Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
క్లిన్ కారా కోసం టెంపుల్ ట్రీ నర్సరీ, కూల్ గ్రే కలర్‌తో డిజైన్.. ఈ రంగునే ఎందుకు ఎంచుకున్నారంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇటీవలే తల్లిదండ్రులు అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మెగా మనవరాలికి లలిత సహస్ర నామం లోనుంచి క్లిన్ కారా కొణిదెల అనే అద్భుతమైన పేరును కూడా పెట్టారు. మహాలక్ష్మీ పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో సంతోషం రెట్టింపు అయింది.
ప్రస్తుతం అంతా బేబీకి సంబంధించిన చిన్న విషయాన్ని మెమొరెబుల్ గా మార్చుకుంటున్నారు. ఈక్రమంలోనే బేబీ క్లిన్ కారా కోసం ఇంట్లోనే సరికొత్త టెంపుల్ ట్రీ నర్సరీని డిజైన్ చేయించారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన గ్రే అండ్ వైట్ బర్నింగ్ సూట్ మాదిరిగానే ఈ నర్సరీని డిజైన్ చేశారు.

ఎక్కువ కలర్ ఫుల్ గా లేకుండా జంతువులు, చెట్లతో ప్రకృతిని ప్రతిబింబించేలా ఈ నర్సరీ అద్భుతంగా ఉంది. ఇందులో జింకలు, ఏనుగుల దగ్గర నుంచి చెట్లు, పువ్వుల వరకు అన్ని పొందుపరచబడి ఉన్నాయి. నర్సరీలో తెల్లటి సోఫాలు, కర్టెయిన్ లు, కార్పెట్ లు ఉన్నాయి. ఇది అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది.
అయితే చెర్రీ, ఉప్సీలకు అడువులు, వన్యప్రాణుల పట్ల ఉన్న ప్రేమను తెలియజేసే వాల్ పేపర్లు ఈ నర్సరీలో ఉన్నాయి. ఏడీ100 ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ దీన్ని డిజైన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ గదిలో చెర్రీకి ఇష్టమైన వస్తువులను పొందు పరిచినట్లు తెలిపారు. గొర్రెలు, పెంగ్విన్, కుందేలు, ఏనుగు వంటి అనేక బొమ్మలు ఉన్నాయని వివరించారు.
క్లిన్ కారా చుట్టూ నేచర్ ప్రవహించే ఆలోచనతో ఈ టెంపుల్ ట్రీ నర్సరీని డిజైన్ చేయించారని తెలుస్తోంది. దీనికోసం ఉపాసన తెలుపు, బూడిద, గులాబీ, గోధుమ రంగుల ప్యాలెట్ ను ఎంచుకున్నారు. అయితే ఆ రంగులో ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ రంగులు ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి?
ఏ రంగు అయినా సరే మనసు, శరీరంపై వివిధ ప్రభావాలను చూపిస్తాయి. సాధారణంగా వెచ్చని రంగులు ఆనందం మరియు సౌకర్యాన్ని కల్గిస్తాయి. ఎరుపు, నారింజ, పసులు రంగులో బోల్డ్ షేడ్స్ మనస్సును ఉత్తేజపరచగలవు. శరీరంపై శక్తినిచ్చే ప్రభావాన్ని కల్గి ఉంటాయి. అదే కూల్ కలర్స్ ని వాడితే శాంతి ప్రభావాన్ని పొందుతాం. పిల్లల గది విశాలంగా, విశ్రాంతిగా అనిపించాలంటే వీటిని వాడాల్సిందే.
నీలం రంగు వాడడం వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ రేటును తగ్గిస్తుంది. ఆందోళన, దూకుడు స్వభావాన్ని కూడా తగ్గిస్తుంది. నీలం రంగు స్థిరత్వాన్ని ఎరుపు శక్తిని మిళతం చేస్తుంది. నీడను బట్టి వాటి లక్షణాలను తీసుకుంటుంది. అయితే ఉపాసన క్లిన్ కారా కోసం తెలుపు బూడిద, గులాబీ, గోధుమ రంగుల ప్యాలెట్ ను ఎంచుకున్నారు. వీటివల్ల బౌద్ధ వాస్తు శిల్పం యొక్క ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటైన శూన్యంలో సంపూర్ణత్వం అనే ఆలోచనలో ఇవి రూపొందాయి. ప్రశాంతత, అపరిమితమైన సంతోషం తీసుకు రావాలనేది ఈ రంగులకు అర్థం అని తెలుస్తోంది.



Click it and Unblock the Notifications