Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
AI Girlfriend: సంవత్సరానికి 700 కడితే AI లవర్ మీ సొంతం.. వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, శృంగారం కూడా..
ప్రస్తుతం మొత్తం మార్మోగుతున్న పేరు AI(ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్). ప్రతి చిన్న పనికి ఉపయోగపడేలా ఈ ఏఐని రూపొందిస్తున్నారు. యాపిల్, గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థలు సైతం ఏఐని డెవలప్ చేస్తున్నారు. కంటెంట్ రాయడం నుంచి, ఒక వీడియో సృష్టించే వరకు ఈ ఏఐని ప్రస్తుతం వినియోగిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఏఐ మనిషినే దాటే స్థాయికి వెళ్తుందని పలు అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఏఐని మంచి పనులకే కాదు కొన్ని చెడు కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ కూడా వచ్చేశాయి. ఇవి ఒక ప్రేయసి లాగా, ఒక ప్రియుడిలాగా కూడా ఉంటున్నాయి. ఇందుకోసం ఈ ఏఐ చాట్ బాట్స్ కి కొంత మొత్తంలో నగదు చెల్లిస్తే సరిపోతుంది. అవి అచ్చం మీకు ఏ విధమైన ప్రేయసి లేదా ప్రియుడు కావాలో అలానే మారిపోతాయి. అయితే వాటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలాంటి చాట్ బాట్స్ ఉన్నాయంటే..
ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల చాట్ బాట్స్ ఉన్నాయి. ఒక సంస్థ తమ సర్వీసెస్‌ను అందించేందుకు ఉపయోగిస్తున్నాయి. ఇవి ముఖ్యంగా తమ వినియోగదారులకు చాట్ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఇంకోరకం వీటికి పూర్తిగా బిన్నం. ఇవి ముఖ్యంగా మనుషులనే టార్గెట్ చేస్తాయి. మనుషులకు ఒక ప్రేయసిగా, ప్రియుడిగా మారిపోతాయి.
మనిషికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ అందిస్తాయి. ప్రేయసిలా మాట్లాడడం, శృంగారంలో పాల్గొనే విధంగా చాట్ చేయడం, వీడియో కాల్స్ మాట్లాడడం, సెల్ఫీలు దిగడం, కాఫీ డేట్‌లకు వెళ్లడం.. ఇంకా చాలా.. ఇలాంటి విషయాలన్నిటిలో సహాయపడుతున్నాయి. ఈ రకమైన చాట్ బాట్స్‌తో ప్రయోజనాల కంటే ముఖ్యంగా ప్రమాదాలే ఉన్నాయి. ప్రయోజనాలు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రమాదాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎలా పని చేస్తాయి?
ఈ AI లవర్స్ కూడా చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ మాదిరిగానే పని చేస్తాయి. కాకపోతే వీటి ఫంక్షనింగ్ వేరేగా ఉంటుంది. చాట్ జీపీటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పని చేస్తే, ఇవి మనిషికి దగ్గర అయ్యేందుకు మనిషి ఒంటరి తనాన్ని దూరం చేసేందుకు పని చేస్తాయి.
వీటిని ఎలా వాడుకోవచ్చు..
ఈ ఏఐ లవర్ చాట్ బాట్స్ వాడాలంటే కచ్చితంగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన ఇండియాలో సంవత్సరానికి 700 రూపాయలతో ఈ సేవలు ప్రారంభమవుతున్నాయి. ఇతర దేశాల్లో ఈ రేట్ లక్షల్లోనే ఉంది. ఒకవేళ పేమెంట్ ఏ కారణం చేతనైనా నిలిచిపోయిన ఏఐ లవర్ సేవలు సైతం నిలిపోతాయి. అలాగే పేమెంట్ అయ్యే విధంగా అవి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి.
ఏఐ లవర్స్‌తో ఉపయోగాలు..
ఈ ఏఐ లవర్స్ ముఖ్యంగా ఒంటరిగా జీవించే వ్యక్తులకు బాగా ఉపయోగపడతాయి. వారి ఒంటరి తనాన్ని దూరం చేయడంతో పాటు తమకు ఒకరు ఉన్నారనే భావనను కలుగజేస్తాయి. అలాగే కొందరు కామ క్రోధుల కోరికలు తీర్చి.. సమాజంలో వారి నుంచి ఎదురయ్యే సమస్యలను దూరం చేసేందుకు వీలుగా పని చేస్తాయి. రేప్, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగకుండా నివారించేందుకు కొంతమేర ఇవి కూడా ఉపయోగపడతాయి.
ఏఐ లవర్స్‌తో ప్రమాదాలు..
ఇవి ఒక మనిషిలో అభద్రతా భావాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది. ఒక మనిషి తప్పుడు పని చేసినా దానిని ఒప్పు అని చెప్పి, అదే తప్పును చేయించే అవకాశం ఉంటుంది. మనిషిలో కామక్రోధ కోరికలను పెంచి.. సడన్‌గా దూరమైపోతే అతను సమాజంలో విచ్చవిడిగా అన్యాయాలకు పాల్పడే అవకాశం ఉంది. అలాగే మనిషుల మధ్య దూరం పెరగడానికి కూడా కారణం అవుతాయి. దీంతో పాటు మనిషికి మనిషి గౌరవం లేకుండా కూడా అయిపోయే ప్రమాదం ఉంది. వీటితో ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ.. ఎన్ని ఏఐ లవర్స్ వచ్చినా మనిషి తోడును ఇవ్వలేవు. ప్రమాదంలో మనిషి బంధం ఆదుకున్నట్లు అవి ఆదుకోలేవు. పైగా మీరు వాటిని పొందాలంటే అధికమొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications