Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంట్లోకి బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయా? పైసా ఖర్చు లేకుండా వాటిని తరిమికొట్టే బ్రహ్మాస్త్రం ఇదే!
ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా లేదా చలికాలం ఇలా ఏ సీజన్ లో అయినా సరే ఇంట్లోకి ఆహ్వానం లేకుండానే బొద్దింకలు, ఎలుకలు, ఇతర కీటకాలు రావడం సర్వసాధారణం. మనం ఎంత శుభ్రంగా ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవి ఏ మూల నుంచి వస్తాయో తెలియదు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన చాలా అపార్ట్ మెంట్లలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తోంది. వంటగదిలో సింక్ దగ్గర, గ్యాస్ పొయ్యి వెనుక, బీరువాల చాటున ఇవి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇంట్లోకి ఎలుకలు,బొద్దికల రాకతో చిరాకు వేస్తుంటది..అదే సమయంలో ఇంట్లో చాలా ధూళి రావడం, ఆహార నష్టం వంటివి జరుగుతుంటాయి.
అయితే ఇంట్లో నుంచి ఎలకలు,బొద్దింకలను తరిమికొట్టేందుకు అనేక మందులు,స్ప్రేలు వంటివి మార్కెట్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలాసార్లు ఎక్కువ ఖర్చు పెట్టి స్ప్రేలు లేదా మందులు కొన్నిసార్లు గణనీయమైన ప్రభావాన్ని చూపవు. మీరు కూడా మీ ఇంట్లో ఇదే ప్రాబ్లమ్ ఎదుర్కొంటుంటే ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి స్ప్రేలు, మందులు కొనకుండా ఇంట్లోని వంటగదిలో సులభంగా లభించే పదార్థాలతోనే ఎలుకలు, బొద్దింకల సమస్యను శాశ్వతంగా వదిలించుకోవచ్చు. ఈ కీటకాలు, ఎలుకలు మళ్లీ తిరిగి మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఓ పొడిని తయారు చేసుకోవాలి. ఈ పొడిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మీ వంటగదిలోనే లభిస్తాయి.. దీని తయారీ కూడా చాలా చాలా ఈజీ.

ఎలుకలు, కీటకాలను తరిమికొట్టే పొడి తయారీ విధానం
ఈ పొడి తయారీ కోసం ముందుగా ఓ గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి, ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు ఒక తాజా దోసకాయను తీసుకుని శుభ్రంగా కడిగి గుండ్రటి చక్రాల్లా కోయండి. మీరు తయారుచేసుకున్న పొడి మిశ్రమాన్ని ఈ దోసకాయ ముక్కలపై దట్టంగా చల్లండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలను మీ ఇంట్లో ఎలుకలు, బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో పెట్టండి. ముఖ్యంగా వంటగది సింక్ కింద, ఫ్రిడ్జ్ వెనుక, స్టోర్ రూమ్ మూలల్లో, బీరువాల కింద, తేమగా ఉండే ప్రదేశాలలో వీటిని ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
దోసకాయ సహజ వాసనతో పాటు బేకింగ్ పౌడర్ వాసన కలవడం వల్ల వచ్చే ఘాటు వాసనను బొద్దింకలు, ఎలుకలు అస్సలు భరించలేవు. చక్కెర వాసనకు ఆకర్షించబడి దగ్గరకు వచ్చినవి ఈ మిశ్రమాన్ని తిన్నప్పుడు బేకింగ్ పౌడర్ వాటి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి వాటిని చంపేస్తుంది లేదా ఆ ప్రదేశం నుంచి శాశ్వతంగా పారిపోయేలా చేస్తుంది. ఈ చిట్కాను వారానికి రెండు లేదా మూడు సార్లు పునరావృతం చేస్తేకొద్ది రోజుల్లోనే మీ ఇల్లు కీటక రహితంగా మారుతుంది. ఇది పూర్తిగా సహజమైనది కాబట్టి పిల్లలకు, పెంపుడు జంతువులకు ఎలాంటి హాని కలగదు.



Click it and Unblock the Notifications