Latest Updates
-
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!
నేడే రష్మిక,విజయ్ ల పెళ్లి..ప్రధాని మోదీ శుభాకాంక్షలు!
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్, అభిమానుల ముద్దుల జంట విరోష్(విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న)మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. వెండితెరపై తమ కెమిస్ట్రీతో మాయ చేసిన ఈ రీల్ లైఫ్ కపుల్.. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా, అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఫిబ్రవరి 26న ఉదయం 7:30 గంటలకు బరాత్ కార్యక్రమంతో పెళ్లి తంతు మొదలవుతుంది.. ఉదయం 9 గంటల నుంచి 10:10 నిమిషాల మధ్య ఉన్న సుముహూర్తంలో అచ్చమైన తెలుగు సాంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేయనున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రష్మిక సొంత ఆచారమైన కర్ణాటకలోని కొడవ (కూర్గ్ స్టైల్) సంప్రదాయం ప్రకారం మరోసారి వీరి వివాహం జరగనుంది. దీనికోసం ప్రత్యేకమైన దుస్తులు, అలంకరణలను ప్లాన్ చేశారు.

సెలబ్రిటీల సందడి.. విరోష్ మార్క్ ఏర్పాట్లు
ఫిబ్రవరి 25 రాత్రి ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్‌లో జరిగిన సంగీత్, మెహందీ వేడుకలు విద్యుత్ కాంతుల నడుమ కన్నుల పండువగా సాగాయి. అక్కడి నాప్ కిన్స్ పై కూడా VIROSH అని ఎంబ్రాయిడరీ చేయించారంటే ఈ జంట ప్రతి చిన్న విషయాన్ని ఎంత స్పెషల్ గా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, నటులు రాహుల్ రవీంద్రన్, ఆషికా రంగనాథ్ తదితర సెలబ్రిటీల డ్యాన్సులు, స్పెషల్ పెర్ఫార్మెన్స్ లతో ఈవెంట్ హోరెత్తిపోయింది.
ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు
ఈ క్యూట్ కపుల్‌కు దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శుభాకాంక్షలు తెలియజేయడం మరో విశేషం. విజయ్ తల్లిదండ్రులు మాధవి, గోవర్ధన్ రావులకు ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇన్నాళ్లు తెరపై అలరించిన విజయ్, రష్మిక.. ఇప్పుడు నిజజీవితంలో పరస్పర ప్రేమ, అవగాహనలతో ఒకరికొకరు తోడుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి అని ఆకాంక్షిస్తూ ప్రధాని ఆశీర్వదించారు. ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది.
భారీ భద్రత.. ఘుమఘుమలాడే విందు
ఈ రాయల్ వెడ్డింగ్ కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రైవేట్ హెలిప్యాడ్ ఉన్న ఈ రిసార్ట్ చుట్టూ, ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక పెళ్లి విందు విషయానికొస్తే.. మెనూ అదిరిపోయేలా ప్లాన్ చేశారు. నోరూరించే లోకల్, కాంటినెంటల్ వంటకాలతో అతిథులకు భారీ విందును ఏర్పాటు చేశారు.
మొత్తానికి ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న విజయ్-రష్మికల ప్రేమాయణం ఇలా పెళ్లిపీటల వరకు చేరడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొత్త దంపతుల పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.



Click it and Unblock the Notifications