Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
క్లిన్ కారా చెంచు తెగలో భాగంగా పెరగాలని కోరుకుంటున్నా.. అటవీ తెగపై తన మమకారాన్ని చాటుకున్న ఉపాసన
మెగా ప్రిన్సెస్.. రామ్‌చరమ్, ఉపాసనల గారాలపట్టి క్లిన్ కారా కొణిదెల పుట్టి నెల రోజులు అవుతున్న సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఓ స్పెషన్ వీడియోను షేర్ చేశారు. ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆ వీడియోను రూపొందించారు రామ్ చరణ్. ఈ 11 ఏళ్ల వైవాహిక బంధంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందని రామ్ చరణ్ పేర్కొన్నారు. తన కుమార్తే క్లిన్ కారా పుట్టిన నెల రోజులు అవుతున్న సందర్భంగా.. జూన్ 20వ తేదీన తన కుటుంబంలో ఎలాంటి సందడి నెలకొందో ఈ వీడియోతో తెలియజేశారు.

11 ఏళ్లు పూర్తియ్యాయి. ఇద్దరూ ఏం చేస్తున్నారు.. అంటూ ఎంతో మంది అన్న మాటలకు తామెంతగా ఒత్తిడికి గురయ్యారో చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఏదైనా సరే సరైన సమయంలోనే జరుగుతుందని తాను నమ్ముతానని చెప్పారు. క్లిన్ కారా సరైన సమయంలోనే తమ జీవితాల్లోకి అడుగుపెట్టిందని, పాపను పట్టుకున్న తొలి క్షణం తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని ఈ స్పెషల్ వీడియాలో చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
'చెంచుతెగలో భాగంగా పెరగాలని కోరుకుంటున్నా'
ఈ వీడియోలో ఉపాసన మాట్లాడుతూ.. అమ్మ అవడంతో తాను పరిపూర్ణమైన మహిళగా మారినట్లు చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ చూపిస్తున్న అమితమైన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ చెప్పారు. క్లిన్ కారాకు ఇప్పుడే ట్యాగ్స్ ఇవ్వడం తనకు ఇష్టం లేదని, తన హార్ట్ వర్క్‌తో వాళ్ల టైటిల్స్ వాళ్లే సాధించుకోవాలని అన్నారు ఉపాసన. ఈ సందర్భంగా తన కుమార్తె చెంచు తెగలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ వీడియోలో రామ్ చరణ్ ఉపాసన కూతురి నామకరణం రోజు చెంచు తెగలు తమ సాంప్రదాయం ప్రకారం చేసిన నృత్యాలకు సంబంధించిన విజువల్స్ ను కూడా జోడించారు.
చెంచు తెగలపై అప్పటి నుంచే ఉపాసన అభిమానం:
మహబూబ్‌నగర్, శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు తెగను ఉపాసన కరోనా సమయంలో కలుసుకున్నారు. వారితో చాలా సమయంలో గడిపారు. వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా చెంచు తెగ గురించి చెప్పుకొచ్చారు. చెంచులు నిజంగా అద్భుతమైన ప్రజలను, ప్రకృతి మాత పట్ల వారి ప్రేమ నిరుపమానమని అన్నారు.
చెంచులు అటవీ ప్రాంతంలోనే నివసిస్తుంటారు. అటవీలో జంతువులను వేటాడుతూ.. అక్కడ దొరికే పండ్లు, కాయలు, దుంపలు తింటూ జీవిస్తారు. చెంచులకు బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. అలాగే చెంచులు ఇతరులను నమ్మరు. వారు తమ తెగ వారితో తప్ప ఇతరులతో మాట్లాడటానికి ఇష్టపడరు. చెంచులు ఎక్కువగా పాతకాలపు తెలుగులో మాట్లాడుకుంటారని చెబుతారు.
చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి. చెంచుల గురించి పాల్కురికి సోమనాథుడు రాసిన 'పండితారాధ్య చరిత్ర'లోనూ వివరించారు. నల్లమల అడవిలో వెలిసిన శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులకు చెంచులు సహాయపడేవారట. అటవీ మార్గంలో నడవలేని వారిని కావిళ్లతో మోసి వారికి తినడానికి తిండి, మంచినీరు సమకూర్చి సహాయపడ్డారని చెబుతూ వారిని ధర్మాత్ములుగా సోమనాథుడు పేర్కొన్నాడు.



Click it and Unblock the Notifications