Latest Updates
-
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే!
పెళ్లైనా తగ్గని రకుల్..మరీ ఇంత పచ్చిగానా? ఈ వీడియో చూస్తే..
మన తెలుగులో ఒకప్పుడు ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసింది. ఒకప్పెపుడు పెళ్లి అయితే ఇక హీరోయిన్ గా కెరీర్ ముగినట్లే అబ్బా అనే అభిప్రాయం భారతీయ చిత్ర పరిశ్రమలో బలంగా ఉండేది.
మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ కాలం మారింది..ఇప్పటి కుర్ర హీరోయిన్లు పెళ్లిని తమ కెరీర్ కి అడ్డుగోడగా కాకుండా, వ్యక్తిగత జీవితంలో ఒక అందమైన భాగంగా చూస్తున్నారు.

పెళ్లయ్యాక కూడా తమ గ్లామర్ ను, నటనను ప్రదర్శిస్తూ, బోల్డ్ పాత్రలు, హాట్ డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ట్రెండ్ కు తాజా ఉదాహరణగా నిలిచింది నటి రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో ఈ అమ్మడు చేసిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.
వివాదానికి కేంద్ర బిందువు జూమ్ షరాబీ
అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన దే దే ప్యార్ దే మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా దే దే ప్యార్ దే 2 రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల యో యో హనీ సింగ్ స్వరపరిచిన జూమ్ షరాబీ అనే పాటను విడుదల చేశారు.
ఈ పాటలో 56 ఏళ్ల అజయ్ దేవగన్..ఇటీవల వివాహం చేసుకున్న 33 ఏళ్ల రకుల్ ప్రీత్ సింగ్ తో చేసిన డ్యాన్స్ స్టెప్పులు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

ముఖ్యంగా ఒక స్టెప్పులో అజయ్, రకుల్ ఛాతీపై వాలి డ్యాన్స్ చేయడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ వయసులో వివాహిత నటితో ఇంత అసభ్యకరంగా డ్యాన్స్ చేయాలా? అంటూ అజయ్ దేవగన్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తే అజయ్ భార్య కాజోల్ ఇంట్లో గట్టిగానే క్లాస్ పీకుతుంది అంటూ ఫన్నీ మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు.
ఇది రకుల్ ఒక్కరికే పరిమితం కాదు
వివాహం తర్వాత కూడా కెరీర్ లో దూసుకుపోతూ గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తున్న నటీమణులు చాలామందే ఉన్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె..పెళ్లి తర్వాత కూడా పఠాన్, ఫైటర్ వంటి సినిమాల్లో బికినీల్లో అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
మరోవైపు తమన్నా భాటియా కూడా లస్ట్ స్టోరీస్ 2 వంటి వెబ్ సిరీస్ లలో బోల్డ్ పాత్రలు చేసి, ఓటీటీలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. వీరంతా తమ పర్శనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని వేరుగా చూస్తూ పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్లలోనైనా నటించడానికి వెనుకాడమని నిరూపిస్తున్నారు.
విమర్శలకు అభిమానుల కౌంటర్
అయితే అజయ్ దేవగన్ అభిమానులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. సినిమాలో నటనను నటనగా చూడాలి, వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టకూడదు అని వారు వాదిస్తున్నారు.



Click it and Unblock the Notifications