Latest Updates
-
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.!
జనవరి 26న మీ పిల్లలు మెరవాలంటే.. ఈ వేషధారణలు ట్రై చేయండి
దేశవ్యాప్తంగా ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే జనవరి 26 వచ్చిందంటే స్కూల్ పిల్లలకు జెండా వందనం, దేశభక్తి గీతాలు, పంచిపెట్టే లడ్డూలకు మించిన ఉత్కంఠ ఏదైనా ఉందంటే అది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్.
ఒక చిన్నారి చెక్క తుపాకీ పట్టుకుని, భగత్ సింగ్ లా మీసం మెలేస్తుంటే, మరో చిన్నారి వీపున బొమ్మను కట్టుకుని ఝాన్సీ లక్ష్మీబాయిలా ఖడ్గం ఝుళిపిస్తుంటే.. ఆ దృశ్యం చూసేవారందరిలోనూ దేశభక్తిని ఉరకలేయిస్తుంది.

అయితే పిల్లలను కేవలం వేషధారణతో అలంకరిస్తే సరిపోదు.. వేదికపై వారి నడక, వారు పలికే డైలాగులు, వారిలోని ఆత్మవిశ్వాసం వారిని విజేతలుగా నిలబెడతాయి. ఈ జనవరి 26న మీ చిన్నారి పాఠశాల పోటీల్లో పాల్గొంటున్నా లేదా కవాతుకు వెళ్తున్నా వారిని ప్రత్యేకంగా నిలబెట్టడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇక్కడ చూడండి.
లిటిల్ భగత్ సింగ్ (విప్లవ వీరుడు)
మీ అబ్బాయిలో ఒక విప్లవకారుడిని చూపించాలనుకుంటే భగత్ సింగ్ వేషధారణ సరైన ఎంపిక. ఖాకీ ప్యాంటు, తెల్లటి చొక్కా, తలపైన నల్లటి టోపీ, మెడలో పసుపు లేదా ముదురు రంగు కండువా ఉంచండి.
భగత్ సింగ్ అనగానే గుర్తుకొచ్చేది ఆ మీసకట్టు. కాజల్ లేదా ఐలైనర్ ఉపయోగించి సహజంగా కనిపించేలా మీసాలు దిద్దండి.
ఝాన్సీ రాణి (వీరనారి)
ఆడపిల్లల ధైర్యసాహసాలకు ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి. మరాఠీ శైలిలో నౌవారీ చీర లేదా ధోతీ లాంటి చీరను కట్టండి. వీపుపై ఒక బొమ్మను గుడ్డతో కట్టి కార్డ్ బోర్ డ్‌తో చేసిన కవచం, చేతిలో హాని కలిగించని కత్తిని ఉంచండి.
నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, జుట్టును కొప్పులా కట్టి యోధురాలిని తలపించేలా తయారు చేయండి.
మహాత్మా గాంధీ (జాతిపిత)
శాంతి, అహింసకు ప్రతిరూపంగా మీ బిడ్డను తీర్చిదిద్దాలనుకుంటే గాంధీ తాత వేషం ఉత్తమం. తెల్లటి పంచె (ధోవతి), గుండ్రని కళ్ళజోడు, చేతిలో ఒక కర్ర ఉంటే చాలు. మీ చిన్నారి ఈ వేషంలో నడుచుకుంటూ వస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది.
భారత మాత (దేశానికి తల్లి)
పాఠశాల కవాతులో మీ పాపాయి అందరి దృష్టిని ఆకర్షించాలంటే భారత మాత వేషధారణ అద్భుతంగా ఉంటుంది. చక్కటి పట్టు చీర, తలపైన కిరీటం, మెడలో పూలమాలలు, చేతిలో త్రివర్ణ పతాకం ఉండాలి. సాంప్రదాయ ఆభరణాలతో దేవతలా అలంకరించండి.
మీ పిల్లల వేషధారణ ఎంత బాగున్నా, వారు చెప్పే డైలాగులు ఎంత స్పష్టంగా ఉంటే అంత మంచి ప్రభావం పడుతుంది. వారికి ఇంట్లోనే చిన్న రిహార్సల్ చేయించండి, కచ్చితంగా వారే నంబర్ 1గా నిలుస్తారు.



Click it and Unblock the Notifications