Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దేవుడితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది.. దేవుడు లేడని చెప్పిన 24 గంటల్లోనే నగరానికి నగరమే కాలిపోయింది! ఎక్కడంటే?
ఈ సృష్టిని నడిపిస్తున్నది దేవుడేనని మనలో చాలా విశ్వసిస్తుంటారు. ఆ దేవుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని చెబుతుంటారు. అసలు ఈ సృష్టికి మూలమైన ఈ ప్రకృతి కూడా దేవుడేనని, ఆ దేవుడికి కోపం వస్తే యావత్ సృష్టిని నాశనం చేసేస్తారని మన పెద్దలు చెబుతుంటారు. అలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా క్యాలిఫోర్నియాలో ఎగసిపడుతున్న కార్చిచ్చు కూడా దానికి మూలమే అని చెబుతున్నారు. ఈ కార్చిచ్చు చిన్నగా మొదలై పెద్ద పెద్ద సెలెబ్రిటీల ఇళ్లను సైతం దహించేస్తుంది. జ్వాలాగ్నిలా ఎగసిపడుతూ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తుంది.
ఈ కార్చిచ్చుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం మరో వాదన వినిపిస్తుంది. క్యాలిఫోర్నియాలో ఈ కార్చిచ్చు మొదలవక రెండు రోజుల ముందు జరిగిన ఓ సినిమా వేడుకలో కొందరు ప్రముఖ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఈ వేడుకను హోస్ట్ చేసిన యాంకర్ చేసిన కొన్ని వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ యాంకర్ ఏమన్నారు? ఆమె అన్న మాటలకు నిజంగానే దేవుడికి కోపం వచ్చిందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

యాంకర్ ఏమన్నారంటే?
సినిమాలకు సంబంధించి లాస్ వేగాస్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాంకర్ మాట్లాడుతూ.. లాస్ వేగాస్ దేవుడు లేని నగరమని, దేవుడు లేని స్వర్గం అని, ఈ నగరానికి దేవుడు అవసరం లేదని చెప్పారు. ఆమె అలా చెప్పడం వలనే దేవుడు ఆగ్రహించి ఉంటాడని, అందుకే రెండు రోజుల్లోపే కార్చిచ్చు మొదలయిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
దేవుడిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదని, అసలు ఈ సృష్టికి మూలమే ఆ దేవుడు అని చెబుతున్నారు. అయితే ఆ యాంకర్ చెప్పిన రెండు రోజుల లోపే ఈ కార్చిచ్చు చెలరేగడంతో అంతా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు మద్దతిస్తున్నారు.
దేవుడు ఉన్నాడా?
నిజంగానే దేవుడు ఉన్నాడా అంటే.. దానికి విభిన్న వార్తలు వినిపిస్తాయి. ఏదయితే దేవుడు ఉన్నాడా లేడా అనేది వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధాపడుతుంది. కానీ చాలా మందికి దేవుడు ఉన్నాడని తెలుసు. దేవుడు మనకు భగవత్ స్వరూపంలో రారు. ఆపదలో ఉన్నప్పుడు ఎదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతుంటారు. మనలో చాలా మంది ఆపదలో ఉన్నప్పుడు అలాంటి ఘటనలు ఎదుర్కునే ఉంటారు. అందుకే దేవుడు ఉన్నాడని నమేవాళ్ళు దేవుడిని పూజిస్తారు. దేవుడు లేరని చెప్పేవారు.. వారిని నమ్మరు.



Click it and Unblock the Notifications