Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రతన్ టాటా మృతి: టాటాకు నివాళులు అర్పించేందుకు మంచి కొటేషన్స్..
వ్యాపార దిగ్గజం, గొప్ప మానవతా మూర్తి రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన చనిపోయారన్న వార్త తెలుసుకుంటున్న ఆయన అభిమానులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తిగా శోక సంద్రంలో మునిగితేలుతున్నారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియాలో దేశ ప్రజలందరూ సంతాపం ప్రకటిస్తున్నారు.
రతన్ నావల్ టాటా.. వ్యాపార రంగానికి మేలు చేయడంతో పాటు, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన మంచి పనులు ఆయనకు కీర్తి ప్రతిష్టతలు తెచ్చిపెట్టాయి. అతని నైతిక నాయకత్వ విధానం, దాతృత్వ పనుల పట్ల ఆయన అంకితభావం.. ఆయనను ప్రజల్లో దిగ్గజ స్థానంలో నిలబెట్టాయి.

రతన్ నావల్ టాటా నాయకత్వం, జీవన విధానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఆయన మృతి పట్ల కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు వ్యాపారవేత్తలు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. అలాంటి మహనీయుడికి మీరు కూడా ఇలాంటి సందేశాలతో సోషల్ మీడియాలో నివాళులు అర్పించొచ్చు. అవేంటంటే..
రతన్ టాటాకు నివాళులు అర్పించేందుకు సోషల్ మీడియా సందేశాలు
> "వ్యాపార దిగ్గజం, భారత దేశ పెద్దబిడ్డ రతన్ టాటా ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిది. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నాను. We miss you sir"
> "రతన్ టాటా గారు మీరు భౌతికంగా మాకు దూరమైనప్పటికీ.. మీరు నేర్పిన పాఠాలు, మీ జీవిత అంశాలు, మీరు నడిపించిన ఈ బాటను శాశ్వతంగా మా గుండెల్లో ఉంచుకుంటాము"
> "దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. రతన్ టాటా గారు.. మీ యొక్క సరళత, దాతృత్వం ఎప్పటికీ మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మీరు ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిగానే ఉంటారు"
> "వ్యాపార రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే కాకుండా, లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. రతన్ టాటా గారు.. మీ ఖాళీని ఎవరూ పూరించలేరు"
> "రతన్ టాటా గారు మీ వారసత్వం ఇంకా కొన్ని శతాబ్దాల పాటు ప్రతిధ్వనిస్తుంది. సమాజానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తిగా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తుంచుకుంటాం"
> "రతన్ టాటా గారు మీ మరణంతో భారత దేశం.. తన దిశానిర్దేశాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. మీరు ఎల్లప్పుడూ మాకు మార్గదర్శకంగానే ఉంటారు"
> "మీ ఆలోచనలు, మీరు ఆచరణలోకి పెట్టిన పనులు ఎల్లప్పుడూ మాకు సమాజ సేవ చేయాలని గుర్తు చేస్తుంటాయి. మీరు అమరులు సార్"
పై విధంగా పేర్కొనబడిన సందేశాలతో.. భారత దేశ గొప్ప వ్యాపారవేత్త, అంతకుమించి గొప్ప గుణగణాలున్న వ్యక్తి, భారత దేశ పెద్ద బిడ్డ రతన్ టాటాకు మీరు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించొచ్చు. ఎన్ని నివాళులు అర్పించినప్పటికీ.. టాటా లేని లోటును పూరించడం అనేది అసాధ్యం.



Click it and Unblock the Notifications