Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
భార్యతో చాహెల్ విడిపోడానికి కారణం అదేనంట..ఇన్నాళ్లకు బయటపెట్టారుగా
టీమిండియా ఫేమస్ బౌలర్ యజువేంద్ర చాహెల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి..ఆ తర్వాత తాము విడిపోయినట్లు పరోక్షంగా వారిద్దరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన విషయం తెలిసిందే. వీరి విడాకులకు కారణం ఇదేనంటూ అనేక వదంతులు సోషల్ మీడియాలో వచ్చాయి. వివాహేతర సంబంధమే విడాకులకు కారణం అని ఇలా రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే చాహెల్ కానీ ఆయన భార్య ధనశ్రీ వర్మ గానీ తమ విడాకులకు గల కారణాన్ని ఎక్కడా ప్రకటించలేదు.
ఇదే కారణమట
విడాకుల కోసం వీళ్లు ఫైల్ చేయడంతో గురువారం ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఫైనల్ హియరింగ్ కి చాహెల్, ధనశ్రీవర్మ ఇద్దరూ హాజరయ్యారు. అక్కడ తమ విడాకుల వెనుక అసలు కారణాన్ని బయటపెట్టారు. కోర్టులో జడ్జి చాహెల్,ధనశ్రీవర్మని కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచించారు. దీంతో 45 నిమిషాల పాటు వీరికి కౌన్సిలింగ్ సెషల్ జరిగింది. ఆ తర్వాత కూడా విడిపోవడానికి ఇద్దరూ అంగీకారంగా ఉన్నారని జడ్జికి ఇన్ఫర్మ్ చేశారు.
తాము గత 18 నెలల నుంచే కలిసి ఉండట్లేదని, తాము సపరేట్ గా వేర్వేరు ఇళ్లలో జీవిస్తున్నట్లు జడ్జికి తెలిపారు. అయితే విడాకులకు ప్రధాన కారణం ఏంటని జడ్జి అగినప్పుడు..కంపాటబిలిటీ ఇష్యూస్(సఖ్యత లేకపోవడం)తో తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వీళ్లు చెప్పినట్లు సమాచారం.

చాహెల్ ఇలా
కోర్టుకి వెళ్లేముందు చాహెల్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో.."నేను లెక్కబెట్టలేనన్ని ఎక్కువ సార్లు దేవుడు నన్ను రక్షించాడు. కాబట్టి నేను ఎందుకు రక్షించబడ్డానో తెలియదు కానీ రక్షించబడిన సమయాలను మాత్రమే నేను ఊహించగలను.. దేవుడా నాకు తెలియకపోయినా ఎల్లప్పుడూ అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు" అని తెలిపాడు.
ధనశ్రీ వర్మ అలా
ధనశ్రీ వర్మ కూడా కోర్టుకి వెళ్లేముందు ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టింది.. అందులో" ఒత్తిడి నుండి ఆశీర్వాదం.. దేవుడు మన చింతలను, పరీక్షలను ఆశీర్వాదాలుగా ఎలా మార్చగలడో ఆశ్చర్యంగా లేదా? మీరు ఈ రోజు దేని గురించి అయినా ఒత్తిడికి గురైతే మీకు ఒక ఆప్షన్ ఉందని తెలుసుకోండి. మీరు చింతిస్తూ ఉండవచ్చు లేదా మీరు అన్నింటినీ దేవునికి అప్పగించి ప్రతిదాని గురించి ప్రార్థించవచ్చు. దేవుడు మీ మంచి కోసం అన్నింటినీ కలిసి చేయగలడని విశ్వాసం కలిగి ఉండటంలో శక్తి ఉంది" అని తెలిపింది. అయితే వీరిద్దరూ తమ పోస్ట్ లలో విడాకులు అనే పదాన్ని ప్రస్తావించలేదు.



Click it and Unblock the Notifications