Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Sankranti 2025 Wishes: మీ ఫ్రెండ్స్‌కు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలను ఈ విధంగా తెలియజేయండి!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండగ. కొత్త ఏడాదిలో మొదటిసారిగా వచ్చే పండగ కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో ఈ పండగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. కుటుంబంతో కలిసి సంతోషాల మధ్య ఈ పండగను అత్యంత వైభాగంగా శోభాయమానంగా జరుపుకుంటారు. అంతటి పవిత్రత కలిగిన ఈ సంక్రాంతి పండగ మొదలు కావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటి గొప్ప, విశేషమైన పండగకు మీ ఆత్మీయులకు, స్నేహితులకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేయండి. వారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపండి.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో..
సరదాల సంక్రాంతి మీ ఇంట్లో ఎల్లపుడూ సరదాలు నింపాలని, మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొనాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి ముగ్గుల్లోని అందం, పండగలో ఆనందం మీ జీవితంలో కూడా వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రమా
ఆ గాలిపటాల మాదిరిగానే మీ జీవితం కూడా చాలా కలర్‌ఫుల్‌గా మారాలని, మీకు అంతులేని విజయాలు చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను మిత్రమా. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
గాలిపటంలోని రంగులు, పాలలోని తెలుపు, చేరుకులోని తీపి అన్నీ మీ జీవితంలో సుఖసంతోషాలు కలగజేయాలి. ఈ సంక్రాంతి మీ జీవితంలో గొప్ప మార్పులకు పునాది కావాలి. హ్యాపీ సంక్రాంతి మిత్రమా.
నూతన సంవత్సరంలో నూతనంగా వచ్చిన ఈ పండగ, మీ జీవితంలో నూతనమైన మార్పులు తీసుకురావాలని మీకంతా కొత్త కొత్త విధాలుగా కలిసి రావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ మకర సంక్రాంతి మీకు మధురమైన క్షణాలను, మధురమైన జ్ఞాపకాలను అందించాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు
సంకాంతికి ఉదయించే సూర్యుడితో మీ జీవితంలో కూడా మంచి, గొప్ప విజయాలు ఉదయించాలని, మీ జీవితం మొత్తం సుఖమయంగా మారాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు
భోగి మీకు భోగాలు ఇవ్వాలని, సంక్రాంతి మీ ఇంట్లో సందడి తీసుకురావాలని, కనుమ మీకు కనువిందు చేసే మధురమైన జ్ఞాపకాలను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
భోగాలను ఇచ్చే భోగి, సరదాలను ఇచ్చే సంక్రాంతి, కమ్మని మధురమైన జ్ఞాపకాలకు నెలవైన కనుమ మీ జీవితంలో కమ్మని మధురమైన జ్ఞాపకంగా మారాలని ఆ దేవుడిని మనసారా వేడుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు
ఇంటి ముందు కళకళలాడే రంగుల మాదిరిగా మీ జీవితం కూడా సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలతో కళకళలాడాలని మనసారా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications
