ ఉంది. ఈ బీచ్ కి ఒక్కపారి వెళ్తే దాని అందాలు మన కళ్ల నుంచి వదిలిపోవని చెబుతుంటారు. రాధానగర్ బీచ్ అందాలను మర్చిపోవడం కష్టమని అక్కడికి వెళ్లివచ్చినవాళ్లు చెబుతుంటారు. ఈ బీచ్ దాని సహజమైన అందం, పర్యావరణ స్థిరత్వం కారణంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా పొందింది. గోవాలోని రద్దీగా ఉండే బీచ్ లకు భిన్నంగా ప్రశాంతతను అందించడం వల్ల రాధానగర్ ప్రశాంతత, సహజ సౌందర్యాన్ని కోరుకునే వారికి అనువైన విహార ప్రదేశం.
ఇతర రద్దీగా ఉండే బీచ్ ల మాదిరి కాకుండా రాధానగర్ బీచ్ సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సందర్శకులు ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు. రాధానగర్ బీచ్ పర్యావరణ వ్యవస్థను కాపాడటానికి కఠినమైన రక్షణ చర్యలు అమలులో ఉన్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన బీచ్ వెంబడి ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించడానికి అతిథులకు పుష్కలంగా స్థలం ఉంది. ఈ బీచ్ లో నీరు చాలా స్పష్టంగా, నీలంగా ఉంటుంది. మీరు అడుగున ఉన్న ఇసుకను, చిన్న చేపలను కూడా చూడవచ్చు. స్నానం చేయడానికి, ఈత కొట్టడానికి ఇది చాలా అనువైనది. పచ్చ ఆకుపచ్చ అలలు,తెలుపు ఇసుక ఒక అందమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఈ బీచ్ ఈత కొట్టడానికి కాకుండా సూర్యరశ్మిని ఆస్వాదించడానికి అనువైనది.
సూర్యాస్తమయాన్ని చూడటం ఒక మరపురాని అనుభవం
రాధానగర్ బీచ్ బంగాళాఖాతం మీదుగా అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. రాధానగర్ బీచ్ నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఒక మరపురాని అనుభవంగా మిగిలిపోతుంది. ఆకాశం వివిధ రంగుల్లో మారే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. చాలా మంది సాయంత్రం ఈ అందమైన దృశ్యాన్ని చూడటానికి ఇక్కడకు వస్తారు.
స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ కు స్వర్గధామం
ఇక్కడ స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ ఔత్సాహికులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ బీచ్ వివిధ రకాల సముద్ర జీవులకు నిలయంగా ఉండటం వలన స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ కు స్వర్గధామంగా ఉంటుంది.
అనేక రకాల పక్షులు
బీచ్ చుట్టూ ఉన్న ప్రశాంతమైన పరిసరాలు అనేక రకాల పక్షులకు నిలయం. సమీపంలోని అడవులు నడకకు, వన్యప్రాణులను చూడటానికి అవకాశాలను అందిస్తాయి. తెల్లని ఇసుక, స్పష్టమైన నీరు మరియు పచ్చని చెట్లు ఫోటోగ్రఫీకి అద్భుతమైన నేపథ్యాన్ని అందిస్తాయి.
చేరుకోవడం ఎలా
రాధానగర్ బీచ్ హావ్ లాక్ జెట్టీ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోర్ట్ బ్లెయిర్ నుండి హావ్ లాక్ ద్వీపానికి ఫెర్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ సమయం 1.5 నుండి 3 గంటలు. హావ్ లాక్ ద్వీపంలో టాక్సీలు, ఆటో రిక్షాలు లేదా ద్విచక్ర వాహనాలను రెంట్ కు తీసుకోవడం ద్వారా బీచ్ కు చేరుకోవచ్చు.
సందర్శించడానికి ఉత్తమ సమయం
రాధానగర్ బీచ్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉష్ణోగ్రత 15°C నుండి 30°C మధ్య ఉంటుంది.



Click it and Unblock the Notifications











