Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
Last solar eclipse 2024 సూర్యగ్రహణం చూస్తే ఏం జరుగుతుంది, మూర్ఖులు ఏం వాదిస్తున్నారు ?
Ring Of Fire last Solar eclipse 2024 ఏడాది చివరి సూర్యగగ్రహణం ఏర్పడటానికి కౌంట్ డౌన్ మొదలైయ్యింది. అక్టోబర్ రెండో తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని ఇప్పటికే ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, అప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే సూర్యగ్రహణం ప్రత్యక్షంగా చూడటానికి భారతీయులకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది.
భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీన రాత్రి 9.13 గంటలకి సూర్యగ్రహణం ప్రారంభం అవుతుంది. మనదేశంలో ఆ సమయం రాత్రి కావడంతో సూర్యగ్రహణం కనిపించదని, దక్షిణ అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో, హిందూ మహాసముద్రం, దక్షిణ చిలీ ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సూర్యగ్రహణాన్ని భారతీయులు వీక్షించడానికి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదని, టీవీలల్లో ఈ సూర్యగ్రహణం చూడాలని శాస్త్రవేత్తలు తెలిపారు.

భూమి, సూర్యుడి కక్షలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడికి ఎదురుగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ చంద్రుడి పరిణామం చిన్నది కావడంతో సూర్యుడు ఉపరితలం ప్రకాశావంతమై అగ్నిగోళం మాదిరిగా కనిపించడంతో దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ సూర్య గ్రహణం భారతీయులు టీవీలల్లో చూసి సంతోషించాలని, భారతదేశంలో సూర్యగ్రహణం కనపడదని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
కింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే సూర్యగ్రహణాన్ని చూడటానికి అవకాశం లేకపోవడంతో భారతీయులు కొంచెం నిరాశ చెందుతున్నారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చూడటం అరిష్టం అని పలువురు జ్యోతిష్యులు చెబుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వయసు మీదపడిన పెద్దలు సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలకు దూరంగా ఉండాలని, అలాంటి వాళ్లు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని పలువురు జ్యోతిష్యులు అంటుంటారు.

అయితే జ్యోతిష్యాలను పట్టించుకోని చాలామంది మాత్రం సూర్యగ్రహణం చంద్రగ్రహణం చూడటానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించిందని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పడంతో ఆ అపురూపమైన దృశ్యాలను టీవీలల్లో చూడాలని చాలామంది భారతీయులు భావిస్తున్నారు. అయితే సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాల మీద నమ్మకం లేని వాళ్లు వాటిని, శాస్త్రాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.



Click it and Unblock the Notifications