Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
Most Influential People of 2023: టైమ్ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో రాజమౌళి, షారూక్
2023 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో కేవలం ఇద్దరు భారతీయులకు మాత్రమే చోటు దక్కింది. వీరిలో ఒకరు దేశ సినిమా రంగం ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పి, ఆస్కార్ వచ్చేలా చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాగా.. మరొకరు బాలీవుడ్ బాద్ షా, పఠాన్ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చాటిచెప్పిన కింగ్ ఖాన్ షారూక్ ఖాన్.
టైమ్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఇండియా నుండి చోటు దక్కించుకున్న వీరిద్దరూ ఈ మధ్యకాలంలో భారతీయుల సత్తాను గ్లోబల్ గా చాటారు. ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసి ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించారు దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు షారూక్ ఖాన్ పఠాన్ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో చాటి చెప్పాడు. హిట్లు లేక దిగాలు పడ్డ బాలీవుడ్ కు కొత్త ఊపిరి పోశారు. పఠాన్ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. గ్లోబల్ గా వెయ్యి కోట్లకు పైగా వసూళ్ల ప్రభంజన సృష్టించాడు షారూక్.
రాజమౌళి.. మాస్టర్ స్టోరీ టెల్లర్:
2023 ఏడాదికి సంబంధించిన జాబితాను టైమ్ కేటగిరీల వారీగా రూపొందించింది. ఆర్టిస్ట్, ఐకాన్, పయనీర్స్, వరల్డ్ లీడర్స్, టైటాన్స్, ఇన్నోవేటర్స్ కేటగిరీల్లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల పేర్లను చేర్చింది టైమ్. ఇందులో పయనీర్స్ కేటగిరీలో రాజమౌళికి చోటు లభించింది.
బాలీవుడ్ నటి అలియా భట్ చేసిన కామెంట్స్ ను ఇందులో పొందుపరిచింది టైమ్. 'ఆర్ఆర్ఆర్ లో రాజమౌళితో పని చేస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయి. ప్రేక్షకులకు ఏం కావాలో రాజమౌళికి బాగా తెలుసు. కథను ఎలా తీయాలి, ఎక్కడ ఏం పెట్టాలి అన్న విషయాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయనొక మాస్టర్ స్టోరీ టెల్లర్. దేశ భౌగోళిక, సంప్రదాయాలు, ఆచారాలు, రుచుల్లో చాలా బేధాలు ఉన్నప్పటికీ.. ప్రజలందరినీ ఆయన తన సినిమాలతో ఒక్కటి చేస్తారు.' అంటూ అలియా చేసిన కామెంట్స్ ను టైమ్ ఇందులో పొందుపరిచింది.
షారూక్ ఖాన్‌పై ప్రేమ, గౌరవం పెరుగుతూనే ఉంది:
పఠాన్ సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు షారూక్ ఖాన్. 2023 టాప్ ఐకాన్స్ లో షారూక్ కు స్థానం దక్కింది.
'షారూక్ ఖాన్ ను తొలిసారిగా కలిసిన రోజు ఇప్పటికీ నాకు గుర్తుంది. అప్పుడే ముంబయికి కొత్తగా వచ్చాను. నా కలలు నిజం చేసుకునేందుకు ముంబయికి వచ్చాను. 6 నెలల్లో షారూక్ ఖాన్ పక్కన నటించే అవకాశం నాకు వచ్చింది. 16 సంవత్సరాలు గడిచిపోయాయి. మా మధ్య ప్రేమ, నమ్మకం, గౌరవం పెరుగుతూనే ఉన్నాయి.' అని టైమ్ కు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె చెప్పుకొచ్చింది.



Click it and Unblock the Notifications