Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కెమెరాకు చిక్కిన అరుదైన తెగ.. అమెజాన్ అడవుల్లో ఇప్పటికీ ఆదిమానవ సంస్కృతి..!
అమెజాన్ అడవుల్లో అరుదైన తెగలు సంచరిస్తున్నట్లు మనకు తెలిసిన విషయమే. ఎన్నో ఏళ్లని కాకుండా అసలు అమెజాన్ అడవుల్లోని చాలా తెగలు అడవుల మధ్యలోనే వుండి మన లాంటి మామూలు మనుషుల మధ్యలోకి ఇంకా రాలేదు. అలాంటి కొన్ని తెగల్లో ఒక తెగకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయ్. ఈ తెగ పేరే మాష్కో పైరోగా. సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీకి సంబంధించి గ్రూపు ఈ తెగల ఫోటోలను వీడియోలను తీసి ప్రచారం చేశారు.

బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎన్నో తెగలు అడవుల్లోనే జీవిస్తున్నాయ్. అలాంటి ఎన్నో తెగల్లో ఈ మాష్కో పైరో తెగే అతిపెద్దదని చెబుతున్నారు. పెర్యూ నది సమీపంలో లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో ఈ తెగ సంచిస్తుండగా ఫోటోలకు చిక్కారు. ప్రభుత్వాలు ఇలాంటి తెగలు వున్న ప్రాంతాన్ని, వారిని పరిరక్షించాలి, కానీ అక్కడి ప్రభుత్వం ఇలాంటి ఏ చర్యలనూ తీసుకోవడం లేదంటున్నారు.
అయితే ఈ మాస్కో పైరో తెగ ఆహారం కోసం వారికి దగ్గర్లో వున్న సాల్వడో, ప్యూర్టో, న్యూవో లాంటి గ్రామాల్లో సంచరిస్తున్నారు. అప్పుడే సర్వైవల్ ఇంటర్నేషనల్ గ్రూపుకు సంబంధించిన వారి కెమెరాలకు వీరు చిక్కారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫోటోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయ్. వీరు ఉండే ప్రాంతాలను పరిరక్షించకుండా అక్కడి ప్రభుత్వాలు ఆ స్థలాలను లాగింగ్ కంపెనీలకు రాసి ఇచ్చేసిందని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయ్.
దీనిపై సోషల్ మీడియాలో రకరకాలు నెటిజెన్లు స్పందిస్తున్నారు. ఈ తెగలను ఏమీ చేయవద్దని, వారిని స్వతంత్రంగా వదిలేయమని అంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోకుండా వీళ్లంతా ఎలా బ్రతికి ఉన్నారని కొందరు జోక్‌లు వేస్తున్నారు. 2024వ సంవత్సరంలో కూడా ఆటవిక మనుషులను చూడ్డం చాలా బాధాకరమని మరికొంతమంది కామెంట్ చేశారు.
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ కంపెనీ ప్రపంచంలో అడవుల్లో ఉన్న కొన్ని తెగలకు నెట్వర్క్ వచ్చే విధంగా చేశారు. ఈ తెగలకు కూడా ఆ నెట్వర్క్ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారు. బ్రిటీష్ వారు దండెత్తక పోతే ప్రపంచంలో చాలా తెగలు ఇలాగే వుండేవని కొందరు అసభ్యంగా కూడా కామెంట్ చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారుతున్నాయ్.



Click it and Unblock the Notifications