Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఫ్రిజ్ లో గిన్నెడు ఉప్పు..వర్షాకాలంలో అద్భుతాలు చేస్తుంది!
వానాకాలం రాగానే మనసులో ఏదో తెలియని కొత్త పులకింత వస్తుంది. మండే ఎండల నుంచి హమ్మయ్య అనిపించినా..ఈ కాలం తనతో పాటు కొన్ని సమస్యలను కూడా మోసుకొస్తుంది. అనేక వ్యాధులు సీజన్ లోనే వస్తుంటాయి. ఇక,జలుబు,దగ్గు, గొంతునొప్పి, జ్వరం ఈ సీజన్ లో కామన్ గా వస్తుంటాయి. వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు, మన ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు కూడా త్వరగా పాడవుతాయి.
వానాకాలంలో ఫ్రిజ్ లోపల తేమ పెరిగి, మనం నిల్వ ఉంచిన కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కుళ్ళిపోవడం అనేక సందర్భాల్లో మన ఇళ్లల్లో గమనించి ఉంటాం. దీనివల్ల ఫ్రిజ్ తెరవాలంటేనే చిరాకు పుట్టించేంత దుర్వాసన వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో ఉండే ఒకే ఒక్క పదార్థం చాలు. అదే ఉప్పు. కేవలం ఒక గిన్నెడు ఉప్పుతో మీ ఫ్రిజ్ ను ఎలా కాపాడుకోవచ్చో ఇక్కడ చూడండి.

ఫ్రిడ్జ్ కి,ఉప్పుకి కనెక్షన్
మనం ఫ్రిజ్‌ను తరచుగా తెరవడం వల్ల లోపలికి గాలిలోని తేమ చేరుతుంది. ఈ తేమ కారణంగానే ఫ్రిజ్ లోని కూరగాయలు, పండ్లపై బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది అవి త్వరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఉప్పుకు సహజంగానే తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. కాబట్టి మనం ఒక గిన్నెలో ఉప్పును పెట్టి ఆ గిన్నెను ఫ్రిజ్ లో పెడితే అది ఫ్రిజ్‌లోని అదనపు తేమను పూర్తిగా గ్రహిస్తుంది. ఫలితంగా ఫ్రిజ్ లోపల పొడిగా, శుభ్రంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా వృద్ధిని సమర్థవంతంగా అరికడుతుంది.
ఉప్పుతో ప్రయోజనాలు
తేమతో పాటు ఫ్రిజ్ లోని దుర్వాసనను కూడా ఉప్పు తొలగిస్తుంది. పండ్లు, కూరగాయలు, వండిన ఆహారం నుండి వెలువడే వాసనలను ఇది పీల్చుకుంటుంది.
ఎలా వాడాలి?
ప్రతి 5 రోజులకు ఒకసారి పాత ఉప్పును తీసేసి కొత్త ఉప్పును పెట్టాలి. ఎందుకంటే తేమను, వాసనను పీల్చుకున్న తర్వాత ఉప్పు తన గుణాన్ని కోల్పోతుంది. ఈ చిన్న చిట్కాతో వర్షాకాలంలో మీ ఫ్రిజ్‌ను తాజాగా, సువాసనగా ఉంచుకోవచ్చు.



Click it and Unblock the Notifications