Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మోచేతి మీద పురుషాంగం.. వైద్య చరిత్రలోనే ఇదే తొలిసారి!
వైద్య శాస్త్రంలో ఎన్నో రకాల వింత వింత ఆపరేషన్లు చేస్తుంటారు. అవి అప్పుడప్పుడు మనసును గుగుర్పాటుకు గురిచేసే మాదిరిగా ఉంటాయి. అయితే తాజాగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు వింత ఆపరేషన్ నిర్వహించి ప్రపంచం మొత్తాన్ని తమవైపు తిప్పుకునేలా చేశారు. ఓ వ్యక్తికి మోచేతికి పురుషాంగం అభివృద్ధి చేసి, దానిని మళ్ళీ మర్మాంగం ప్రాంతంలో అమర్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సున్తీ చేయించుకున్న యువకుడికి..
సోమాలియాకు చెందిన 19 ఏళ్ల యువకుడు తన 4 సంవత్సరాల వయసులో సున్తీ చేయించుకున్నాడు. దీంతో అతనికి ఇన్ఫెక్షన్ ఏర్పడి తన పురుషాంగం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అతను బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కూర్చొని టాయిలెట్‌కు పోవాల్సి వస్తుంది. అలాగే సమాజాల్లో ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తన పురుషాంగాన్ని అభివృద్ధి చేయించుకోవడం కోసం ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే మెడికవర్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు.

యువకుడి పరిస్థితిని ఆసుపత్రి వైద్యులు బాగా విశ్లేషించారు. ఆపరేషన్ చేయడానికి ముందుగా పేషెంట్‌ను పూర్తిగా పరీక్షించి, రేడియల్ ఆర్జరీ ఫోర్ ఆర్మ్ ఫ్లాప్ పద్ధతిలో పురుషాంగాన్ని మోచేతి మీద డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆపరేషన్ 10 గంటలపాటు సాగింది. ఆ సర్జరీ చేసిన తర్వాత, ఆ యువకుడు సాధారణంగా మూత్రం పోవడానికి సమర్థంగా మారాడు. అతని మోచేతి దగ్గరగా నరాలు, చర్మాన్ని ఉపయోగించి పురుషాంగం డెవలప్ చేసి, తర్వాత దాన్ని మర్మాంగాల ప్రాంతంలో అమర్చారు. ఈ ఆపరేషన్ తర్వాత అతను పెండ్లి చేసుకునే పరిస్థితికి చేరుకున్నాడు.
పేషెంట్ ఏమన్నాడంటే..
పేషెంట్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు చేసిన తప్పు వల్ల మానసికంగా చాలా కష్టాల ఎదుర్కొన్నానని, ఇప్పుడు పూర్తి స్థాయిలో పురుషుడిగా మారడం వల్ల ఎంతో ఆనందంగా భావిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, సమాజంలో కూడా తనను తక్కువ చేసి ఎవరూ చూడరన్నారు. ఈ ఆపరేషన్ ఎంతోమందికి ఉపయోగపడుతుందని వైద్యులు వెల్లడించారు.



Click it and Unblock the Notifications