Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రతన్ టాటా లవ్ స్టోరీస్ గురించి మీకు తెలుసా?
భారతదేశ దిగ్గజ వ్యాపారుల్లో ఒకరైన రతన్ టాటా మరణించారన్న విషయం తెలిసిందే. కేవలం వ్యాపారంలో తనకంటూ ఒక గుర్తింపు వేసుకోవడం మాత్రమే కాదు.. సమాజ సేవలో తన జీవితాన్ని ధారపోశారు. సంపాదించిన వాటిలో దేశానికి ఆపద వచ్చినప్పుడు నేనున్నా అంటూ ఆదుకొని తన సంపదను విరాళంగా అందించారు. అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఇప్పుడు లేకపోవడం జీర్ణించుకోలేని విషయం.
అయితే, టాటా ఒక గొప్ప వ్యక్తి మాత్రమే కాదు. గొప్ప ప్రేమికుడు కూడా. ఇంత గొప్ప, అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన రతన్ టాటాకు సైతం ఓ ప్రేమ కథ ఉంది. అయితే ఆ ప్రేమ.. విషాదంతో ముగిసింది. అదేంటి, రతన్ టాటా ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టాటా నాలుగు సార్లు ప్రేమలో పడ్డారు:
86 ఏళ్ల వయసులో భారత దేశాన్ని మొత్తం శోకసంద్రంలో ముంచేసి దివికేసిగిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా.. తన జీవితంలో మొత్తం నాలుగుసార్లు ప్రేమలో పడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాలుగు సార్లు తాను పెళ్లి చేసుకోలేకపోయాయని పేర్కొన్నారు. ఒక రకంగా పెళ్లి చేసుకోకపోవడమే తనకు మంచి అయ్యిందని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
అమెరికాలో యువతితో ప్రేమలో పడినప్పుడు:
తన ఉద్యోగం కారణంగా రతన్ టాటా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సిమి గ్రేవాల్ అనే యువతితో ప్రేమలో పడ్డారు. రెండేళ్ల పాటు వారి ప్రేమాయణం కొనసాగింది. రెండేళ్ల పాటు డేటింగ్ కూడా చేసుకున్నారు. అయితే ఆ సమయంలో రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఇండియాకు రావాల్సి వచ్చింది. తన అమ్మమ్మ ఆరోగ్యం కుదుటపడ్డాక తానే అమెరికా వెళ్తానని, లేదా సిమి గ్రేవాల్ ఇండియాకు వస్తుందని టాటా భావించారు.
ఆ సమయంలో 1962లో ఇండియా, చైనా మధ్య యుద్ధం మొదలైంది. దీని కారణంగా టాటా మళ్ళీ అమెరికాకు వెళ్లలేకపోయారు. సిమి గ్రేవాల్ తల్లిదండ్రులు సైతం ఆమెను అమెరికాను విడిచిపెట్టి ఇండియాకు పంపేందుకు నిరాకరించారు. దీంతో వీరి ప్రేమ అక్కడితో ముగిసింది. అప్పటి నుంచి టాటా పెళ్లి చేసుకోలేదు, మరో యువతితో ప్రేమలో కూడా పడలేదు.
రతన్ టాటా నిజమైన ప్రేమ వాటితోనే:
రతన్ టాటా జీవితంలో తాను ప్రేమించిన అమ్మాయిలు ఎవరూ దక్కకపోయినప్పటికీ.. తాను నిరాశ చెందలేదు. తాను ప్రేమించిన అమ్మాయిలతో తన పెళ్లి జరగకపోవడం తనకు మంచే జరిగిందని రతన్ టాటా అభిప్రాయం. దీని కారణంగా తాను తన పూర్తి సమయం మొత్తాన్ని వ్యాపారాన్నే కేటాయించానని చెప్పుకొచ్చారు.
అలాగే, తన ప్రేమను మొత్తం కుక్కలు, పుస్తకాలు, కార్లపైనే చూపించానని తెలిపారు. తన ఖాళీ సమయం అంతా వాటికే కేటాయించానని, అవే తన ప్రేమ పావురాలను పేర్కొన్నారు. కాగా రతన్ టాటాకు రెండు కుక్కలున్నాయి. అవంటే టాటాకు అమితమైన ప్రేమ.



Click it and Unblock the Notifications