Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
ఈ వస్తువులను మీ ఇంట్లో నుండి తీసేయండి.. కొత్త ఏడాదిలో డబ్బుకు లోటు ఉండదు
కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బాగుండాలంటే ఇంట్లోని ఏయే వస్తువులను తీసేయ్యాలో ఇప్పుడు చూద్దాం.
2022 సంవత్సరం దాదాపు ముగిసింది. పట్టుమని పది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. చాలా మంది కొత్త ఏడాదైనా తమ జీవితంలో ఉన్న శని పోతుందా.. సంపాదన మిగులుతుందా.. వచ్చే సంవత్సరం అయినా లక్ష్మీ దేవి కరుణిస్తుందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, వచ్చే సంవత్సరం ప్రారంభానికి ముందే ఇంట్లోని కొన్ని వస్తువులను తీసేయడం ద్వారా శని పోయి ఆనందం, శ్రేయస్సు ఇంట్లోకి ప్రవేశిస్తాయి.

వాస్తు శాస్త్రంలో, గాలి, నీరు, అగ్ని యొక్క శక్తులు సమన్వయంతో ఉంటాయి. ఈ శక్తులను సమతుల్యం చేయడానికి ప్రధాన కారణం వివిధ రకాల యోగాలను సృష్టించడం.
కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బాగుండాలంటే ఇంట్లోని ఏయే వస్తువులను తీసేయ్యాలో ఇప్పుడు చూద్దాం.

పూజాగది దగ్గర పాత వస్తువులను తీసేయ్యాలి:
చాలా మంది ఇళ్లల్లోని పూజాగదుల్లో పూజలు చేస్తున్నప్పుడు పువ్వులు సమర్పిస్తారు. పూల మాలలు వేస్తుంటారు. చాలా మంది ఈ పూలను వారానికొకసారి లేదంటే నెలకొకసారి మారుస్తుంటారు. పాతవి తీసేసి కొత్తవి సమర్పిస్తుంటారు. అయితే పూలు వాడిపోయాక వాటిని తీసేయ్యాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వీలైతే ఎప్పటికప్పుడు కొత్త పూలు సమర్పించడం ఉత్తమం. రోజూ పూలు సమర్పించలేకపోతే ముందు రోజు సమర్పించిన పూలను తీసేయ్యడం మర్చిపోవద్దు.
కొత్త సంవత్సరం ప్రారంభం కాకముందే ఇంటిని శుభ్రం చేస్తుంటే ముందుగా పూజగదిని శుభ్రం చేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, పూజాగదిలో సొట్టలు పోయిన, డ్యామేజ్ అయిన పాత్రలు, సామాగ్రిని ఉంచకపోవడం మంచిది. ఇలా ఉంచడం వల్ల దోషాలు వస్తాయి. దీనివల్ల ఇంట్లో దారిద్ర్యం, కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి.

డ్యామేజ్ అయిన ఫర్నిచర్:
వాస్తు ప్రకారం, ఇంట్లో విరిగిన కుర్చీ లేదా మంచం ఉండటం వల్ల వ్యక్తుల వైవాహిక జీవితం కలవరపాటుకు గురవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండాలి. దీని కోసం ప్రజలు ఈ కొత్త సంవత్సరంలో తమ ఇళ్ల నుండి విరిగిపోయిన పాత ఫర్నిచర్‌ను తొలగించాల్సిన అవసరం ఉంది.
విరిగిన బొమ్మలు, కుండలు, పాత్రలు మొదలైన వాటిని కూడా ఇంట్లోంచి తీసేయాలి. అలాంటి వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం అలాగే ఉంటుందని, సంపాదన మంచి నీళ్లలా ఖర్చవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. విరిగిల టేబుల్, కుర్చీలు, టీపాయ్‌లు ఏవైనా వాటిని రిపేర్ చేసి వాడుకోవాలి లేదంటే ఇంట్లో నుండి తీసెయ్యాలి.

ఆగిపోయిన గడియారం:
వాస్తు శాస్త్ర పండితుల ప్రకారం, ఎవరి ఇంట్లో గడియారం ఎక్కువ సేపు ఆగిపోతే అరిష్ఠం. అలాంటి గడియారాలను తీసేయడం లేదంటే, బ్యాటరీలు వేయడం మర్చిపోవద్దు. విరిగిన లేదా నిలిచిపోయిన వాచీలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు.
ఇటువంటి గడియారాలను ఉంచడం వల్ల ఇంట్లోని డబ్బు వృథా అవుతుందని మరియు ఇంటి సభ్యుల చెడు కాలాలు ఎప్పటికీ తీరవని నమ్ముతారు.

పాత చెప్పులు:
పాత లేదా విరిగిన, చిరిగిపోయిన చెప్పులను ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవద్దు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టకముందే ఇలాంటి చెప్పులను పారేయాలి. వాటిని దూరంగా కారణంగా దరిద్రం పోయి ధనయోగం సిద్ధిస్తుంది.

విరిగిన దేవుడి చిత్రపటాలు:
విరిగిన దేవుడి చిత్రపటాలను ఇంట్లో ఉంచుకోవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. విరిగిన విగ్రహాలు కూడా ఇంట్లో ఉండొద్దని పండితులు సూచిస్తున్నారు. విరిగిపోయిన దేవుడి చిత్రపటాలు, విగ్రహాల వల్ల ఇంట్లో శాంతి కొరవడుతుంది. ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంలా ఉంటుంది.
ఈ చిట్కాలు పాటించడం ద్వారా 2023 కొత్త సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని వ వాస్తు శాస్త్రం చెబుతోంది.



Click it and Unblock the Notifications