Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
చీపురుతో జాగ్రత్త.. తెలియకుండా చేసే తప్పులతో దరిద్రం తప్పదు
ఇంట్లోని చీపురును లక్ష్మీదేవిగా భావిస్తాం. హిందూ ఆచారాల ప్రకారం చీపురుకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తాం. చీపురు కాలికి తగిలితే చేతితో మొక్కుతాం. ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే చీపురును లక్ష్మీదేవికి సంబంధించినదిగా పరిగణిస్తాం.
అలాంటి చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వాస్తు నిపుణులు. చీపురును ఎక్కడ పడితే అక్కడ, ఇష్టమొచ్చిన మూలలో, సమయపాలన లేకుండా ఇళ్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, దరిద్రం పట్టుకుంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీపురు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఎలాంటి నిబంధనలు అనుసరించాలో ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో చీపురు ఎక్కడ పెట్టాలి:
ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురును ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. బయటి వ్యక్తుల చూపు పడని చోట చీపురు దాచాలని చెబుతున్నారు నిపుణులు. తులసి కోట, పూజా గది, డబ్బు దాచే చోట చీపురు ఉంచకూడదు. చీపురను వాటికి దగ్గరగా పెడితే ఇంట్లోకి రావాల్సిన ధనం రాదు.
ఇల్లు ఎప్పుడు ఊడ్చాలి:
సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చీపురును వాడొద్దు. ఆయా సమయాల్లో చీపురుతో ఎలాంటి పనులు చేయకూడదు. తెల్లవారుజామున సూర్యోదయం తర్వాతే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడవకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే ఇంట్లో దరిద్ర తిష్టవేస్తుంది. అందుకే సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకోవద్దు అంటారు.
చీపురును ఏ దిక్కున ఉంచాలి:
చీపురును వాయువ్యం, పడమర దిక్కుల్లో మాత్రమే ఉంచాలి. ఈశాన్యం, ఆగ్నేయం దిశల్లో చీపురును ఉంచకూడదు. అలాగే చీపురును ఎప్పుడూ కాలితో తాకకూడదు. పొరపాటున కాలు తగిలితే చేతులు జోడించి మొక్కాలి. అలాగే ఇల్లు ఊడ్చే సమయంలో శివాయ నమః అని స్మరించుకోవాలి. ఇలా చేస్తే శని ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని అంటారు.
ఇల్లు ఊడ్చేటప్పుడు పాటించాల్సిన నియమాలు:
ఇంటి కుటుంబసభ్యులు ఏదైనా పని మీద ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు వెంటనే ఇల్లు ఊడవకూడదు. అలా చేయడం వల్ల వాళ్లు వెళ్లిన పని జరగదని పండితులు చెబుతున్నారు.
పాత చీపురు ఎప్పుడు పడేయాలంటే:
పాత చీపురును ఎప్పుడు పడితే అప్పుడు బయట పడేయకూడదు. పండగ రోజుల్లో, శుభాకార్యాల సమయంలో, ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజున ఇంట్లోని పాత చీపురును బయట పడేయ్యకూడదు. అలాగే రోహిణి, హస్త, పుష్యమి, ఉత్తరాభద్ర, అనురాధ నక్షత్రాల రోజుల్లోనూ చీపురును బయట పడేయ్యకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే పాత చీపురును బయట పడేయ్యాలి.
చీపురు ఎప్పుడు కొనాలంటే:
పాతదైన చీపురును బయట పడేసిన తర్వాత కొత్త చీపురును కొనే ముందు కూడా కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నాయి శాస్త్రాలు. కొత్త చీపురును వాడడానికి శనివారం మంచి రోజుగా పరిగణిస్తారు. కృష్ణ పక్షంలో కొత్త చీపురు కొనడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం, శుక్రవారాల్లో కొత్త చీపురును ఇంట్లోకి తీసుకురాకూడదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications