Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Ashwin Retirement: రిటైర్ అయిన అశ్విన్.. క్రికెట్ ద్వారా ఆయన ఎంత సంపాదించారో తెలుసా?
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మట్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న అశ్విన్.. గబ్బా టెస్టు తరువాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. భారత క్రికెట్‌కు కేవలం బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ ఎన్నో సేవలు అందించిన అశ్విన్‌కు ఎంత ఆదాయం ఉంది? ఆయన ఆస్తి ఎంత? ఆయన సాధించిన ఘనతలు ఏంటి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అశ్విన్ సాధించిన ఘనతలు
రవిచంద్రన్ అశ్విన్ 2010 జూన్ 5వ తేదీన క్రికెట్‌కు అరంగేట్రం చేశారు. ఆరోజు శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ఆయన భారత జట్టుకు డెబ్యూ చేశారు. అప్పటి నుంచి అశ్విన్ ఎన్నో గొప్ప గొప్ప మ్యాచెస్ ఆడారు. సుదీర్ఘంగా 14 సంవత్సరాల పాటు జట్టుకు సేవలు అందించారు.

అశ్విన్ తన కెరీర్‌లో మొత్తం 116 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఈ మ్యాచెస్‌లో కేవలం బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. వన్డే క్రికెట్‌లో మొత్తం 156 వికెట్లు తీసుకున్నారు. అలాగే 707 పరుగులు చేశాడు.
అశ్విన్ టెస్ట్ అరంగేట్రం
అశ్విన్ 2011 నవంబర్ 6న తన టెస్ట్ అరంగేట్రం చేశారు. తమ మొదటి టెస్టు మ్యాచ్ వెస్టిండీస్‌పై ఆడారు. అప్పటి నుంచి అశ్విన్ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగవుతూ.. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. వందల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించేందుకు కృషి చేశారు. టెస్టుల్లో సెంచరీలతో అద్భుతంగా రాణించారు.
అశ్విన్ భారత్ తరఫున మొత్తం 105 టెస్టు మ్యాచులు ఆడారు. వీటిల్లో 536 వికెట్లు పడగొట్టాడు. అలాగే 3,474 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. జట్టు ఆపదలో ఉన్నప్పుడు అశ్విన్ అద్భుతమైన శతకాలు చేసి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.
కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కాదు టీ20ల్లో కూడా అశ్విన్ అద్భుతంగా రాణించారు. మొత్తం 65 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఈ మ్యాచ్‌లలో 72 వికెట్లు తీశాడు. అలాగే 184 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉండడం విశేషం. ఐపీఎల్‌లో సైతం అశ్విన్ తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించారు.
అశ్విన్ ఆస్తులు ఎంతంటే?
టీమిండియాలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అశ్విన్‌కు భారీగానే ఆస్తులు ఉన్నాయి. 2024 ప్రకారం ఆయన ఆస్తులు 150 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. వాటిలో చెన్నైలో విలాసవంతమైన భవంతితో పాటు కోట్లకు విలువ చేసే కార్లు, భూములు, ఇతర ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్రికెటర్లలో అశ్విన్ ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన వార్షిక ఆదాయం పది కోట్లకంటే ఎక్కువగానే ఉంటుంది.
అశ్విన్ మ్యాచ్ ఫీజ్‌తో పాటు ఐపీఎల్, ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తారు. జూమ్ కార్, మూవ్ వంటి వాటిని ప్రమోట్ చేస్తుంటారు. దీంతో అశ్విన్ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ క్రికెటర్ ఎదో ఒక రోజు తన ఆటకు వీడ్కోలు పలకాల్సిందే. దేశానికి, జట్టుకు ఎంతో సేవలందించిన అశ్విన్ ఈరోజు వీడ్కోలు పలికారు. ఆయన తన జీవితంలో కూడా మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.



Click it and Unblock the Notifications