సంక్రాంతికి ఊరెళ్లేవారికి శుభవార్త..మరికొన్ని స్పెషల్ ట్రైన్స్..పూర్తి వివరాలు

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పట్నం మొత్తం పల్లె బాట పడుతుంది. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి సొంతూరికి వెళ్లడం ఒక ఎమోషన్. అందుకే ఇప్పుడు హైదరాబాద్ సహా ప్రధాన నగరాలన్నీ ఖాళీ అవుతున్నాయి.

కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
ప్రస్తుతం హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాలు చీమల దండులా కదులుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

Sankranti 2026 Rush Alert SCR Announces New Special Trains

కాలు పెట్టడానికి కూడా చోటు లేనంతగా రద్దీ నెలకొంది. టికెట్లు దొరక్క, ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు భరించలేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఎలాగైనా సంక్రాంతి పండగకి ఊరు చేరాల్సిందేనని చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు.

ఊరటనిచ్చే వార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
ఈ రద్దీని, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రైళ్లకు తోడుగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వివిధ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు వెళ్లేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

సంక్రాంతికి ముందు నడిచే ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి స్పెషల్ పండరపూర్ - తిరుపతి (07032): జనవరి 12న రాత్రి 7.30 గంటలకు బయల్దేరి 13వ తేదీ రాత్రి 10.30 గంటలకు చేరుతుంది.

అకోలా - తిరుపతి (07606): జనవరి 12న రాత్రి 10.50 గంటలకు బయల్దేరి, 13వ తేదీ ఉదయం 6.25 గంటలకు తిరుపతి చేరుతుంది.

ఆల్ఫా - తిరుచానూరు (07609): జనవరి 13న ఉదయం 8.18 గంటలకు బయల్దేరి, 14వ తేదీ ఉదయం 10.45 గంటలకు చేరుతుంది.

చర్లపల్లి - కొల్లం జంక్షన్ (07113): జనవరి 14న సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి, 15వ తేదీ ఉదయం 5.40 గంటలకు చేరుతుంది.

నాందేడ్ - తిరుచ్చిరాపల్లి (07615): జనవరి 14న ఉదయం 8.55 గంటలకు బయల్దేరి, 15వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుతుంది.

కాచిగూడ - తిరుచానూరు (07787): జనవరి 14న తెల్లవారుజామున 4.30 గంటలకు బయల్దేరి, 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు చేరుతుంది.

హైదరాబాద్ - కన్యాకుమారి (07230): జనవరి 15న ఉదయం 5.40 గంటలకు నాంపల్లిలో బయల్దేరి, 16వ తేదీ ఉదయం 11.10 గంటలకు చేరుతుంది.

చర్లపల్లి - కొల్లం (07135): జనవరి 15న సాయంత్రం 5.55 గంటలకు బయల్దేరి, 16వ తేదీ ఉదయం 4.30 గంటలకు గమ్యం చేరుతుంది.

చర్లపల్లి - తిరుపతి (07001): జనవరి 15న ఉదయం 7 గంటలకు బయల్దేరి, 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు చేరుతుంది.

పండగ తర్వాత (తిరుగు ప్రయాణం)
తిరుపతి - పండరాపూర్ (07012): జనవరి 18న సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరి, 19వ తేదీ అర్ధరాత్రి 12.05 గంటలకు చేరుతుంది.

తిరుచానూరు - చర్లపల్లి (07018): జనవరి 18న సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరి, 19వ తేదీ అర్ధరాత్రి 12.10 గంటలకు గమ్యం చేరుతుంది.

కొల్లం - నాందేడ్ (07112): జనవరి 18న అర్ధరాత్రి 12.50 గంటలకు బయల్దేరి, 19వ తేదీ రాత్రి 9.55 గంటలకు చేరుతుంది.

Story first published: Monday, January 12, 2026, 12:53 [IST]
Desktop Bottom Promotion