Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రతన్ టాటా ఆరోగ్య రహస్యం.. పాటిస్తే మీరు కూడా 100 ఏళ్లు బతకొచ్చు!
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంతో మందికి స్ఫూర్తి అయిన రతన్ టాటా(86) అస్వస్థతకు గురయ్యారని, ఆయనను ముంబైలోని రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పుకార్లపై స్పందించిన టాటా.. తాను బాగానే ఉన్నానని వయసు రీత్యా చేయించుకోవాల్సిన కొన్ని టెస్టులు చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లినట్లు పోస్ట్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 86 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ రతన్ టాటా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇంత ఆరోగ్యంగా ఉండేందుకు ఆయన ఏ విధమైన డైట్ ఫాలో అవుతున్నారు, ఆయన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం.
రతన్ టాటా ఆహారపు అలవాట్లు:
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారపు అలవాట్లు అందులో ప్రధాన భూమిక పోషిస్తుంది. రతన్ టాటా ఈ వయస్సులో కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి ఆయన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమనే చెప్పుకోవచ్చు. టాటా అన్ని రకాల ఆహరం అమితంగా కాకుండా, మితంగా తింటారని ఆయన సన్నిహితులు చెప్పారు. తాజా, పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉన్న ఆరాహాన్ని తీసుకుంటారని పేర్కొన్నారు. తక్కువగా ప్రాసెస్ చేయబడిన ఫుడ్ ను తింటారని తెలిపారు.

వ్యాయామం చేయడం:
ఎలాంటి సందర్భాల్లోనైనా రతన్ టాటా చురుకుగా ఉండేదుకు ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్టుగానే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుంటారు. వాకింగ్, స్మాల్ వెయిట్ లిఫ్టింగ్, ఇతర చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ చురుకుగా ఉండేందుకు ప్రయాణిస్తూ ఉంటారట. అందుకే ఆయన ఆరోగ్యంగా, ఎప్పుడూ చురుగ్గా ఉంటారని చెబుతున్నారు.
సమతుల్యమైన జీవన విధానం:
రతన్ టాటా వృత్తి పరమైన, వ్యక్తిగత విషయాలను సమతూల్యంగా ఉంచుతారని పేరుంది. ఎంత పనున్నప్పటికీ, శరీరానికి కావాల్సిన విశ్రాంతిని ఇచ్చేందుకు తగిన సమయం కేటాయించుకుంటారని టాక్. అలాగే టాటా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారని, ఏ విషయంలోనైనా ప్రశాంతంగా ఉంటారనే వాదన ఉంది. వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాల్లో ఆయన పాటిస్తున్న సమతూల్యత ఆయన ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతున్నాయని చెబుతున్నారు.
రతన్ టాటా మాదిరిగా మనం ఉండగలమా?:
మనిషైన ప్రతి ఒక్కరికీ రతన్ టాటా మాదిరిగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనే ఆశ ఉంటుంది. అయన మాదిరిగా మనం కూడా జీవించాలంటే మన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. శరీరానికి శక్తిని ఇచ్చేంత ఆహరం తీసుకోవడంతో పాటు తగినంత వ్యాయామం కూడా చేయాలి. మందు, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండడంతో పాటు అనారోగ్యానికి కారకమయ్యే కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి కొంత దూరం పాటించాలి. అన్నిటికంటే ముఖ్యం ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవించాలి. మరీ ముఖ్యంగా వృత్తి పరమైన పనులకు, వ్యక్తిగత పనులకు మధ్య తగినంత సమతూల్యతను పాటించాలి. అప్పుడే మనం టాటా లాగా ఆరోగ్యంగా వందేళ్లు జీవించొచ్చు.



Click it and Unblock the Notifications