Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రీల్ స్టార్ అన్వీ కామ్దార్ ప్రమాదవశాత్తు 300 అడుగుల లోయలో పడి మృతి
Aanvi Kamdar అన్వీ జూలై 16 తేదీని ఆమె స్నేహితులతో కలిసి రీల్స్ చేయడానికి వాటర్ ఫాల్స్ కు వివాహారయాత్రకు వెళ్ళారు. అక్కడ ఆమె ఒక రీల్ షూటింగ్ లో పాల్గొంది. అప్పుడు సమయం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఆమె అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది.రీల్స్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయింది. ఆరు గంటల రెస్క్యూ తర్వాత అన్వీని ఘాట్ నుంచి బయటకు తీశారు. అయితే లోయలో పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 200 నుంచి 250 అడుగుల ఎత్తు ఉన్న కొండపై నుంచి ఆమెను తాడు సహాయంతో పైకి తీశారు. దురదృష్టవశాత్తు, ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఇలాంటి కేసులు వర్షాకాలంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రజల మాత్రం నిర్లక్ష్యం తో ఇలా చేస్తూనే ఉంటారు.
కాబట్టి ప్రాణాల కంటే రీల్స్ ముఖ్యం కాదు . అటువంటి పరిస్థితిలో, మీరు కూడా వాటర్ ఫాల్స్ చూడటానికి మరియు రీల్స్ చేయడానికి వెళ్ళకపోవడమే మంచిది. ముంబైకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అన్వీ కామ్‌దార్ వయసు కేవలం 26 సంవత్సరాలు. ఆమె ఇన్స్ట్రాగ్రామ్ మరియు బ్లాగ్ తో బాగా ప్రసిద్ది చెందింది. చాలా ప్రాంతాలకు వెళ్లి తన అనుభవాలను పంచుకోవడం ఆమెకు చాలా ఇష్టం.

రాయగడ సమీపంలోని కుంభ జలపాతాన్ని అన్వేషించడానికి ఆమె తన ఏడుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. కానీ ఆమెకు ఇష్టమైన అభిరుచి ఆమె మరణానికి కారణం. రీల్ మేకింగ్ స్కిల్‌తో ఫేమస్ అయిన ఆమె ఇప్పుడు ఆమె మరణానికి కారణమైంది.
అన్వీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆమె వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఆమెకు 'ది గ్లోకల్ జర్నల్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. ఆమెకు దాదాపు రెండు లక్షల అరవైరెండు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో ఆమె రెండువేల కంటే ఎక్కువ పోస్ట్‌లను షేర్ చేసింది. ఈ పోస్ట్‌లలో, ఆమె విలాసవంతమైన వస్తువుల నుండి ట్రావెల్ వ్లాగ్‌ల వరకు ప్రతిదీ కవర్ చేస్తుంది.

వర్షాకాలంలో గుర్తుంచుకోవల్సిన విషయాలు
వర్షాకాలంలో జలపాతు చూడటానికి అందంగా కనబడి ఆకర్షిస్తుంటాయి. కానీ ఏమాత్రం అజాగ్రత ఉన్న ప్రాణాలకు ముప్పు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
వర్షాల కారణంగా జలపాతలు ఎక్కువ పాచి కట్టి ఉండి, జారుతుంటాయి. అలాగే నీటి ప్రవాహం కూడా అధికంగా ఉండటం వల్ల ప్రమాధాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశాలకు చెప్పు లేదా హీల్స్ వంటివి ధరించవద్దు.

అలాగే వాటర్ ఫాల్స్ దగ్గర నీళ్ళు కనబడాలని చాలా దగ్గరగా వెళ్ళి సెల్ఫీ దిగుతుంటారు. పొరపాటున కాలు జారిపడటం వల్ల ప్రమాదాలు జరగవచ్చు, ప్రాణాలకే ముప్పు ఉంటుంది.



Click it and Unblock the Notifications