Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Rashmika Mandanna: అరుదైన రోగంతో బాధ పడుతున్న రష్మిక మందాన?.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?
రష్మిక మందాన గురించి తెలియని వారు ఉండరు. పుష్ప సినిమాలతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు నేషనల్ క్రష్‌గా మారిపోయింది. దేశ వ్యాప్తంగా శ్రీవల్లి అంటూ రష్మిక చుట్టూ తిరగడం మొదలయ్యింది. అందం, అభినయం ఈ అమ్మడు సొత్తు. చూడముచ్చటగా, అందమైన మొముతో ఉన్న రష్మికకు ఒక అరుదైన చర్మ సంబంధిత వ్యాధి ఉందట. ఆ వ్యాధి ఏంటి? ఆ చర్మ వ్యాధి ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రష్మికకు ఎలాంటి వ్యాధి ఉంది?
నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు దేశ వ్యాప్తంగా సుపరిచయం అయ్యింది. యానిమల్ సినిమాతో పాటు పుష్ప సినిమాతో ఆమె క్రేజ్ ఖండాతరం దాటింది. ప్రతి ఒక్క సినీ ప్రియుడికి రష్మిక గురించి తెలుసు. అలాంటి రష్మిక మందాన ఒక అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారట. ఆ వ్యాధి ఏంటి అనేది బయటికి రానప్పటికీ, దానికి చికిత్స చేసుకోవడానికి ఆమె తరచూ డెర్మటాలజిస్టులను కలుస్తారని వార్తలు వస్తున్నాయి.

ఇటీవల కూడా రష్మిక ఆ వ్యాధి కోసం చికిత్స తీసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లి డెర్మటాలజిస్టులను కలిశారని, బి టౌన్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. హీరోయిన్ కావడంతో రష్మిక కొన్ని రకాల రసాయనాలు కలిగిన సౌందర్య ఉత్పత్తులను వాడాల్సి వస్తుంది. దాని కారణంగా ఆమె ఒక అరుదైన చర్మ వ్యాధి బారిన పడ్డారట. అందుకే తన చర్మాన్ని కాపాడుకోవడానికి ఆమె డెర్మటాలజిస్టులను కలిశారని తెలుస్తోంది.
ఆ చర్మ వ్యాధి లక్షణాలు
ఈ చర్మ వ్యాధి వల్ల అనేక సమస్యలు వస్తాయట. చర్మం ఎరుపుగా మారడం, చర్మంపై దురద, మంట, ఎరుపు దద్దుర్లు, వస్తుంటాయి. ఇవి సాధారణంగానే కనిపిస్తున్నా.. తరచూ రావడం వల్ల ఇబ్బందులు కలుగుతాయట. పదే పదే గోకాలని అనిపించడం, పదే పదే చేతులను రాసుకోవడం వంటివి చేస్తారట.
మొటిమలు
ఈ చర్మ వ్యాధి వల్ల మొటిమల సమస్య తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. ముఖంపై తీవ్రంగా మొటిమలు రావడంతో పాటు ఛాతీపై కూడా మొటిమలు ఎక్కువగా వస్తుంటాయని తెలుస్తోంది. చర్మం ఎక్కువగా ఎర్రబడడం, పొరలు పొరలుగా ఊడిపోవడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే చర్మ రంధ్రాలు మూసుకుపోయి పిగ్మెంటేషన్ పెరిగిపోతుంది. కొందరికి సోరియాసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వల్ల జుట్టు కూడా ఓడిపోతుందని తెలుస్తోంది.
అందుకే ఎవరూ బయట దొరికే, అత్యధిక రసాయనాలు కలిగిన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడకూడదు. ఇలా చేయడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులకు చికిత్స కూడా ఉండదు. సహజసిద్ధమైన మెరుపు కోసం ఇంటి చిట్కాలు పాటించడం మంచిది. అధిక మొత్తంలో రసాయనాలు కలిగిన ప్రొడక్ట్స్‌ను దూరం పెట్టడం శ్రేయస్కరం.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిన విషయాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఇవి కచ్చితమైనవి అని మేము నిర్ధారించడం లేదు. ఈ వార్తకు Boldsky Teluguకు ఎటువంటి సంబంధం లేదు.



Click it and Unblock the Notifications