Latest Updates
-
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే!
మూడో ప్రపంచ యుద్ధం వస్తే..అత్యంత సురక్షితమైన ప్లేస్ ఇదే!..ఏ అణుబాంబు ఏం చేయలేదు
ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం, వివిధ దేశాల్లో సరిహద్దు సమస్యలు,శాంతి భద్రతల సమస్యలు..ఇలా ప్రపంచంలోని అనేక దేశాల్లొ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలొ ఇటీవల అమెరికా వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్,ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య జరిగిన సమావేశం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సమావేశంలో జెలెన్స్కీ మూడవ ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారని ట్రంప్ బహిరంగంగా ఆరోపించారు. జెలెన్స్కీ చేయాలనుకుంటున్నది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని తాను భయపడుతున్నానని ట్రంప్ అన్నారు.
మూడవ ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే పెద్ద సంఘర్షణ. ఇది అనేక దేశాలను అనేక కోణాల్లో ప్రభావితం చేస్తుంది, అణు ఆయుధాలు కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే..యుద్ధంలో వేసే అణుబాంబుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాలో కొరత ఏర్పడుతుంది. రేడియేషన్ ద్వారా భారీ విధ్వంసం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనా కొన్ని దేశాలు, ప్రదేశాలకు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఏ దేశం అత్యంత సురక్షితమైనదో ఇప్పుడు చూద్దాం.

3వ వరల్డ్ వార్ జరిగితే ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలు
ఐస్ లాండ్
ఐస్ లాండ్ ఒక చిన్న దేశమే అయినా సురక్షితమైన దేశం . దాని భౌగోళిక స్థానం, తక్కువ జనాభా కారణంగా అది ఏ యుద్ధంలో వేలు పెట్టదు. ఐస్ లాండ్ కు సైన్యం లేదా ఏ విధమైన సైనిక సంఘర్షణ లేదు. దాని తటస్థ వైఖరి ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని సురక్షితమైన స్వర్గధామంగా చేస్తుంది.
భూటాన్
భూటాన్ ప్రత్యేక భౌగోళిక స్థానం, తక్కువ జనాభా దానిని సురక్షితమైన దేశంగా చేస్తాయి. భూటాన్ ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యతనిస్తుంది . ఆ దేశ ప్రభుత్వం పర్యావరణం, సామాజిక శ్రేయస్సుపై దృష్టి సారిస్తుంది..ఇది ప్రపంచ యుద్ధం వల్ల ప్రభావితం కాకుండా ఉండటానికి ఆ దేశానికి వీలు కల్పిస్తుంది.
ఫిన్లాండ్
ఫిన్లాం భౌగోళిక స్థానం,బలమైన సాయుధ దళాలు దానికి భద్రతను అందిస్తాయి. ఇక్కడి ప్రభుత్వం ఎల్లప్పుడూ వ్యూహాత్మక భద్రతకు ప్రాధాన్యతనిస్తుంది. ఫిన్లాండ్ విధానం కూడా తటస్థతపై ఆధారపడి ఉంటుంది..ఇది వరల్డ్ వార్ టైంలో సేఫ్ గా ఉండటానికి వీలు కల్పిస్తుంది .
ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఖండాలు
ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రపంచంలో అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలు. వాటి పెద్ద. అసాధారణ భూభాగం కారణంగా ఈ ప్రదేశాలు అణు దాడి నుండి వేలాది మందికి ఆశ్రయం ఇవ్వగలవు.
ఆంగ్లేసీ
ఆంగ్లేసీ అనేది వాయువ్య వేల్స్ తీరంలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. ఈ ద్వీపంలో జనాభా చాలా తక్కువ. ఇది మెనై జలసంధి ద్వారా ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడింది. దీని జనాభా రీత్యా దీనిపై దాడి చేసే అవకాశం తక్కువ.
స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ ఎల్లప్పుడూ తటస్థత, శాంతికి ప్రసిద్ధి చెందింది . ఈ దేశం గత కొన్ని దశాబ్దాలుగా ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. స్విట్జర్లాండ్ పర్వత భౌగోళిక స్థానం దానికి సహజ రక్షణను అందిస్తుంది. 3వ వరల్డ్ వార్ వస్తే అత్యంత సురక్షితమైన ప్రదేశాల లిస్ట్ లో స్విట్జర్లాండ్ ముందువరుసలో ఉంటుంది. దీంతో పాటు ఇక్కడి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి,ఇది అంతర్గత భద్రతను నిర్ధారిస్తుంది .
న్యూజిలాండ్
న్యూజిలాండ్ దాని భౌగోళిక స్థానం, రాజకీయ తటస్థత కారణంగా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. దాని మారుమూల స్థానం, తక్కువ జనసాంద్రత దానిని ఏవైనా పెద్ద సంఘర్షణల నుండి దూరంగా ఉంచుతుంది. న్యూజిలాండ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ శాంతికి ప్రాధాన్యతనిస్తుంది.
కార్న్‌వాల్
కార్న్‌వాల్ అనేది ఇంగ్లాండ్ కు నైరుతి వైపు ఉన్న ఓ గ్రామీణ ప్రాంతం. దాని తీరం వెంబడి నిటారుగా ఉండే రాళ్ళు ఉంటాయి. దక్షిణాన ఫాల్,ఫోవే నదుల ముఖద్వారాలు ఉన్నాయి. ఇక్కడ అణుబాంబులు ప్రవేశించడం అసాధ్యమని చెబుతున్నారు.
ఈ దేశాలు కూడా
చిలీ, ఉరుగ్వే, అర్జెంటీనా వంటి దేశాలు కూడా అణు సంఘర్షణ సంభవించినప్పుడు సురక్షితమైన స్వర్గధామాలుగా ఉంటాయి.జ ఎందుకంటే ఈ దేశాలు ప్రధాన ఆహార ఎగుమతిదారులు కాబట్టి ఆహార కొరతను ఎదుర్కొనే అవకాశం లేదు. వీటితో పాటు పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశాలు, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలు, ఆఫ్రికా కూడా మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలుగా ఉండే అవకాశం ఉంది
భారత్ సంగతేంటీ?
మనదేశం ఏ దేశం మీద ముందు దాడి చేయదు. మనదేశ చరిత్రలో ఒక్కసారి కూడా మనం ముందుగా యుద్ధం ప్రారంభించినా లేదా మరో దేశంపై దాడి చేసిన సందర్భమే లేదు. మనది ఎల్లప్పుడూ శాంతి,ప్రపంచ శ్రేయస్సు కోరుకునే దేశం. అయితే ఇండియాపై దాడి చేయడానికి ఎవరొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అణ్వాయుధాల శక్తిని కలిగి ఉంది.



Click it and Unblock the Notifications











