Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
లలితా సహస్రనామం ప్రేరణతో రామ్‌చరణ్ కూతురి పేరు.. ఏంటంటే?
రామ్ చరణ్ - ఉపాసన ముద్దుల కూతురి రాకతో మెగా కుటుంబంలో రోజూ సంబరాలే. మెగా ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబసభ్యులతో పాటు వారి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. పెళ్లై దశాబ్దం తర్వాత ఈ సెలబ్రిటీ కపుల్ కూతురికి జన్మనిచ్చారు. అయితే ఈ రోజు (జూన్ 30) మెగా ప్రిన్సెస్ నామకరణం జరిగింది. మామూలుగా అయితే ప్రతి ఒక్కరూ 21 రోజుల నాడు బారసాల, నామకరణ దినోత్సవం నిర్వహిస్తారు. అయితే రామ్ చరణ్ ఉపాసన మాత్రం తమ గారాలపట్టీకి 10 రోజులకే నామకరణం చేస్తున్నారు.

ఉపాసన తల్లిగారింట్లో వేడుక:
సాధారణంగా.. అమ్మాయి గర్భం ధరించిన తర్వాత కొన్ని రోజులకు పుట్టింటికి వెళ్తారు. అక్కడే ప్రసవం జరుగుతుంది. తర్వాత 21వ రోజు వేడుక కూడా నిర్వహించిన తర్వాత అత్తింటికి వెళ్లడం చాలా మంది పాటించే ఆచారం. అయితే ఉపాసనకు హైదరాబాద్ లో ప్రసవం జరిగింది. అనంతరం ఆస్పత్రి నుంచి వారు నేరుగా చిరంజీవి ఇంటికి బయల్దేరారు. అక్కడే ఇన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు నామకరణం వేడుకను మాత్రం ఉపాసన తన తల్లిగారి ఇంట్లో నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం తల్లిగారింట్లో జరగాల్సిన కార్యక్రమాన్ని అక్కడే జరిపిస్తున్నారు. ఈ వేడుకను చాలా సింపుల్ నిర్వహించారు. మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
సింపుల్ ఏర్పాట్లు, అతికొద్దిమందికి మాత్రమే ఆహ్వానం:
మెగా ప్రిన్సెస్ నామకరణ, ఉయ్యాల వేడుకను చాలా సింపుల్ గా ప్లాన్ చేశారు రామ్ చరణ్ - ఉపాసన. ఉపాసన షేర్ చేసిన వీడియోలు చూస్తే అదే తెలుస్తోంది. పచ్చని మామిడి చెట్టు కింద ఊయల ఏర్పాటు చేశారు. ఇంటి వాకిలిలో ఆకట్టుకునే ఏర్పాట్లతో నామకరణం కార్యక్రమం జరిగింది. ఆకట్టుకునేలా పూర్తిగా సహజ సిద్ధమైన వస్తువులతోనే ఏర్పాట్లు చేశారు.
ముందే నేమ్ ఫిక్స్ చేసేసిన చరణ్ - ఉపాసన:
ఉపాసన డెలివరీ తర్వాత.. ఆస్పత్రి బయట రామ్ చరణ్ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మెగా ప్రిన్సెస్ కు ఏం పేరు పెట్టబోతున్నారని మీడియా ప్రశ్నించగా.. తన పేరు ఆల్రెడీ ఫిక్స్ చేశామని.. త్వరలోనే అందరికీ చెబుతామని సమాధానం ఇచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ రోజు నామకరణం దినోత్సవం జరుగుతున్న సమయంలో ఆ పేరును వెల్లడించారు.
క్లిన్ కార కొణిదెల (KLIN KAARA KONIDELA) అనే పేరును మెగా ప్రిన్సెస్ కు పెట్టారు. ఈ పేరును లలితా సహస్రనామం నుంచి తీసుకున్నట్లు ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో వివరించారు. ఈ పేరు అర్థాన్ని కూడా ఉపాసన తెలిపారు. ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే పరివర్తన, శుద్ధి చేసే శక్తిని ఈ పేరు సూచిస్తుందని ఉపాసన తెలిపారు.
మెగా ప్రిన్సెస్ పేరు వెనక సీక్రెట్ చెప్పిన చిరంజీవి:
రామ్ చరణఅ ఉపాసన కూతురి పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తితో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్న కొద్దీ ఈ లక్షణాలు అన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.



Click it and Unblock the Notifications