Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Breaking: చావుబతుకుల్లో సైఫ్ అలీఖాన్!..షాక్ లో సినీ ఇండస్ట్రీ
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక దొంగ చొరబడగా..ఇంట్లో పనిమనుషులు మేల్కొని పెద్దగా కేకలు వేశారు. దీంతో సైఫ్ అలీఖాన్ నిద్రలేచి దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీఖాన్ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడని సమాచారం. సైఫ్ అలీఖాన్ ఒంటిపై ఆరు కత్తిపోట్లు పడినట్లు తెలుస్తోంది. అందులో 2 కత్తిపోట్లు చాలా డీప్ గా అయినట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ ను కుటుంబసభ్యులు లీలావతి హాస్పిటల్ కు తరలించారు. సైఫ్ అలీఖాన్ కి డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం దొంగ పరారీ అవగా.. అతడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంటి చుట్టూ పెట్టిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంట్లో పనివాళ్లను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీఖాన్ కొంతకాలంగా విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన దేవర సినిమాలో కూడా సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం సైఫ్ కుటుంబంతో కలిసి స్విట్టర్లాండ్ వెళ్లి ఇటీవలే తిరిగొచ్చాడు.
హై సెక్యూరిటీ జోన్ లో ఉండే సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగ రావడం,సైఫ్ పై తీవ్రంగా దాడి చేయడంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలికిపడింది. సైఫ్ గురించి సమాచారం అందుకున్న సీనీ ప్రముఖులు లీలీవతి హాస్పిటల్ కు వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో లీలీవతి హాస్పిటల్ డాక్టర్లు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సైఫ్ అలీఖాన్ చాలా తీవ్రంగానే గాయపడ్డాడు. సైఫ్ అలీఖాన్ కోలుకోవాలి ఆయన అభిమాను ప్రార్థనలు చేస్తున్నారు. వెంటనే సైఫ్ కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.



Click it and Unblock the Notifications