Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
హ్యాపీ రంజాన్ 2026..మీ ఫ్రెండ్స్, ఆత్మీయులు, బంధుమిత్రులకు ఇలా విషెస్ చెప్పండి
ఇస్లాం మతంలో రంజాన్ అత్యంత పవిత్రమైన మాసం. ముస్లిం సోదరులకు రంజాన్ అత్యంత పవిత్రమైన నెల. ఇస్లాం ధర్మం ప్రకారం పవిత్ర ఖురాన్ గ్రంథం ఈ నెలలోనే మహమ్మద్ ప్రవక్తకు వెల్లడైందని నమ్ముతారు. అందుకే ఈ నెలలో ఖురాన్ పఠనానికి ప్రాముఖ్యత ఉంటుంది.
హైదరాబాద్ లోని మక్కా మసీద్, చార్మినార్ ఏరియాల్లో బుధవారం(ఫిబ్రవరి 18,2026)సాయంత్రం 7:30 గంటలకు నెలవంక సృష్టంగా కనబడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 నుంచి ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి నెలలో రంజాన్ రావడం 33 ఏళ్ల తర్వాత తొలిసారి.

ఈ మాసం కేవలం ఆకలితో ఉండటం మాత్రమే కాదు, చెడు ఆలోచనలు, చెడు మాటలు,చెడు పనులకు దూరంగా ఉంటూ మనసును శుద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం. రంజాన్ సందర్భంగా మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు అందమైన శుభాకాంక్షల సందేశాలను ఎలా పంపాలో ఇక్కడ చూడండి.
ఇలా విషెస్ చెప్పండి
-పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
-నా ప్రియమైన మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అల్లాహ్ మన మైత్రిని ఇలాగే ఉంచాలి.
-దూరం ఉన్నా మనసులన్నీ కలిపే పండుగ రంజాన్. మీ కుటుంబానికి నా శుభాకాంక్షలు.
-రంజాన్ పవిత్రత మీ కుటుంబంలో సుఖశాంతులు నింపాలి.
-సోదరభావానికి ప్రతీక రంజాన్. అందరికీ శుభాకాంక్షలు.
-రంజాన్ ముబారక్. ఈ పవిత్ర మాసం మీ జీవితంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలి.
-అల్లాహ్ ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. హ్యాపీ రంజాన్ 2026.
-కల్మషం లేని మనసుతో చేసే ప్రార్థనలను దేవుడు తప్పక స్వీకరిస్తాడు. రంజాన్ శుభాకాంక్షలు.
-ఈ రంజాన్ మీ గడపలో వెలుగులు నింపి, మీ కష్టాలన్నింటినీ తొలగించుగాక. రంజాన్ ముబారక్.
-ప్రార్థన, దానధర్మం,ఉపవాసం..ఈ మూడే రంజాన్ సారం. మీకు రంజాన్ శుభాకాంక్షలు.
-ఆకాశంలోని నెలవంక మీ జీవితంలో కొత్త వెలుగులను తీసుకురావాలి. రంజాన్ కరీం.
-మీరు కోరుకున్న ప్రతి కోరికను అల్లాహ్ నెరవేర్చుగాక. రంజాన్ శుభాకాంక్షలు.
-ఈ పవిత్ర మాసంలో మీ పాపాలు తొలగిపోయి, పుణ్యకార్యాల వైపు మీ మనసు మళ్ళాలి. రంజాన్ ముబారక్
-రంజాన్ అంటే కేవలం ఉపవాసం కాదు, సహనం, త్యాగానికి నిదర్శనం.
-ఓర్పు, సహనం అనేవి ఈ మాసం మనకు నేర్పే గొప్ప పాఠాలు.
-మీ దువాల్లో (ప్రార్థనల్లో) నన్ను కూడా గుర్తుంచుకోండి. రంజాన్ ముబారక్.
-అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే ప్రతి రూపాయి మీకు రెట్టింపు పుణ్యాన్ని ఇస్తుంది.
-మనసును అదుపులో ఉంచుకోవడమే నిజమైన ఉపవాసం.

వాట్సాప్, ఇన్‌స్టా స్టేటస్
-ఆకలి విలువను, అన్నం గొప్పతనాన్ని తెలిపే మాసం రంజాన్.
-అల్లాహ్ కరుణామయుడు, మనల్ని ఎప్పుడూ కాపాడుతాడు.
-ఉపవాసం శరీరాన్ని కాదు, ఆత్మను శుద్ధి చేస్తుంది.
-పుణ్యాలను మూటగట్టుకునే పవిత్ర మాసం వచ్చేసింది.
-ఈ రంజాన్ మీకు శాంతిని ప్రసాదించుగాక.
స్ఫూర్తిదాయకమైన విషెస్
-కోపం తగ్గించుకో, అహంకారం వీడు, అల్లాహ్ శరణు కోరు.
-రంజాన్ అనేది మనల్ని మనం మార్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం.
-చేతులు ఆకాశం వైపు ఎత్తితే, అల్లాహ్ సహాయం తప్పక అందుతుంది.
-మనిషిగా పుట్టడం గొప్ప కాదు, మానవత్వంతో బ్రతకడం గొప్ప.. అదే రంజాన్ సందేశం.
-ప్రపంచానికి శాంతి సందేశం అందించే మాసం రంజాన్.
-ఆకలిని జయించు, ఆశలను అదుపులో ఉంచు.
-విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే. రంజాన్ ముబారక్.
-మంచి పనులు చేయడానికి రంజాన్ కంటే మంచి సమయం లేదు.
-మీ హృదయం నుండి వచ్చే ప్రార్థనకు ఆకాశం తలుపులు తెరుచుకుంటాయి.
-2026 రంజాన్ అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక.



Click it and Unblock the Notifications
