Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పల్లె పిలుస్తోంది.. పండగ వచ్చేసింది..2026 సంక్రాంతి తేదీలు,శుభ ముహూర్తాలు
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే మనందరికీ గుర్తుకొచ్చే,మనసును ఉల్లాసపర్చు మొదటి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే తెలుగు వారికి కేవలం పండుగ మాత్రమే కాదండోయ్..అదొక ఎమోషన్ కూడా. తెలుగు వారి సంస్కృతికి, సంప్రదాయానికి, మమకారాలకు నిలువుటద్దం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్యకాలం, చలి గాలులను పక్కకు నెట్టి, వెచ్చని ఆశలను మన జీవితాల్లోకి తీసుకువస్తుంది.
నగరాల ఉరుకులు పరుగుల జీవితం నుండి కాస్త సేద తీరడానికి, సొంత ఊరి మట్టి వాసన చూడడానికి ప్రతి ఒక్కరూ ఎదురుచూసే సమయం ఇది. పచ్చని పొలాలు, గాలిపటాల సందడి, బంతిపూల అందాలతో పల్లెటూర్లు పండగకు స్వాగతం పలుకుతాయి. పట్నంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా సంక్రాంతి అనగానే మనసు పల్లెటూరి వైపు లాగుతుంది.

భోగి మంటల వెలుగులు
సంక్రాంతి సంబరం భోగితో మొదలవుతుంది. పాత ఆలోచనలను, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి, కొత్త ఉత్సాహంతో జీవించమని ఈ రోజు చెబుతుంది. చిన్నారులకు రేగుపళ్లు పోసి, వారిని ఆశీర్వదించడం, తలంటి స్నానాలు చేయడం మన ఆచారం.
మకర సంక్రాంతి లక్ష్మి
రెండో రోజు అసలైన పెద్ద పండగ. తెల్లవారుజామునే ఆడపడుచుల ముగ్గులు, రంగురంగుల రంగవల్లుల మధ్య గొబ్బెమ్మలు ఇంటి ముందు కనువిందు చేస్తాయి. కొత్త బట్టలు ధరించి, కొత్త బియ్యం, బెల్లం, పాలతో పొంగలి వండి సూర్య భగవానుడికి నివేదిస్తారు.
హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు మన జానపద కళలను గుర్తుచేస్తాయి. అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు ఇంటింటికీ తిరుగుతుంటే ఆ సందడే వేరు.
కనుమ
రైతన్నకు వ్యవసాయంలో అండగా నిలిచే పశువులను పూజించే రోజు కనుమ. పశువులను అందంగా అలంకరించి, వాటిని గౌరవించడం మన కృతజ్ఞతా భావానికి నిదర్శనం. ఈ రోజు మాంసాహార విందులు, బంధువుల కలయికలతో ఇల్లు కోలాహలంగా మారుతుంది.
పిండివంటలు, గాలిపటాలు
నేతి అరిసెలు, సకినాలు, బొబ్బట్లు, చక్కిలాలు.. పిండివంటల ఘుమఘుమలు లేకుండా సంక్రాంతి పూర్తి కాదు. ఇక ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతుంటే, మనసు కూడా అంతే ఉల్లాసంగా గాలిలో తేలుతుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ పంతాలకు పోయి మరీ గాలిపటాలు ఎగురవేయడం ఒక ఆనందకరమైన అనుభూతి.
2026 సంక్రాంతి పండుగ షెడ్యూల్ (తేదీలు)
జనవరి 13, 2026 (మంగళవారం): భోగి పండుగ
జనవరి 14, 2026 (బుధవారం): మకర సంక్రాంతి
జనవరి 15, 2026 (గురువారం): కనుమ
జనవరి 16, 2026 (శుక్రవారం): ముక్కనుమ
సంక్రాంతి పుణ్యకాలం,శుభ సమయాలు
మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయాన్ని సంక్రమణం అంటారు.
సంక్రమణ సమయం: 2026, జనవరి 14న ఉదయం పూట సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
పుణ్యకాలం: సంక్రమణం జరిగినప్పటి నుండి సాయంత్రం వరకు పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నానాలు, దానాలు, జపాలు విశేష ఫలితాలను ఇస్తాయి.



Click it and Unblock the Notifications